Intimacy Age: ఏ వయస్సులో ఎన్నిసార్లు సెక్స్‌లో పాల్గొంటే మంచిది? ఆ వయస్సులో ఆసక్తి ఎందుకు తగ్గుతుంది?
మీ వయస్సుకు తగినట్లుగా మీరు సెక్స్ చేస్తున్నారా? ఏడాదికి ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొంటున్నారు? ఈ అధ్యయనంలో పేర్కొన్న లెక్కతో మీ లెక్క సరిపోతుందా?
సెక్స్ అంటే కొందరికి ఇష్టం, మరికొందరికి కష్టం. వయస్సులో ఉన్నప్పుడు ప్రతి క్షణం అవే ఆలోచనలు. వయస్సు పెరిగే కొద్ది.. బరువు బాధ్యతల వల్ల ఆ తలపే ఉండదు. బిజీ జీవితంలో ఎంతో ఇష్టమైన సెక్స్ జీవితం అయిష్టంగా మారిపోతుంది. అలా ఏళ్లు గడిచిన తర్వాత కోరికలు పుట్టినా ఫలితం ఉండదు. అందుకే, ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సులో జరిగిపోవాలని అంటారు మన పెద్దలు. మరి ఇప్పుడు మీ వయస్సు ఎంత? ఏడాదిలో ఎన్నిసార్లు సెక్స్‌లో పాల్గొంటున్నారు?
అదేంటీ? దీనికి కూడా లెక్క ఉంటుందా? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, కిన్సే ఇనిస్టిట్యూట్ అధ్యయనంలో పరిశోధకులు ఏం సూచించారో చూడండి. ఆ లెక్క ప్రకారం.. ఏ వయస్సులో ఎన్నిసార్లు సెక్స్ చేస్తే ఆరోగ్యం లభిస్తుందో పేర్కొన్నారు. మరి ఆలస్యం చేయకుండా చూసేయండి.
18 నుంచి 25 ఏళ్లు: టీనేజ్ వయస్సులో ఎన్నిసార్లైనా సెక్స్‌లో పాల్గోవచ్చు. ఈ వయస్సులో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిల్లో ఆ కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే, 18 ఏళ్లు దాటిన తర్వాతే సెక్స్ అనుభూతిని పొందడం శ్రేయస్కరం. అంతకంటే ముందు తొందరపడటం సామాజికంగా కూడా మంచిది కాదు. 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయస్సులో ఎన్నిసార్లైనా సెక్స్‌లో పాల్గోవచ్చు. ఈ వయస్సులో మీకు ఫుల్ స్టామినా ఉంటుంది. పిల్లల కోసం ఆలోచించేవారు 25 ఏళ్ల వయస్సులో ప్రయత్నిస్తే మంచిది. ఆ తర్వాత ప్రయత్నిస్తే.. సక్సెస్ శాతం చాలా తక్కువని వైద్యులు అంటున్నారు.
25 నుంచి 35 ఏళ్లు: ఈ వయస్సులో దాదాపు చాలామందికి పెళ్లి అవుతుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు ఉత్సాహంగా సెక్స్‌లో పాల్గొంటారు. పార్టనర్ గర్భం దాల్చడం వల్ల ఆ సుఖం దూరమవుతుంది. క్రమేనా సెక్స్ మీద కూడా ఆసక్తి తగ్గుతుంది. ఈ వయస్సులో ఉన్నవారు. ఏడాదిలో కనీసం 120 సార్లు సెక్స్ చేస్తే చాలు. వామ్మో అది చాలా ఎక్కువ అనుకుంటున్నారా? నెలల్లో చూస్తే ఇది చాలా తక్కువ. మీరు నెలకు కనీసం 10 సార్లు సెక్స్‌లో పాల్గోవాలి. వారానికి కనీసం 2 నుంచి 3 సార్లు ప్రయత్నించాలి. కనీసం మీ ఆరోగ్యం గురించైనా క్రమం తప్పకుండా పాల్గోవాలి. ఎందుకంటే.. ఈ వయస్సు నుంచి దీర్ఘకాలిక వ్యాధులు మొదలవుతాయి. డయాబెటీస్, గుండె సమస్యల ఆరంభమయ్యేది ఈ వయస్సులోనే.
26 నుంచి 35 ఏళ్లు: ఈ వయస్సులో బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు, వారి చదువులు, ఉద్యోగం, బిజీ లైఫ్ వల్ల ఆ సుఖానికి దూరమవుతారు. పిల్లలు పుట్టిన తర్వాత చాలామంది మహిళల్లో ఆసక్తి కూడా తగ్గిపోతుంది. పురుషులు కూడా తమ భార్యతో సెక్స్ చేయడానికి ఆసక్తి చూపరు. దీనికి అనారోగ్య సమస్యలు కూడా తోడవుతాయి. అయితే, ఈ వయస్సులో ఆరోగ్యం లభించాలంటే తప్పకుండా సెక్స్ చేయాలి. ఏడాదిలో కనీసం 100 నుంచి 112 సార్లు.. అంటే వారంలో కనీసం రెండు రోజులైనా సెక్స్‌లో పాల్గోవాలి.
36 నుంచి 40 ఏళ్లు: పైన పేర్కొన్నట్లే.. ఈ వయస్సులో కూడా కుటుంబ సమస్యలు ఉంటాయి. పిల్లలు కూడా ఎదుగుతారు. దీంతో ఒకరకమైన ఇబ్బంది, సిగ్గు, ఎందుకులే అనే భావం భార్యభర్తల్లో ఏర్పడుతుంది. పని ఒత్తిడి, ఇతరాత్ర వ్యవహారాలు కూడా ఆ ఆలోచనలను దూరం చేస్తుంటాయి. అయితే, వైద్య నిపుణులు మాత్రం.. మీకు ఎన్ని సమస్యలున్నా.. ఈ వయస్సులో సెక్స్‌లో పాల్గోవల్సిందేనని చెబుతున్నారు. ఈ వయస్సులో కూడా సెక్స్ కోరికలు సజీవంగానే ఉంటాయని, సామర్థ్యం కూడా బాగానే ఉంటుందని ఎలాంటి అభ్యంతరం లేకుండా సెక్స్ చేయాలని సూచిస్తున్నారు. సెక్స్ వల్ల ఏర్పడే హార్మోన్ల వల్ల ఒత్తిడి దూరం కావడమే కాకుండా, కొన్ని రోగాల నుంచి ఉపశమనం కూడా లభిస్తుందట. ఈ వయస్సులో ఏడాదికి కనీసం 86 నుంచి 100 సార్లయినా సెక్స్‌లో పాల్గోవాలని కిన్సే ఇనిస్టిట్ట్యూట్ స్టడీలో పేర్కొన్నారు.
40 నుంచి 49 ఏళ్లు: ఈ వయస్సులో సెక్స్ మీద ఆసక్తి క్రమేనా సన్నగిల్లుతుంది. ముఖ్యంగా 45 నుంచి 50 ఏళ్ల లోపు వ్యక్తులు చాలా అరుదుగా సెక్స్ చేస్తుంటారు. అప్పటికీ వీరిలో సెక్స్ కోరికలు ఉంటాయి. ఈ వయస్సులో పార్టనర్లు ఒకరినొకరు అర్థం చేసుకుని తరచుగా సెక్స్‌లో పాల్గోవాలి. లేకపోతే కోరికలు తప్పుదోవ పట్టే అవకాశాలుంటాయి. స్టడీ ప్రకారం ఏడాదిలో కనీసం 69 నుంచి 80 సార్లు సెక్స్‌లో పాల్గొంటే చాలు. సామర్థ్యం ఉంటేనే ఈ సంఖ్యను మించాలి. వయస్సు సహకరిస్తే.. ఈ లెక్క పెద్ద సమస్య కాదు. కానీ, ఏమైనా అనారోగ్య సమస్యలుంటే తప్పకుండా వైద్యుడి సలహా తీసుకునే చేయాలి.
50 నుంచి 90 ఏళ్లు: మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 50 నుంచి 90 సంవత్సరాల వయస్సు గల వెయ్యి మంది పెద్దలను తమ సెక్స్ సమస్యలను చెప్పాలని కోరారు. వృద్ధ జంటలు వారి లైంగిక జీవితాలను నిర్వహించడంలో అడ్డంకులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తమ లైంగిక ఇబ్బందులు, శారీరక సమస్యలను పరిష్కరించడానికి వైద్యులు నిరాకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంటే, ఈ వయస్సులో కూడా లైంగిక కోరికలు ఉంటాయి. అయితే, వయస్సుతోపాటు పెరిగే శారీరక సమస్యలు వారికి అడ్డంకిగా మారుతున్నాయి. కాబట్టి.. వీరు ఎన్నిసార్లు సెక్స్ చేయాలనేది స్టడీలో పేర్కోలేదు. వైద్యుల సూచనతోనే వారు సెక్స్‌లో పాల్గోవాలని సూచించారు.
Also Read: ఉదయాన్నే శృంగారంలో పాల్గోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
ఆసక్తి ఎందుకు తగ్గుతుంది?: గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం సమస్యల వల్ల పురుషులలో నపుంసకత్వం ఏర్పడుతుంది. దీంతో సెక్స్ చేయడానికి ఇష్టపడరు. అయితే, మహిళల్లో ఆరోగ్య సంబంధిత లైంగిక ఇబ్బందులు ఎక్కువగా ఏర్పడతాయి. అయితే, వయస్సుతో సంబంధం లేకుండా.. వారంలో కనీసం ఒకటి లేదా రెండుసార్లయిన సెక్స్‌లో పాల్గోడానికి ప్రయత్నించాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. వారికి ఎదురవుతున్న సమస్యలను పార్టనర్‌తో పంచుకోవడం ద్వారా పరిష్కారం పొందవచ్చని సూచిస్తున్నారు.
Also Read: భర్త వీర్యాన్ని కేకులు, డ్రింక్స్‌లో కలిపి విద్యార్థులకు పంచిన టీచర్, చివరికిలా చిక్కింది
గమనిక: ఇది స్టడీలో సూచించిన సంఖ్య మాత్రమే. మీ సామర్థ్యాన్ని బట్టి ఎన్నిసార్లైనా సెక్స్ చేయొచ్చు. అస్సలు సెక్స్ చేయకపోతేనే అసలైన సమస్య. వారంలో కనీసం రెండు, మూడుసార్లు సెక్స్ చేసినా మీకు దండిగా ఆరోగ్యం లభిస్తుంది. (వివిధ అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ కథనంలో పేర్కొన్న విషయాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యులు కాదని గమనించగలరు.)