(Source: ECI/ABP News/ABP Majha)
ఫిట్స్ ఎందుకొస్తాయి? రోగి చేతిలో తాళం చేతులు ఎందుకు పెట్టకూడదు? మూర్ఛ వచ్చిన వెంటనే ఏం చేయాలి?
ఫిట్స్ బాధితుల చేతుల్లో తాళం చేతులు ఎందుకు పెడతారు? ఫిట్స్ అకస్మాత్తుగా ఎందుకు వస్తాయి? మూర్ఛ వ్యాధి లక్షణాలేమిటీ?
ఫిట్స్.. దీన్నే మనం మూర్ఛ రోగం అని కూడా పిలుస్తాం. వైద్య పరిభాషలో ఎపిలెప్సీ, సెజుర్స్ అంటారు. ఫిట్స్‌కు అనేక కారణాల వల్ల వస్తాయి. మీ శరీరంలో చక్కెర శాతం లేదా సోడియం శాతంలో హెచ్చుతగ్గులు, తలకు గాయం లేదా మెదడులో కణితి, అల్జీమర్స్ వ్యాధి, తీవ్ర జ్వరం లేదా మెదడుకు హాని కలిగించే ఇన్ఫెక్షన్లు, చిత్తవైకల్యం, నరాల సంబంధిత సమస్యలున్నా ఫిట్స్ వస్తుంటాయి. సుమారు 40 శాతం మందిలో జన్యు సంబంధం వల్లే మూర్చలు ఏర్పడుతుంటాయి.
మరింత లోతుగా వివరించాలంటే.. మెదడులోని న్యూరాన్ల సమూహం నుంచి ఆకస్మిక అనియంత్రిత విద్యుత్ చర్య వలన ఏర్పడే షాకే.. మూర్ఛ. అన్ని రకాల ఫిట్స్‌ను మూర్ఛగా పరిగణించరు. ఫిట్స్ వచ్చేందుకు దీర్ఘకాలిక రోగాలే ఉండక్కర్లేదు. ఆల్కహాల్ అతిగా తాగేవారిలో కూడా ఆకస్మాత్తుగా ఈ సమస్య రావచ్చు. రక్త ప్రవాహంలో తీవ్రమైన తగ్గుదల సైతం మూర్ఛకు కారణం కావచ్చు. ప్రతి పది మందిలో ఒకరు తమ జీవితకాలంలో మూర్ఛకు గురయ్యే అవకాశం ఉంది. కొన్ని ఫిట్స్ మరణానికి కూడా దారితీయొచ్చు. అలాంటివారికి తక్షణ చర్యలు అవసరం.
ఫోకల్ సెజుర్స్: మెదడులోని హైపర్యాక్టివేషన్ వల్ల ఈ మూర్ఛలు ఏర్పడతాయి. ఇలాంటివి ఎక్కువగా పెద్దల్లో ఏర్పడతాయి. మెదడులోని ఎడమ వైపు ఏర్పడే సమస్య వల్ల కుడి చేయి వణుకుతుంది. కుడి వైపు భాగంలో సమస్య వస్తే ఎడమ చేతిలో వణుకు ఆ తర్వాత ఫిట్స్ వస్తాయి. ఫిట్స్ వచ్చే ముందు ఆ వ్యక్తికి కళ్లల్లో మెరుపులు, వింత దృశ్యాలు కనిపిస్తాయట.
చిన్ని చిన్ని కారణాల వల్ల కూడా ఫోకల్ టెంపోరల్ లోబ్ మూర్ఛులు ఏర్పడతాయి. ఆకస్మిక భయం, ఘాటైన వాసన వంటివి మూర్ఛలకు దారితీయొచ్చు. కొన్ని మూర్ఛలకు కనీసం చికిత్స కూడా ఉండదు. అది క్రమేనా మెదడులోని కణజాలంపై ప్రభావం చూపుతాయి. చిన్న కారణానికే ఫిట్స్ వచ్చేలా చేస్తాయి. కాబట్టి, అలాంటి బాధితులను చాలా సున్నితంగా డీల్ చేయాలి. కొన్ని మూర్ఛలకు చికిత్స ఉంది. కింది లక్షణాలు కనిపిస్తే మీరు వెంటనే న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి.
