Optical Illusion: అర నిమిషంలో ఆ బిడ్డ తండ్రి ఎవరో కనిపెట్టండి, అలా చేస్తే మీ మెదడు పనితీరు సూపర్
కాస్త లాజికల్ గా ఆలోచిస్తే ఆ బిడ్డ తండ్రి ఎవరో కనిపెట్టేయవచ్చు.
Optical Illusion: రోజువారీ జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలంటే మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఆ సవాళ్లను ఎదుర్కొనే సామర్ధ్యం మెదడుకు కూడా కావాలి. మెదడును అలాంటి సవాళ్లకు సిద్ధం చేయాలంటే సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యాన్ని దానికి అందించాలి. అనేక అధ్యయనాల ప్రకారం మీ మెదడును పదునుగా ఉంచడానికి పజిల్స్ గొప్ప మార్గం. తరచూ పజిల్స్ తో ఆడుకునేవారి మెదడు చాలా చురుగ్గా ఉంటుంది. తార్కికంగా, లాజికల్ గా ఆలోచిస్తుంది. మెదడుకు పదును పెట్టే ప్రశ్న ఇది.
ప్రశ్న ఇది...
ఇక్కడిచ్చిన ఫోటోలో అయిదుగురు వ్యక్తులు ఉన్నారు. అందులో ముగ్గురు పురుషులు, ఒక స్త్రీ, ఒక బిడ్డ. మహిళ చంటి బిడ్డను ఎత్తుకుని ఉంది. అక్కడున్న పురుషుల్లో బిడ్డ తండ్రి ఎవరో కనిపెట్టి చెప్పండి. కాస్త లాజికల్ గా ఆలోచిస్తే చెప్పేయడం సులువే. సమయం ఎక్కువ తీసుకంటే ఎవరైనా చెప్పేయగలరు. కేవలం అర నిమిషంలోనే చెప్పాలి.
జవాబు ఇదిగో...
30 సెకన్లలోపు జవాబును కనిపెట్టిన వారికి చప్పట్లు. కాస్త ఎక్కువ సమయం తీసుకుని సమాధానాన్ని చెప్పిన వారిని కూడా ప్రశంసిస్తున్నాం. జవాబు తెలియక కొట్టుమిట్టాడుతున్న వారి కోసమే ఈ జవాబు. చిత్రంలో ఉన్న మూడో వ్యక్తి ఆ బిడ్డ తండ్రి. లాజికల్ గా ఆలోచిస్తే జవాబును కనిపెట్టేయ వచ్చు. ఒకటో వ్యక్తి, రెండో వ్యక్తి జుట్టు నలుపు రంగులో ఉంది. కానీ బిడ్డ జుట్టు నలుపు రంగు కాదు. తండ్రి నుంచి వారసత్వంగా జుట్టు రంగును బిడ్డ పొందే అవకాశం ఉంది. అలా చూస్తే 3వ వ్యక్తి బిడ్డ తండ్రి. బిడ్డ కంటి రంగు కూడా 3 వ వ్యక్తిని పోలి ఉంది. కాబట్టి అతనే బిడ్డ తండ్రి.
ఆప్టికల్ ఇల్యూషన్ కళ్లను మాయ చేసే అందమైన కళ. కంటిచూపుకు, మెదడుకు మధ్య ఉన్న బంధం ఎంత బలంగా ఉందో ఆప్టికల్ ఇల్యూషన్ ఇట్టే చెప్పేస్తుంది. నిజం చెప్పాలంటే ఈ చిత్రాలు కంటికి, మెదడుకు సవాలు విసిరేలా ఉంటాయి. ఇవి మంచి టైమ్‌పాస్‌లా ఉంటాయ. మెదడుకు మేతగా ఉంటాయి. వీటిలో కళ్ల ముందే అంతా స్పష్టంగా కనిపిస్తున్నా... కనిపించని దాన్ని మెదడు, కళ్ల సమన్వయంతో వెతకడమే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ పని. దీని పుట్టుక వెనుక ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. వందల ఏళ్ల క్రితం నాడు ఇవే ప్రాచీన ప్రజలకు వినోదాన్ని పంచింది. ప్రశ్ననూ, జవాబునూ రెండింటినీ తనలోనే దాచుకోవడం ఈ బొమ్మల ప్రత్యేకత. మెదడును కాసేపు గజిబిజి చేసేస్తుంది.
Also read: తల్లిపాలు పిల్లలను క్యాన్సర్ నుండి కాపాడతాయా? వైద్యనిపుణులు ఏం చెబుతున్నారు?
Also read: జుట్టు ద్వారా మీకు భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందో లేదో చెప్పేయచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.