Male Fertility Drop: అబ్బాయిలూ, మీకో బ్యాడ్ న్యూస్ - ఇక సెక్స్ మీద ఆశలు వదిలేసుకోండి, షాకిచ్చిన తాజా అధ్యయనం

ఒకప్పుడు మన పూర్వికుల్లో 60 ఏళ్ల తాతకు ఉండే సెక్స్, సంతానోత్పత్తి సామర్థ్యం ఇప్పుడు మన యువకుల్లో ఉందట. అంటే, పురుషులు ఎంత ప్రమాదంలో ఉన్నారో చూడండి.

FOLLOW US: 

సెక్స్ విషయంలో మీకు ఎవరూ సాటిలేరని అనుకుంటున్నారా? కానీ, మన పూర్వికులు.. పెద్దలతో పోల్చితే మనం జస్ట్ జుజుబీ. వయగ్రా లేని రోజుల్లో అలసిపోకుండా సెక్స్‌లో పాల్గోవడమే కాదు. సంతానం విషయంలోనూ అస్సలు తగ్గేవారే కాదట. ఒకసారి సెక్స్ చేస్తే.. తప్పకుండా కన్సీవ్ కావాల్సిందే. కానీ, ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలిసిందే. పిల్లలను కనేందుకు ఎంత సెక్స్ చేసినా, ఎన్నిసార్లు చేసినా ఫలితం లేకుండా పోతోంది. చివరికి ఔషదాలు తీసుకున్నా సంతానం కలగడం లేదు. ‘‘మా వాడు చాలా ఆరోగ్యంగా ఉంటాడు. లోపం అతడిలో కాదు, అమ్మాయిలోనే ఉంది’’ అంటూ చాలామంది మహిళల్లోనే సమస్య ఉన్నట్లు చూపించే ప్రయత్నిస్తారు. అయితే నిందించాల్సింది మహిళలను కాదు, పురుషులనే. ఎందుకంటే.. తాజా అధ్యయనం ప్రకారం పురుషుల్లో సంతాన సాఫల్యం స్థాయిలో బాగా పడిపోయాయి. మన పూర్వికులతో పోల్చితే ఆ లెక్క మరీ దారుణంగా ఉంది. గత 40 ఏళ్లలో పురుషుల సంతోనోత్పత్తి 60 శాతం వరకు తగ్గిందని యూకేకు చెందిన హెల్త్ మ్యాగజైన్ ‘మెన్స్ ఫిట్‌నెస్’ పేర్కొంది. అందులో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 

సరిగ్గా 30 ఏళ్ల కిందట.. అంటే, 1992లో జరిపిన అధ్యయనంలోనే 60 ఏళ్ల వ్యవధిలో పురుషుల స్పెర్మ్ కౌంట్ ప్రపంచవ్యాప్తంగా 50 శాతం క్షీణించినట్లు పేర్కొన్నారు. అంటే, అప్పటికే పురుషులు ఎంత ప్రమాదంలో ఉన్నారో తేలిపోయింది. ఆ తర్వాత 1973, 2011, 2017లో జరిపిన అధ్యయనాలు కూడా ఈ విషయాన్నే తేల్చాయి. పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం 50 శాతం నుంచి ఏకంగా 60 శాతానికి పడిపోయినట్లు పేర్కొన్నాయి. ఇతర అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. అమెరికాకు చెందిన మేయో క్లినిక్ కూడా ఈ విషయాన్నే తేల్చింది. ప్రతి 7 జంటలలో దాదాపు ఒక జంట సంతాన సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొంది. ఏడాది పాటు కండోమ్ ఇతరాత్ర సురక్షిత పద్ధతులేవీ పాటించకుండా సెక్స్ చేసినా సంతానం కలగడం లేదని తెలిపింది. వీటిలో ఎక్కువ సమస్యలు పురుషుల వీర్యం నాణ్యంగా లేకపోవడం వల్లేనని వివరించింది. 

పురుషుల్లో సంతాన లేమికి కారణాలేమిటీ?: వివిధ అధ్యయనాలు తెలిపిన వివరాల ప్రకారం.. తక్కువ స్పెర్మ్ ఉత్పత్తి, వీర్య ప్రవాహంలో అడ్డంకులు, అనారోగ్యాలు, గాయాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు, లైఫ్‌స్టైల్ సమస్యలు, స్మోకింగ్, మద్యపానం, లైంగిక వ్యాధులు కారణమవుతున్నట్లు పేర్కొన్నాయి. అలాగే పెరుగుతున్న కాలుష్యం, ఫిట్‌నెస్ లేకపోవడం, ఒత్తిడి, ఫాస్ట్ ఫుడ్, శక్తిని అందించే ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతున్నట్లు తెలిపాయి. ప్రస్తుతం పురుషుల్లో సంతానోత్పత్తి పెంచేందుకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ, పూర్తిగా ఔషదాల మీద ఆధారపడకుండా జాగ్రత్తలు కూడా పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ఈ కింది చిట్కాలను పాటించడం ద్వారా సంతాన సమస్యలు నుంచి బయటపడొచ్చని అంటున్నారు. 

అధిక వేడి ఎప్పుడూ ప్రమాదకరమే: వేడి ప్రదేశాల్లో నివసించే పురుషుల్లో సంతాన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా  వీర్య కణాలను ఉత్పత్తి చేసే వృషణాలకు వేడి ఎక్కువగా తగలకూడదు.  వృషణాలంటే స్పెర్మ్‌కు స్టోర్ రూమ్‌లాంటివి. అవి చల్లగా ఉన్నంత వరకే స్పెర్మ్ కూడా పాడవ్వకుండా నాణ్యంగా ఉంటుంది. లేకపోతే కణాలు క్షీణించి కౌంట్ తగ్గిపోతుంది. హాట్ టబ్‌లు, ఆవిరి స్నానం(స్టీమ్ బాత్), వేడి నీళ్ల స్నానాలు తగ్గించాలి. 

బిగువుగా ఉండే లోదుస్తులు, ఫ్యాంట్లు వద్దు: ఈ రోజుల్లో అంతా టైట్ జీన్స్‌నే ఇష్టపడుతున్నారు. ఇది సంతాన సమస్యలను తెచ్చిపెడుతుంది. మీ ఇన్నర్స్ నుంచి ఫ్యాంట్ల వరకు ప్రతిదీ వదులుగా ఉండేలా చూడండి. ఎక్కువ సేపు గాలి ఆడకపోవడం వల్ల వీర్య కణాల నాణ్యత తగ్గిపోతుంది. టైట్‌గా ఉండే దుస్తులను ధరించడం వల్ల వృషణాలలో ఏర్పడే వేడి బయటకు వెళ్లదు. కాబట్టి కాటన్‌తో తయారు చేసిన ఇన్నర్స్, ఫ్యాంట్స్ లేదా షార్ట్స్, లుంగీలను మాత్రమే ధరించండి. 

ఎక్కువసేపు కూర్చోవద్దు: ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ వల్ల ఈ రోజుల్లో అంతా ఎక్కువ సేపు కూర్చొని వర్క్ చేస్తున్నారు. ఉన్న ప్లేస్ నుంచి కదలకుండా ఒకే చోటులో దొర్లుతున్నారు. ఇది కూడా సంతాన సమస్యలను పెంచేస్తుంది. ఒకే చోట కూర్చోవడం వల్ల మీ మర్మాంగాల వద్ద వేడి పెరుగుతుంది. ముఖ్యంగా వీర్య కణాలను ఉత్పత్తి చేసే వృషణాలు వేడెక్కుతాయి. కాబట్టి.. మధ్య మధ్యలో అటూ ఇటూ తిరగండి. కాసేపు నిలబడండి. ఇంట్లో ఉంటే వదులైన నిక్కర్లు లేదా లుంగీ ధరించి, వాటికి బాగా గాలిని తగలనివ్వండి. 

ల్యాప్ టాప్‌లను ఒడిలో పెట్టుకోవద్దు: ఈ రోజుల్లో ఐటీ, మీడియా తదితర రంగాల్లో పనిచేసే ఉద్యోగులంతా ల్యాప్‌టాప్‌ల్లోనే పనిచేస్తున్నారు. చాలామందికి ల్యాప్‌టాప్‌లను ఒడిలో పెట్టుకుని పనిచేయడం అలవాటు. దానివల్ల ల్యాప్ టాప్‌ల్లో నుంచి విడుదలయ్యే వేడిగాలి నేరుగా వృషణాలను తాకుతుంది. ఫలితంగా స్పెర్మ్ దెబ్బతింటుంది. అలాగే, వేసవిలో ఫ్యాన్ నుంచి వచ్చే వేడిగాలి, వంట చేస్తున్నప్పుడు స్టవ్ నుంచి ఉత్పత్తయ్యే వేడి, జిరాక్స్ లేదా ఫొటోస్టాట్‌ల వద్ద నిలుచోవడం కూడా అంత మంచిది కాదు. స్నానం చేసేప్పుడు వేడి నీళ్లు వృషణాలకు తగలకుండా జాగ్రత్తపడండి. 

సుదీర్ఘ ప్రయాణాలు, బైక్ రైడింగ్: బిగుతుగా ఉండే ఫ్యాంట్లు ధరించి ఎక్కువ దూరాలు బైకు మీద ప్రయాణించడం వల్ల కూడా సంతాన సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఎక్కువ సేపు బైకు నడుపుతున్నా, ప్రయాణాల్లో ఎక్కువ సేపు కూర్చున్నప్పుడు వృషణాలపై ఒత్తిడి, ఘర్షణ ఏర్పడుతుంది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ప్రయాణిస్తుంటే తప్పకుండా వదులైన ఫ్యాంట్లు లేదా నిక్కర్లు, షార్ట్స్ ధరించండి. 

ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగాన్ని తగ్గించండి: ప్లాస్టిక్‌లు తేలికైనవి, చౌకైనవి, సులభంగా లభ్యమవుతున్నాయి. దీంతో ఈ రోజుల్లో అంతా ప్లాస్టిక్ వస్తువులనే వాడుతున్నారు. తినే ఆహారాన్ని కూడా ప్లాస్టిక్ పాత్రల్లోనే నిలువ ఉంచుతున్నారు. ప్లాస్టిక్‌ల వాడకం కేవలం పర్యావరణానికి మాత్రమే కాదు, పురుషుల సంతానోత్పత్తికి కూడా హానికరమే. ఎందుకంటే అవి ఈస్ట్రోజెన్‌ల వలె పనిచేస్తాయి. ఆహారాన్ని మంటపై లేదా ఓవెన్‌లో లేదా మైక్రోవేవ్‌లో వేడి చేస్తున్నప్పుడు, క్లాంగ్ ఫిల్మ్‌ని ఉపయోగించకూడదు. ప్లాస్టిక్‌ పాత్రలో ఆహారాన్ని అస్సలు వేడి చేయొద్దు. వేడి వల్ల వాటిలోని రసాయనాలు మీ ఆహారం, ద్రవాల్లోకి ప్రవేశిస్తాయి.  ప్లాస్టిక్‌కు బదులుగా గాజు, సిరామిక్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్‌లలో ఆహారాన్ని నిల్వ చేయండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కూడా వాడొద్దు. ప్లాస్టిక్ సాఫ్ట్ డ్రింక్ బాటిళ్లను మళ్లీ ఉపయోగించవద్దు. 

ధూమపానం, మద్యం సేవించడం తగ్గించండి: ధూమపానం వల్ల అండాలు, స్పెర్మ్‌లోని జన్యు పదార్థం దెబ్బతింటుంది. ధూమపానం వల్ల గర్భస్రావం అవకాశాలున్నాయి.  ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. స్పెర్మ్ ఉత్పత్తి, DNA దెబ్బతింటుంది. టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గిపోతాయి.  ఈస్ట్రోజెన్ స్థాయిలతో అసమతుల్యత ఏర్పడుతుంది. 

మంచి ఆహారమే మందు: రెడ్ మీట్‌, వైట్ మీట్‌లను ఎక్కువగా తినొద్దు. ముఖ్యంగా నిలువ ఉంచిన, ఘనీభవించిన మాంసాన్ని అస్సలు ముట్టవద్దు. వాటికి బదులుగా చేపలు తినండి. వారంలో కనీసం రెండు చేపలను తినడం ద్వారా స్పెర్మ్ కౌంట్ మెరుగుపడుతుంది. శాఖాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది. యాంటీఆక్సిడెంట్లతో కూడిన ఆహారాన్ని పుష్కలంగా తీసుకోవాలి. అవి స్పెర్మ్‌ను ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడతాయి. వీర్యం ఆరోగ్యంగా ఉండేందుకు వైద్యుల సూచనతో సప్లిమెంట్స్ తీసుకోండి. కొవ్వు ఆమ్లాలు (ఒమేగా 3), లైకోపీన్, సెలీనియం, స్పిరులినా లేదా క్లోరెల్లా, విటమిన్ సి, జింక్ మొదలైన పోషకాలు తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడొద్దు. పారాసెటమాల్, ఆస్పిరిన్, ఇండోమెథాసిన్ టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. 

Also Read: ఆఫీసులోనే ‘స్వయంతృప్తి’ పొందండి, ఉద్యోగులకు ఆ సంస్థ బంపర్ ఆఫర్, 30 నిమిషాలు బ్రేక్ కూడా!

పై అధ్యయనాలను లెక్క ప్రకారం చూస్తే.. 40 ఏళ్ల కిందట 60 ఏళ్ల పెద్దాయనలో ఉండే లైంగిక సామర్థ్యం, వీర్య నాణ్యత ఇప్పుడు 20 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తుల్లో ఉంటుందట. అంటే, ఈ వయస్సు వాళ్లు పై జాగ్రత్తలు పాటించకపోతే ‘సెక్స్’ ద్వారా పిల్లలను కనాలనే ఆశలను వదిలేసుకోవల్సిందే. కేవలం ఐవీఎఫ్ వంటి కృత్రిమ విధానాలపైనే ఆధారాపడాల్సి వస్తోంది. కాబట్టి.. ఇప్పటికైనా ప్రమాదాన్ని గుర్తించి అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య సూత్రాలను పాటించి వీర్యాన్ని నాణ్యంగా ఉంచుకోండి. 

Also Read: ఏ వయస్సులో ఎన్నిసార్లు సెక్స్‌లో పాల్గొంటే మంచిది? ఆ వయస్సులో ఆసక్తి ఎందుకు తగ్గుతుంది?

గమనిక: అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. వీటిలో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు. 

Published at : 02 Mar 2022 09:40 PM (IST) Tags: Sperm count Fertility Drop Male fertility Drop Drop in Male fertility sperm count down

సంబంధిత కథనాలు

Vulvar Cancer: కనిపించని శత్రువు వల్వార్ క్యాన్సర్, మహిళలూ ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

Vulvar Cancer: కనిపించని శత్రువు వల్వార్ క్యాన్సర్, మహిళలూ ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

Menstrual Hygiene Day: రుతుక్రమంలో ‘అక్కడ’ సబ్బు వాడకూడదా? ఈ టిప్స్ పాటిస్తే ఇన్ఫెక్షన్లు దూరం!

Menstrual Hygiene Day: రుతుక్రమంలో ‘అక్కడ’ సబ్బు వాడకూడదా? ఈ టిప్స్ పాటిస్తే ఇన్ఫెక్షన్లు దూరం!

Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్

Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్

Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!

Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!

Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

టాప్ స్టోరీస్

Nara Lokesh: TDP మహానాడులో కీలక తీర్మానాలు, నారా లోకేష్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు

Nara Lokesh: TDP మహానాడులో కీలక తీర్మానాలు,  నారా లోకేష్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు

BSNL 5GB Daily Data Plan: రోజుకు 5 జీబీ డేటా అందించే బీఎస్ఎన్ ప్లాన్ - రూ.600 లోపే - 84 రోజుల వ్యాలిడిటీ!

BSNL 5GB Daily Data Plan: రోజుకు 5 జీబీ డేటా అందించే బీఎస్ఎన్ ప్లాన్ - రూ.600 లోపే - 84 రోజుల వ్యాలిడిటీ!

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Gas Cylinders Explode: గ్యాస్‌ సిలిండర్‌ పేలితే బీమా పొందడం ఎలా? ఈజీ ప్రాసెస్‌ ఇదే!

Gas Cylinders Explode: గ్యాస్‌ సిలిండర్‌ పేలితే బీమా పొందడం ఎలా? ఈజీ ప్రాసెస్‌ ఇదే!