News
News
X

Egg Pickle: నెలరోజులు నిల్వ ఉండేలా కోడిగుడ్డు పికిల్, చికెన్ పచ్చడిలాగే చాలా రుచి

నిల్వ పచ్చళ్లు ఇంట్లో ఉంటే ఆ ధీమానే వేరు. ఈసారి కోడిగుడ్డు పచ్చడి కూడా ప్రయత్నించండి.

FOLLOW US: 
 
నిల్వ పచ్చళ్లు అంటే తెలుగు వారికి ఎంతో ప్రీతి. నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ పచ్చళ్లు, టమాటా పచ్చడిని చాలా ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ ప్రియుల కోసం చికెన్, మటన్ పచ్చళ్లు ఉన్నాయి. రొయ్యల పచ్చడికి కూడా ఫ్యాన్స్ ఎక్కువ. ఎప్పుడైనా కోడిగుడ్డు పచ్చడి తిన్నారా? అదెలా చేస్తారు అనుకుంటున్నారా? చికెన్ పచ్చడిలాగే దీని రుచి కూడా అదిరిపోతుంది. అందులోనూ ఒక్కసారి చేసుకుంటే నెలరోజులు పాడవ్వకుండా ఉంటుంది కనుక హ్యాపీగా తినవచ్చు. కూర వండుకునే ఓపిక లేనివారికి ఈ పచ్చడి ఎంతో సాయంగా అనిపిస్తుంది. రుచిలో కూడా అదిరిపోతుంది. మసాలా దట్టించిన కోడిగుడ్డు గ్రేవీ తిన్నట్టు ఉంటుంది. పచ్చడి అనగానే కోడి గుడ్డును ముక్కలు చేస్తామేమో అనుకోవద్దు. గుడ్డుకు గుడ్డు పూర్తిగా ఉంటుంది.  

కావాల్సినవి
కోడిగుడ్లు - ఎనిమిది
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
ఆవ నూనె  - ఆరు టీస్పూన్లు
గరం మసాలా - నాలుగు టీస్పూన్లు
కారం - రెండు టీస్పూన్లు
జీలకర్ర - రెండు టీస్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
మెంతి పొడి - రెండు స్పూన్లు
ఆవ పొడి - రెండు స్పూన్లు
కరివేపాకులు - మూడు రెమ్మలు
నిమ్మకాయ రసం - రెండు స్పూన్లు

తయారీ ఇలా
1. కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. 
2. ఇప్పుడు కళాయిలో కాస్త నూనె వేసి కోడిగుడ్లు వేయించాలి. కోడిగుడ్లకు గాట్లు పెడితే బాగా వేగుతాయి. 
3. కోడిగుడ్ల రంగు కాస్త మారేవరకు వేయించాలి. 
4. తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. 
5. అది వేగాక కారం, గరంమసాలా ఉప్పు వేసి కాసేపు వేయించాలి. 
6. అన్నీ వేగాక కరివేపాకులు వేసి కలిపి స్టవ్ కట్టేయాలి. 
7. ఈ మొత్తం మిశ్రమాన్ని చల్లార్చాలి. చల్లారాక అందులో ఆవపొడి, మెంతి పొడి వేసి కలపాలి. 
8. చివర్లో నిమ్మరసం పిండి బాగా కలపాలి. 
9. ఇది గ్రేవీలా ఉంటుంది. కాబట్టి వేడి వేడి అన్నంతో తింటే ఆ రుచే వేరు. 

కోడిగుడ్డు తినడం వల్ల ఉపయోగాలెన్నో...
కోడిగుడ్డు తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్ డి కూడా దొరుకుతుంది. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి... పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉండే కోలిన్ అనే పోషకం మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పిల్లలు, గర్భిణులు, బాలింతలు కచ్చితంగా రోజుకో గుడ్డు తినాలి. దీనివల్ల వారికి శరీరానికి కావాల్సినంత శక్తి అందుతుంది. గుడ్డు తినే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. గుడ్లలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిచూపును కాపాడుతుంది. నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నవారు గుడ్డు తినడం వల్ల త్వరగా దాన్నుంచి  బయటపడతారు. గుండెకు, రక్తనాళాలకు దీనిలోని పోషకాలు ఎంతో మేలు చేస్తాయి.

News Reels

Also read: ప్రపంచంలోనే అతిపెద్ద మాంసాహార పువ్వు హఠాత్తుగా కనిపిస్తే, మీరూ చూడండి ఆ వీడియో

Also read: కోపం, ఒత్తిడి ఉన్నప్పుడు తీవ్రమైన వ్యాయామాం చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువా?

Published at : 29 Sep 2022 08:15 PM (IST) Tags: Egg Recipes in Telugu Telugu Recipes Telugu Vantalu Egg Pickle Recipe in Telugu Egg Pickle

సంబంధిత కథనాలు

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

Milk: నెయ్యి కలిపిన పాలు రోజుకో గ్లాస్ తాగారంటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి

Milk: నెయ్యి కలిపిన పాలు రోజుకో గ్లాస్ తాగారంటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి

Curry Leaves: కరివేపాకు తినకుండా పక్కన పెట్టేస్తున్నారా? ఈ ప్రయోజనాలన్నీ మిస్ అవుతునట్టే!

Curry Leaves: కరివేపాకు తినకుండా పక్కన పెట్టేస్తున్నారా? ఈ ప్రయోజనాలన్నీ మిస్ అవుతునట్టే!

Diabetes: శీతాకాలంలో మధుమేహ రోగులు కచ్చితంగా తినాల్సిన కూరగాయలు ఇవే

Diabetes: శీతాకాలంలో మధుమేహ రోగులు  కచ్చితంగా తినాల్సిన కూరగాయలు ఇవే

టాప్ స్టోరీస్

Hyderabad Real Estate: సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్‌!

Hyderabad Real Estate: సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్‌!

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

TRS MLAs Poaching Case: రామచంద్ర భారతి, నంద కుమార్‌ ను విడుదల చేసినట్లే చేసి మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు!

TRS MLAs Poaching Case: రామచంద్ర భారతి, నంద కుమార్‌ ను విడుదల చేసినట్లే చేసి మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు!