(Source: ECI/ABP News/ABP Majha)
ఈ ఎర్రని పండ్ల రసం సహజంగా నిద్రలేమిని అంతం చేస్తుంది, మందులు అవసరమే ఉండదు
నిద్రసరిగా పట్టకపోవడం అనేది చాలా మందిలో ఉన్న సమస్య.
ఒత్తిడి, ఆధునిక జీవితంలో ఉన్న ఒడిదుడుకుల కారణంగా నిద్రలేమి సమస్య ఎక్కువ మందిని వేధిస్తోంది. నిద్రమాత్రలు ఒక్కసారి వాడడం మొదలుపెట్టారంటే ఇక అదే అలవాటుగా మారి, సహజంగా నిద్రపట్టడం తగ్గిపోతుంది. అందుకే నిద్రమాత్రలు వాడడం అనేది మంచి పద్ధతి కాదు. సహజంగానే నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవాలి. అందు ఈ ఎర్రటి పండ్ల రసం నిద్ర సమస్యను దూరం చేస్తుంది. ఎర్రటి పండ్ల రసం అనగానే దానిమ్మ అనుకుంటున్నారా? కాదు చెర్రీ పండ్ల రసం.
చెర్రీ పండ్లను కేవలం కేకులపై వేసుకుని చల్లుకుని తినడానికే ఉపయోగిస్తారు. ఈ పండులో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, ఎ, కె, కాల్షియం, బీటా కెరాటిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి శరీరానికి చాలా అత్యవసరమైనవి. ఈ పండులో మెలటోనిన్ అధికంగా ఉంటుంది. ఈ పండ్లను తిన్నా లేదా ఆ పండ్ల రసం తాగినా నిద్ర సమస్యలు దూరం అవుతాయి. నిద్రలేమి సమస్య క్రమేణా తగ్గుతుంది. అంతేకాదు బాగా నిద్రపట్టడంలో కాలక్రమేణా నిద్రా సమయాన్ని పెంచడంల సహాయపడుతుంది.
ఎలా సహాయపడతాయి?
చెర్రీపండ్లు నిద్రా సమస్యలను తగ్గించడంలో ఎలా సహాయపడతాయో నిపుణులు వివరిస్తున్నారు. పీనియల్ గ్రంధి నిద్రాహార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ పాక్షికంగా నిద్రా చక్రాన్ని ప్రభఆవితం చేస్తుంది. ఈ హార్మోనును అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో చెర్రీపండ్లు మేలు చేస్తాయి. వీటిలోని ఎంజైమ్‌లు నిద్రపోవడానికి మాత్రమే కాకుండా ఎక్కువసేపు నిద్రపోవడానికి కూడా సహాయపడతాయి. చెర్రీల్లో మోంట్‌మోరెన్సీ రకం చెర్రీ పండ్లలో సహజ మెలటోనిన్ ఎక్కువగా ఉంటుంది.
నిద్ర సమస్యలకు చికిత్స చేయడానికి రాత్రి పడుకోవడానికి అరగంట లేదా గంట ముందు చెర్రీ పండ్లను తినాలి. లేదా జ్యూస్ రూపంలో తీసుకోవాలి. చక్కెర మాత్రం కలుపుకోకూడదు. రక్తాన్ని పలుచన చేసే మందులను తీసుకునే వారు మాత్రం చెర్రీ పండ్లను తినే ముందు వైద్యుడిని సంప్రదించాలి. గ్లాసుడు జ్యూసు తాగకుండా పావు గ్లాసుతో మొదలుపెట్టాలి. దీన్ని తాగడం మొదలుపెట్టాక మీకే మంచి మార్పు కనిపిస్తుంది. చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని తినడం వల్ల గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు రావు. డయాబెటిస్ కూడా రాకుండా ఉంటుంది.
Also read: నెలరోజులు నిల్వ ఉండేలా కోడిగుడ్డు పికిల్, చికెన్ పచ్చడిలాగే చాలా రుచి
Also read: ప్రపంచంలోనే అతిపెద్ద మాంసాహార పువ్వు హఠాత్తుగా కనిపిస్తే, మీరూ చూడండి ఆ వీడియో
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.