Pawan Kalyans Weight Loss for OG : బరువు తగ్గిన పవన్ కళ్యాణ్.. ఓజీ కోసం ఫిట్‌గా మారి ట్రోల్స్‌కి చెక్ పెట్టేశాడుగా, పవర్ స్టార్ ఫిట్నెస్ రొటీన్ ఇదే
Pawan Kalyan Weight Loss : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కోసం తన లుక్స్‌ని మార్చుకున్నారు. కేవలం నాలుగు నెలల్లో బరువు తగ్గి ఫిట్‌గా మారారు.

Pawan Kalyan Lose Weight For OG : కుంభమేళాలో పవన్ కళ్యాణ్‌ని చూసి.. పర్సనాలిటీ మారిపోయిందని.. పొట్ట పెరిగిందని.. ఈయన హీరోగా ఏమి చేస్తారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ బాగా వచ్చాయి. అయితే కట్ చేస్తే.. నాలుగు నెలలు తిరిగే సరికి పవన్ కళ్యాణ్ మరోసారి తన లుక్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. అయితే ఈ సారి ట్రోల్స్ కాదండోయ్.. అన్నా.. ఏంటి అన్నా ఆ లుక్.. ఈ ఫిట్నెస్ ఏంటి అన్నా అంటూ పోస్ట్‌లు వేస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్.. దానిపైనే ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాస్త బరువు పెరిగారు. మధ్యలో హరిహరవీరమల్లు, ఓజీ షూటింగ్స్‌లో పాల్గొన్నారు కానీ.. బరువు విషయంలో పెద్దగా మార్పులు జరగలేదు. అయితే ఫిబ్రవరి 18వ తేదీన కుంభమేళాకు వెళ్లి స్నానమాచరించిన ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల్లో పవన్ కాస్త లావుగా కనిపించారు.
View this post on Instagram
సెలూన్ ఓపెనింగ్‌కి షార్ట్‌లో
ఈ మధ్యకాలంలో కుర్తా, పైజామాల్లో ఎక్కువగా కనిపించిన పీకే.. రీసెంట్గా జూన్ 8వ తేదీన సెలూన్ షాప్ ఓపెనింగ్‌కి ఎవరూ ఊహించని విధంగా షార్ట్, టీ షర్ట్‌లో వెళ్లారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ లుక్‌లో పవన్ పూర్తి ఫిట్‌గా కనిపించారు. ఇంతకీ తన లుక్‌ని ఎలా మార్చుకున్నారు.. పవన్ కళ్యాణ్ ఫాలో అయ్యే ఫిట్నెస్ రొటీన్ ఇప్పుడు చూసేద్దాం.

పవన్ ఫిట్నెస్ సీక్రెట్స్..
పవన్ కళ్యాణ్ మార్షల్స్ చేస్తారనే విషయం అందరికీ తెలుసు. అలాగే బూట్ క్యాంప్స్ ఎక్కువగా చేస్తారట. ఇది ఆయన ఫిట్‌నెస్‌లో భాగమని నటుడు గగన్ విహారి తెలిపారు. అలాగే ఆయనకు పది నుంచి 12 గంటల వర్క్ అవుట్ చేయగలిగే స్టామినా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. షూట్‌కి ముందు ఆయన బూట్ క్యాంప్స్ ఎక్కువగా చేస్తారట. దీనిని చేయడం కష్టం కానీ.. పవన్ చాలా ఈజీగా చేస్తారని తెలిపారు. ఫిట్‌నెస్‌లో భాగంగా డైట్లో కూడా మార్పులు ఉంటాయి. అలాగే ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఒక పూట భోజనమే తింటానని.. ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువగా తింటానని తెలిపారు.
గుర్తించుకోవాల్సిన విషయమేంటి అంటే నటులు షూట్లేని సమయంలో ఎలా ఉన్నా.. షూట్ ప్రారంభమయ్యే సరికి తమ లుక్‌ని చాలా ఈజీగా మార్చుకుంటారని గగన్ విహారి తెలిపారు. స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ వ్యాయామాలు చేస్తారు. దీనివల్ల వారు తమ క్యారెక్టర్‌కి తగ్గట్లు మారిపోతారు. అలాగే ప్రస్తుతం ఓజీ కోసం తన లుక్‌ని మార్చుకునే పనిలో పవన్ ఉన్నారు. దాని రిజల్ట్ రీసెంట్ ఫోటోలు చూస్తే తెలిసిపోతుంది. ఇప్పటికే అభిమానుల్లో ఓజీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ లుక్‌తో అవి మరింత రెట్టింపు అయ్యాయి.






















