News
News
X

పెరిగే వయసుకు కళ్లెం వెయ్యాలా? ఇవి తప్పక తీసుకోవాల్సిందే!

కాలం అలా ఆపేసి యవ్వనంలో నిలిచి పోవాలని ఎవరికి ఉండదు? కానీ అది ఎలా సాధ్య పడుతుంది? పూర్తిగా సాధ్య పడకపోయినా వాయిదా వెయ్యొచ్చు అంటున్నారు నిపుణులు అదెలాగో ఈ ఆర్టికల్ చదివితే అర్థం అవుతుంది.

FOLLOW US: 
 
జింగ్ అనేది ఎవరికీ ఇష్టం లేకపోయినా జీవితంలో తప్పని తతంగం. వయసు పెరగడం ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి.  రోజుల గడిచే కొద్దీ తప్పకుండా వయసు పెరుగుతుంది. అందుకు అనుగుణంగా శరీరంలో మార్పులు తప్పవు. శరీరంలో శక్తి సన్నగిల్లడం, మతి మరుపు, కొన్ని సార్లు దంతాలు ఊడి పోవడం, మాటల్లో స్పష్టత లోపించడం, దీర్ఘకాలికంగా వేదించే ఒళ్లు నొప్పులు ఇలా రకరకాల సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అందుకే వయసు పెరగడం ఎవరికి సంతోషంగా ఉండదు.

అయితే మన శరీరాలను బాగా చూసుకుంటే కొన్నాళ్లయినా వయస్సును వెనక్కి నెట్టవచ్చు. కింగ్ నాగార్జునలా యవ్వనంగా కనిపించవచ్చు. సమతుల ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం ద్వారా పెరిగే వయసు పెద్దగా బాధించదనేది నిపుణుల అభిప్రాయం. ఇక న్యూట్రిషన్ విషయానికి వస్తే ఆరోగ్యవంతంగా యవ్వనంగా కనిపించేందుకు కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు ఉన్నాయట. ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్లతో నిండివున్న గింజలు అవే అవిసెలు లేదా అవిసెగింజలు వీటినే ఫ్లాక్ సీడ్స్ అంటారు.

ఈ గింజలు క్రమం తప్పకుండా తీసుకుంటే దీర్ఘాయువు సాధ్యమే అని నిపుణులు అంటున్నారు. యువకుల నుంచి వృద్ధుల వరకు అందరూ రోజువారీ ఆహారంలో ఒకటి రెండు స్పూన్ల  అవిసెగింజలను చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు. సలాడ్లో లేదా ఓట్మీల్ మిక్చర్ లో వీటిని కలుపుకోవడం వల్ల మరింత మంచి ఫలితాలు ఉంటాయట. ఇది పొడిగా తీసుకున్నా ఫర్వాలేదంటున్నారు.

రెండు స్పూన్ల అవిసె గింజల్లో ఉండే పోషకాలు

2.6 గ్రా. ప్రొటీన్

News Reels

37 కాలరీలు

2 గ్రాముల డైటరీ ఫైబర్

2 గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్

అవిసె గింజల పొడి కూడా చాలా ఆరోగ్యకరం. ఇలా పొడి రూపంలో తీసుకున్నపుడు జీర్ణం కావడానికి సులభంగా ఉంటుంది. పొడి రూపంలో వీటిలోని పోషకాలను శరరీం త్వరగా గ్రహిస్తుంది. కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టుకుంటే వాడుకునేందుకు సులభంగా ఉంటుంది.

యవ్వనంగా ఉంచడంలో అవిసె గింజల ప్రాధాన్యత

మధ్య వయసు చివరలో ఉన్న వారిలో ఏజింగ్ కు సంబంధించిన సమస్యలు నెమ్మదిగా బాధించడం మొదలవుతుంది. ఇలాంటి సమస్యలను వాయిదా వెయ్యడంలో అవిసెగింజలు మంచి పాత్ర పోషిస్తాయి.

  • వీటిలో ఉంటే పోషకాలు ఒబెసిటిని తగ్గిస్తాయి.
  • దీర్ఘకాలంగా వేధించే డయాబెటిస్ వంటి సమస్యలను ఎదుర్కోడానికి తోడ్పడుతాయి.
  • శరీరంలో ఇన్ప్లమేషన్ తగ్గిస్తాయి.
  • ఇవి మంచి యాంటీ క్యాన్సరస్ ఆహారం.
  • కిడ్ని ఆరోగ్యానికి కూడా మంచిది.
  • గుండె ఆరోగ్యానికి దోహదం చేసి హార్ట్ ఎటాక్ రిస్క్ లేకుండా చేస్తాయి.
  • కొలెస్ట్రాల్, బీపి ని అదుపులో ఉంచుతాయి.
  • మెదడు పని తీరును కూడా మెరుగు పరిచి డిమెన్షియా, అల్జైమర్స్ నుంచి రక్షిస్తాయి.
  • కండరాల క్షీణతను వాయిదా వేసి మొబిలిటి సమస్యలు రాకుండా కాపాడుతాయి.

Also Read: మీరు కాఫీ ప్రియులా? అయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కినట్టే

Also read: ఈ ఎర్రని పండ్ల రసం సహజంగా నిద్రలేమిని అంతం చేస్తుంది, మందులు అవసరమే ఉండదు

Published at : 01 Oct 2022 08:31 PM (IST) Tags: aging nutrition flaxseeds aging problems

సంబంధిత కథనాలు

Electric Shock: కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు, వెంటనే ఇలా చేయాలి

Electric Shock: కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు, వెంటనే ఇలా చేయాలి

ఓ మై గాడ్, ఆహారంలో దంతం - విమాన పాసింజర్‌కు చేదు అనుభవం, ఇలా జరిగితే కేసు వేయొచ్చు!

ఓ మై గాడ్, ఆహారంలో దంతం - విమాన పాసింజర్‌కు చేదు అనుభవం, ఇలా జరిగితే కేసు వేయొచ్చు!

South Koreans: సౌత్ కొరియన్ల వయసు తగ్గిపోతుందట, ఏమైనా మేజిక్ చేస్తున్నారా ఏంటి?

South Koreans: సౌత్ కొరియన్ల వయసు తగ్గిపోతుందట, ఏమైనా మేజిక్ చేస్తున్నారా ఏంటి?

ప్రమాదంలో మగజాతి - భూమిపై అంతరించిపోతున్న పురుషులు? - కారణాలివేనట!

ప్రమాదంలో మగజాతి - భూమిపై అంతరించిపోతున్న పురుషులు? - కారణాలివేనట!

Diabetes: మీలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేనట్టే

Diabetes: మీలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేనట్టే

టాప్ స్టోరీస్

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు