అన్వేషించండి

బరువు తగ్గాలని అనుకుంటున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవల్సిందే.

బరువు తగ్గాలని అనుకుంటున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవల్సిందే.

బరువు తగ్గడం కోసం తిండి మానేస్తారు చాలామంది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా, కొత్త రోగాలు వచ్చి పడతాయి. బరువు తగ్గాలంటే వ్యాయామానికి మించిన మంచి ఆప్షన్ ఏదీ లేదు. అలాగే, మనం తినే ఆహారం కూడా బరువు తగ్గేందుకు సహకరిస్తుందని తెలుసా? ముఖ్యంగా బాదం పప్పులు తినడం వల్ల ఆరోగ్యంతోపాటు బరువు కూడా తగ్గుతారట. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే చూడండి. 

కార్బోహైడ్రేట్ల వల్ల బరువు పెరుగుతారనేది నిర్వివాద అంశం. అయితే కార్బోహైడ్రేట్‌తో తప్ప కడుపు నిండిన భావన కలగదు. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు తిండి విషయంలో రకరకాల కష్టాలు పడుతుంటారు. భోజనం కాస్త పర్వాలేదు కానీ స్నాకింగ్ అయితే చాలా ఇబ్బంది. అధ్యయనాలు ఇప్పుడు ఒక హెల్తీ స్నాకింగ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఈ అధ్యయనంలో కార్బోహైడ్రేట్లకు బదులుగా బదాంలను స్నాకింగ్ కు ఉపయోగించుకున్నపుడు రోజులో వాడే కాలరీ ఇన్ టేక్ 72 కెలోరీలు వరకు తగ్గినట్టు గమనించారు. ప్రస్తుతం అధిక బరువు, స్థూలకాయం ప్రపంచానికి సవాళ్లు విసురుతున్నాయి. దీనిని సరిచేసే క్రమంలో  ఆకలిని నియంత్రించే హార్మోన్ల ప్రతిస్పందన అనేది ముఖ్యమైన అంశమని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ షరయా కర్టార్ అంటున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన పరిశోధనల్లో ఆకలిని నియంత్రించే హార్మోన్లను డ్రై ఫ్రూట్స్‌లో కనుగొన్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా బాదం పప్పులు ఏ విధంగా ఆకలిపై ప్రభావం చూపుతాయో తెలుసుకొనే ప్రయత్నం చేశారు. రోజూ క్రమం తప్పకుండా బాదంలు తీసుకునే వారిలో ఆకలిని నియంత్రించే హార్మోన్లలో మార్పులను గమనించారు. హార్మోన్ల పనితీరులో మార్పుల వల్ల ఆకలి తగ్గిందని, అందువల్ల ఫూడ్ ఇన్ టేక్ గణనీయంగా తగ్గిందని ఈ పరిశోధకులు అంటున్నారు.

బాదంతో కలిగే లాభాలు

  • బాదంతో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. బాదంలో ప్రొటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు, పీచు పదార్థం ఉంటాయి. ఇవి డయాబెటిక్ రోగులకు మంచి స్నాక్.
  • వంద గ్రాముల బాదంతో 571 కిలో కేలరీల శక్తి అందుతుంది.  వీటిలో ప్రొటీన్ 21.43 గ్రాములు, కార్బోహైడ్రేడ్ 21.43 గ్రాములు, పీచు పదార్థాలు 10.7 గ్రాములు, కొవ్వు 50 గ్రాములు ఇవే కాకుండా ఇంకా అనేక సూక్ష్మపోషకాల కూడా ఉంటాయి.
  • బాదం పప్పులు క్రమం తప్పకుండా తీసుకున్నపుడు మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
  • బాదంలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో అవసరం. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
  • క్యాన్సర్ పేషెంట్లకు కూడా బాదం చాలా మంచి బలవర్థకమైన ఆహారం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికం కనుక శరీరంలో జరిగే ఆక్సిడేషన్ ప్రక్రియను నియంత్రిస్తాయి.
  • 12 వారాల పాటు బాదం క్రమం తప్పకుండా వినియోగించిన టైప్ 2 డయాబెటిక్ పేషెంట్లలో ఇన్ఫ్లమేషన్ తగ్గడం మాత్రమే కాదు ఆక్సిడేషన్ ప్రక్రియ కూడా నెమ్మదించడాన్ని ఒక క్లీనికల్ అధ్యయనంలో గమనించారు.
  • ప్రతి రోజు 50 గ్రాముల బాదం తింటే బరువు తగ్గడం, నడుము చుట్టు కొలత తగ్గడం, కొలెస్ట్రాల్ తగ్గడం వంటి మార్పులను గమనించారు.

మోతాదు మించితే

  • 50 గ్రాములకు మించి ఒక రోజులో బాదం పప్పులు తీసుకుంటే మలబద్దకం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పికి కారణం కావచ్చు.
  • 100 గ్రాములకు మించి బాదం పప్పులు తీసుకుంటే డయేరియా, తలతిరగడం, కంటి చూపులో తాత్కాలిక మార్పు రావచ్చు.
  • బాదంలో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది కనుక మోతాదుకు మించి తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవచ్చు.
  • ఆక్సలేట్ శరీరం కాల్షియం గ్రహించడాన్ని నియంత్రిస్తుంది. అందువల్ల ఈ సమస్య వస్తుంది. ఇప్పటికే ఈ సమస్యతో బాధపడుతున్న వారు బాదం తీసుకోవడంలో నియంత్రణ తప్పక పాటించాలి.

Also read: గర్భిణులకు ఫోలిక్ యాసిడ్ ఎందుకు అత్యవసరం? ఫోలిక్ యాసిడ్ తగ్గితే ఏమవుతుంది?

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Embed widget