ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్​గా అందరికీ సుపరిచితుడే.

పవన్ కళ్యాణ్ సినీ, రాజకీయ జీవితం గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం.

పవన్​ కళ్యాణ్​ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. అందుకే ఇంట్లో అందరూ కళ్యాణ్ బాబు అనే పిలుస్తారు.

1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో హీరోగా టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చారు.

1998లో వచ్చి తొలిప్రేమ కల్ట్ క్లాసిక్​గా నిలిచింది. అనంతరం పవర్​స్టార్​గా అభిమానులు పిలవడం ప్రారంభించారు.

మార్షల్ ఆర్ట్స్​లో పవన్ కళ్యాణ్ ప్రావీణ్యుడు. కరాటేలో బ్లాక్​ బెల్ట్​ కూడా ఉంది.

కేవలం హీరోగానే కాకుండా దర్శకుడిగా, ప్రొడ్యూసర్​గా కూడా సినిమాలు చేశారు.

మార్చి 14, 2014లో జనసేనా పార్టీని ప్రారంభించారు. “Not for Power, But to Question.” అంటూ ప్రజల్లోకి వెళ్లారు.

2024లో కూటమి ప్రభుత్వంతో విజయాన్ని సాధించి ఆంధ్రప్రదేశ్​కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

రాజకీయాల్లోకి వచ్చాక కూడా సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు పవన్.