అన్వేషించండి

Fermented Rice : ఉదయాన్నే చద్దన్నం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. ఎలా చేసుకోవాలో తెలుసా? ఫెర్మెంటెడ్ రైస్ రెసిపీ ఇదే

Chaddannam Recipe : ఎండలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండేందుకు మీ డైట్​లో చద్దన్నం(Fermented Rice) చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. దానివల్ల ఎన్నో లాభాలు పొందవచ్చని చెప్తున్నారు. అవేంటంటే..

Fermented Rice for Breakfast : చద్దన్నం గురించి పెద్దలకు బాగా తెలుసు. ఈ రోజుల్లో కొందరికి తెలియకపోవచ్చు. మరికొందరు తెలిసినా తినడానికి ఆలోచిస్తారు. కానీ ఒకసారి దీనిని తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. తప్పకుండా దానిని డైట్​లో చేర్చుకుంటారు. ఉదయాన్నే చద్దన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో.. దానిని ఎలా చేసుకుని తింటే మంచిదో ఇప్పుడు చూసేద్దాం. 

చద్దన్నాన్ని ఫెర్మెంటెడ్ రైస్ అంటారు. అంటే అన్నాన్ని పులియబెట్టడం అనమాట. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం నుంచి.. శక్తి స్థాయిలను రెట్టింపు చేయడం వరకు ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. ట్రెండీ డైట్స్ కంటే ఇది ఎంతో సహజమైన ప్రోబయోటిక్ ఆహారంగా చెప్పవచ్చు. తక్కువ ఖర్చుతో తేలికగా ఇంట్లో తయారు చేసుకునే ఈ వంటకం ప్రయోజనాలు తెలుసుకుందాం.

గట్ హెల్త్.. 

చద్దన్నం పేగు ఆరోగ్యం, జీర్ణక్రియకు సహజ బూస్టర్​గా పనిచేస్తుంది. రాత్రంతా నీటిలో నానబెట్టిన అన్నంలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇవి సహజమైన ప్రోబయోటిక్స్‌గా పనిచేస్తాయి. ఇది గట్ ఫ్లోరాను సమతుల్యం చేసి.. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం తగ్గిస్తాయి. పోషకాలు శరీరంలో బాగా గ్రహించేందుకు సహాయపడతాయి.  

వేడి నుంచి ఉపశమనం.. 

ఆయుర్వేదం ప్రకారం ఇది శరీరంలోని అంతర్గత వేడిని తగ్గిస్తుంది. వేసవికాలంలో అలసట, సన్‌స్ట్రోక్, చర్మ సమస్యలు నివారించడంలో హెల్ప్ చేస్తుంది. చల్లని పెరుగును ఉల్లిపాయలు, మజ్జిగతో తింటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.

రోగనిరోధక శక్తికై..

మన గట్ ఆరోగ్యం బాగుంటే రోగనిరోధక శక్తి కూడా బలంగా ఉంటుంది. ఫెర్మెంటెడ్ రైస్‌లోని ప్రోబయోటిక్స్ మంచిబ్యాక్టీరియా వృద్ధికి దోహదపడతాయి. దీనివల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇన్‌ఫ్లమేషన్ దూరమై.. వాపులు దరిచేరవు. సీజనల్ మార్పులు జరిగినా ఇబ్బంది ఉండదు.  

పోషకాల కోసం..

ఫెర్మెంటేషన్ ప్రక్రియ వల్ల అన్నంలో ఉన్న ఫిటిక్ యాసిడ్ తగ్గుతుంది. దీంతో ఐరన్, కాల్షియం, మ్యాగ్నీషియం వంటి ఖనిజాలు శరీరానికి సులభంగా అందుతాయి. రక్తహీనత ఉన్నవారికి మేలు జరుగుతుంది. తక్కువ ఎనర్జీ సమస్య ఉన్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్. 

స్కిన్ హెల్త్

చద్దన్నం శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. గట్ బ్యాలెన్స్ మెరుగుపడటంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి నానబెట్టిన గంజి నీటితో ముఖం కడుక్కోవడానికి కూడా ఉపయోగిస్తారు. ఇది స్కిన్ హెల్త్​ని బాగా ప్రమోట్ చేస్తుంది. 

చద్దన్నం తయారీ

ముందుగా అన్నాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. దానిలో తగినంత నీరు పోయాలి. రాత్రంతా నానబెట్టాలి (మట్టి లేదా గాజు పాత్రలో ఉంచితే మంచిది). ఉదయం ఉప్పు, ఆవాలు, ఉల్లిపాయలు, కరివేపాకు తాలింపు వేసుకోవచ్చు. పెరుగు కలిపి తింటే రుచిగా ఉంటుంది. అన్నం నానబెట్టిన నీరు కూడా తాగవచ్చు. అయితే కొందరు పెరుగును పలుచగా చేసి.. నీటికి బదులు ఉపయోగిస్తారు. అది కూడా మంచిదే. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Testosterone Screening After 30: టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
WHO Global Cancer Report 2026:ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
Why To Avoid Salads In Monsoon:వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
Dengue Vaccine India: డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget