అన్వేషించండి

Workout Time: వ్యాధులకు గుడ్‌బై చెప్పాలంటే.. ఇదే కరెక్ట్ ‘టైమ్’ - అర్థం కాలేదా? స్టడీలో ఏం తేలిందో చూడండి

Workout Time : చాలా మందికి వ్యాయామం ఎప్పుడూ చేస్తే మంచిదనే సందేహం ఉంటుంది. కొందరు ఉదయం చేస్తే ఇంకొంతమంది సాయంత్రం చేస్తుంటారు. వ్యాయామంతోపాటు ఆయుష్షు పెంచే ఈ 9 హ్యాక్స్ గురించి తెలుసుకోండ.

Workout Time : ఎక్కువకాలం బతకాలని ప్రతీఒక్కరూ కోరుకుంటారు. ఇది సాధారణమైన విషయమే. అందుకే జీవనశైలిని మార్చుకుంటారు. తీసుకునే ఆహారంలో మార్పులు చేస్తారు. అయితే మనకు తెలిసో తెలియకనో చేసే కొన్ని తప్పులు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందుకే మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవడం, ఒత్తిడిని తగ్గించడంతోపాటు శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే అనేక వ్యాధులకు దూరంగా ఉంటూ ఎక్కువ కాలం జీవించవచ్చన్న సంగతి మనందరికీ తెలిసిందే. 

అయితే వ్యాయామం చేయడం అంటే గంటల తరబడి చెమటలు చిమ్ముతూ జిమ్ లో గడపడం కాదంటున్నారు సిడ్నీ విశ్వవిద్యాలయం పరిశోధకులు. 8 ఏళ్ల కాలంలో ఊబకాయంతో బాధపడుతున్న 30 వేల మందిపై పలు పరిశోధనలు చేశారు. ప్రతిరోజూ వర్కౌట్ లో స్వ్కీజింగ్ చేస్తే గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చని.. మరణాల ప్రమాదాన్ని 61శాతం తగ్గించవచ్చని వారు కనుగొన్నారు.

డయాబెటీస్ కేర్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం.. అధ్యయనంలో భాగంగా యూకే బయోబ్యాంక్ 40 ఏళ్లు పైబడిన 29,836 మంది పెద్దల డేటాను విశ్లేషించింది. శారీరక శ్రమ, సమయం ఆరోగ్య ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుందో గుర్తించారు. స్థూలకాయులుగా వర్గీకరించిన వ్యక్తులపై పరిశోధకులు దృష్టి సారించారు. 30 లేదా అంతకంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్‌తో ఉన్నవారు గుండెపోటు, స్ట్రోక్, అకాల మరణం వంటి ప్రమాదం చాలా తక్కువగా ఉన్నట్లు తెలిపారు. 

టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న దాదాపు 2,995 మందిపై పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనలో పాల్గొనేవారు రోజులో ఏ సమయంలో వ్యాయామం చేయడానికి ఇష్టపడతారో నాలుగు గ్రూపులుగా విభజించారు. రోజుకు 24 గంటలు వ్యాయామ వేళలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు తెలుసుకున్నారు. ఉదయం వ్యాయామం చేసేవారి కంటే.. సాయంత్రం వేళ వర్కవుట్స్ చేసేవారికే ఎక్కువ రోజులు బతికే అవకాశాలు ఉన్నాయట.

మీ అలవాట్లు కూడా మీ ఆయుష్సును పెంచుతాయి

1. వంట చేయడం, స్నేహితులతో మాట్లాడటం లేదా మంచి పుస్తకాన్ని చదవడం వంటి పనులు రోజూ చేస్తూ ఆనందించండి. 

2. హైడ్రేటెడ్ గా ఉండటానికి రోజుకు ఆరు నుండి ఎనిమిది కప్పుల నీరు త్రాగాలి.

3. మీ గుండె జబ్బులు, కొన్ని క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి పండ్లు, కూరగాయలను పుష్కలంగా తినండి  , బీన్స్, పప్పులు, చేపలు, గుడ్లు మాంసాన్ని తినండి.  ఎముకలను బలంగా ఉంచడానికి శక్తి డైరీ కోసం పిండి పదార్ధాలు ఎక్కువగా తీసుకోండి. 

4. మీ ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపడం లేదా అభివృద్ధి చెందకుండా నిరోధించడానికి దీర్ఘకాలిక ఆరోగ్యంగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. 

5. ధూమపానం మానేయండి. ఆల్కహాల్ తీసుకోవడం వారానికి 14 యూనిట్లకు మించకుండా తగ్గించండి.

6. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. దానికి చికిత్స పొందండి, ఎందుకంటే ఇది శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

7. ప్రతిరోజూ 7 నుంచి 9 గంటల నిద్ర తప్పనిసరి. 

8. మీ స్నేహితులతో ప్రియమైనవారితో సంతోషంగా గడపండి. 

9. డిప్రెషన్ ,డిమెన్షియా, గుండె జబ్బులు, స్ట్రోక్, పార్కిన్సన్స్, కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడానికి శారీరకంగా చురుకుగా ఉండండి.

Read Also: గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అది స్మోకింగ్ కంటే ప్రమాదకరమట, ఎందుకంటే?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతితండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Pushpa 2: ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
Manoj: మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
Fastest Mobile Internet: ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
Embed widget