ఈ లక్షణాలుంటే జాగ్రత్తపడాలి
⦿ తీవ్రమైన చెమట, వికారం, మైకం.
⦿ నోట్లోంచి లాలాజలం కారడం.
⦿ తలనొప్పి, చెవిలో శబ్దాలు.
⦿ గుండె లయలో మార్పులు.
⦿ తాత్కాలిక గందరగోళం.
⦿ కండరాలు గట్టిపడటం.
⦿ కాళ్లు చేతులు వాటికవే కదిలిపోవడం.
⦿ గందరగోళం లేదా అమోయంగా ఉండటం.
⦿ భయం, ఆందోళన, బిత్తర చూపులు.
ఫిట్స్ వచ్చినవారి చేతిలో తాళాలు ఎందుకు పెడతారు?: మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళం చేతులు పెట్టడం గురించి మీరు వినే ఉంటారు. వాస్తవానికి అది మూఢనమ్మకం. ఇనుమును చేతులో పెడితే అది ఫిట్స్‌ను తగ్గిస్తుందనేది చాలా పాత నమ్మకం. ఐరన్ మెదడులోని అలజడిని కంట్రోల్ చేసి ఫిట్స్‌ను తగ్గిస్తుందని ఒకప్పుడు భావించేవారు. కానీ, ఫిట్స్ శాస్వతంగా ఉండవు. కేవలం కాసేపే ఉంటాయి. దానివల్ల తాళం చేతులు పెట్టడం వల్లే ఫిట్స్ తగ్గిపోతాయని భావించేవారట. ఫిట్స్ వచ్చినప్పుడు లోహాన్ని పెట్టడం వల్ల గాయపడే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు పలు సందర్భాల్లో హెచ్చరించారు.
ఫిట్స్ వస్తే ఏం చేయాలి?: ఫిట్స్‌కు గురైనవారు అయోమయానికి గురవ్వుతారు. ఎక్కడ పడిపోతున్నారో కూడా వారికి తెలీదు. అలాంటి వారిని ముందుగా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాలి. కాళ్లు, చేతులు పట్టుకుని ఫిట్స్‌ను బలవంతంగా ఆపేందుకు ప్రయత్నించకూడదు. బాధితుడిని ఎక్కువగా కదిలించకూడదు. దుస్తులను వదులు చేసి గాలి ఆడేలా చూడాలి. ఒక పక్కకు ఒరిగి ఉండేలా పట్టుకోవాలి. ఫిట్స్ ఎంతకీ తగ్గకపోయినట్లయితే వెంటనే హాస్పిటల్‌కు తరలించాలి. మూర్ఛవ్యాధితో బాధపడేవారు స్విమ్మింగ్ చేయకూడదు, పరుగులు పెట్టకూడదు, డ్రైవింగ్ చేయకూడదు. డ్రైవింగ్ సమయంలో లక్షణాలు కనిపిస్తే వెంటనే వాహనాన్ని పక్కకు పార్క్ చేయాలి. మూర్ఛ వల్ల మెదడుకు నష్టం ఉండదు. కానీ, అది ఒక రకమైన షాక్ లేదా ఆకస్మికంగా జర్క్ ఇవ్వడం వల్ల ఆ సమస్య ఏర్పడుతుంది. ఫిట్స్ వస్తే కొందరు నాలుక కొరికేసుకుంటారు. కిందపడిపోవడం వల్ల ఎముకలు విరిగిపోతాయి. కాబట్టి, ఫిట్స్ వచ్చినవారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించడం ఉత్తమ మార్గం.
Also Read: బాతు నూనె గురించి తెలుసా? దీనితో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు
Also Read: తొలి అవయవదానం ఎప్పుడు జరిగిందో తెలుసా? అవయవదానంపై ఉన్న అపోహలు - వాస్తవాలు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.