News
News
X

Semen Cupcakes: భర్త వీర్యాన్ని కేకులు, డ్రింక్స్‌లో కలిపి విద్యార్థులకు పంచిన టీచర్, చివరికిలా చిక్కింది

ఓ టీచర్ దారుణానికి పాల్పడింది. తన భర్త వీర్యాన్ని పూసిన కేకులను విద్యార్థులకు తినిపిస్తూ ఆనందించిన ఆ టీచర్‌కు కోర్టు.. పెరోల్‌కు అవకాశం లేకుండా 41 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

FOLLOW US: 

Semen Laced Cupcakes | విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరే బుద్ధిలేని పనికి పాల్పడింది. భర్త వీర్యాన్ని కేకుల్లో కలిపి విద్యార్థులకు పంచిపెట్టింది. మరి, ఈ విషయం ఎలా బయటపడింది? కేకుల్లో వీర్యం కలిసినట్లు ఎలా తెలిసింది?

అమెరికాలోని లూసియానా(Louisiana)కు చెందిన సింథియా పెర్కిన్స్‌ అనే ఉపాధ్యాయురాలు తన వృత్తికే కలంకం తెచ్చింది. వెస్ట్‌సైడ్ జూనియర్ హై స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేప్పుడు విద్యార్థులను లోబరుచుకుని.. వారితో కామకలాపాలకు పాల్పడేది. వారిని లైంగికంగా వేదిస్తూ వీడియోలు తీస్తూ ఆనందించేది. ఇందుకు ఆమె భర్త కూడా సహకరించేవాడని తెలిసింది. స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు సింథియా ఇంట్లో సోదాలు చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 

పిల్లలను లైంగికంగా వేదిస్తున్న వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఓ వీడియోలో.. స్కూల్ పిల్లలకు తినిపించే కప్ కేక్‌‌లకు ఆమె తన భర్త వీర్యాన్ని క్రీమ్‌లా రాయడం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. దీనిపై ఆమెను ప్రశ్నించగా.. కేకుల్లో మాత్రమే కాకుండా, స్కూల్లో పిల్లలకు ఇచ్చే కూల్ డ్రింక్స్‌లో తన భర్త వీర్యాన్ని కలిపానని ఆమె తెలిపింది. దీంతో పోలీసులు ఆమెపై 72 లైంగిక నేరాలను దాఖలు చేశారు. ఆమెకు భర్తను కూడా అదుపులోకి తీసుకుని, అతడిపై వివిధ సెక్షన్ల ప్రకారం 150 నేరాలను నమోదు చేశారు.

Also Read: హార్ట్ ఎటాక్‌‌ను ముందుగా మీ చెయ్యే చెప్పేస్తుంది.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

ఈ ఘటన 2019లో చోటుచేసుకోగా.. ఇటీవలే కోర్టు ఈ కేసును విచారించింది. ఆమె నేరాన్ని అంగీకరించడంతో 72 లైంగిక ఆరోపణల్లో 68 కేసులను రద్దు చేశారు. పిల్లలపై లైంగిక వేదింపులు, పోర్న్ చిత్రీకరణ, ప్రమాదకర పదార్థం (వీర్యం) ఆహారంలో కలిపి విద్యార్థులకు తినిపించిన నేరాలు, పిల్లలపై అత్యాచారం, అత్యాచారయత్నం కింద నమోదైన కేసులను విచారించిన ధర్మాసనం ఆమెకు 41 ఏళ్లు కారాగార శిక్ష విధించింది. 40 ఏళ్ల వరకు ఆమెకు పెరోల్ ఇవ్వకూడదని ఆదేశించింది. ప్రస్తుతం ఆమె భర్త డెన్నీస్ కేసు విచారణలో ఉన్నట్లు తెలిసింది. 

Also Read: ఈ నగరాల్లో నివసిస్తున్నారా? మీరు ఎంత సెక్స్ చేసినా ‘ఆ ఫలితం’ ఉండదు, కారణం ఇదే!

డేన్నీస్ లివింగ్స్టన్ పారిష్ షెరీఫ్ కార్యాలయంలో డిప్యూటీ ఆఫీసర్‌గా పనిచేసేవాడు. మరోవైపు భార్య చేసే పాడుపనులకు సహకరించేవాడు. ఓ రోజు స్కూల్ యాజమాన్యానికి ఆమె చేస్తున్న దారుణాల గురించి తెలిశాయి. ఆమె పిల్లలను లైంగికంగా వేదించడమే కాకుండా, కప్ కేకుల్లో వీర్యాన్ని కలిపి ఇస్తుందనే సందేహంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టులో స్కూల్ యాజమాన్యం ఆమెపై దావా వేశారు. పోలీసులు ఆమెను అరెస్టు చేసిన రోజే విధుల నుంచి తొలగించారు. ఆమెకు సహకరించిన భర్త డెన్నీస్‌ను కూడా షెరీఫ్ బాధ్యతల నుంచి తొలగించారు.

Published at : 21 Feb 2022 08:38 PM (IST) Tags: Semen cupcakes Louisiana Teacher Louisiana Ex teacher Semen Laced Cupcakes Semen Laced Cakes

సంబంధిత కథనాలు

Fish Rice: ఫిష్ ఫ్రైడ్ రైస్, ఇంట్లో ఈజీగా ఇలా చేయచ్చు

Fish Rice: ఫిష్ ఫ్రైడ్ రైస్, ఇంట్లో ఈజీగా ఇలా చేయచ్చు

గుండె జబ్బులు రాకూడదంటే ఈ ఆహారాన్ని తీసుకోండి

గుండె జబ్బులు రాకూడదంటే ఈ ఆహారాన్ని తీసుకోండి

ఖాళీ కడుపున బ్రెడ్ తింటున్నారా? అయితే ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్టే!

ఖాళీ కడుపున బ్రెడ్ తింటున్నారా? అయితే ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్టే!

Face Rollers: ఈ ఫేస్ రోలర్ టూల్ వల్ల ఉపయోగమేంటి? అందం పెరుగుతుందా?

Face Rollers: ఈ ఫేస్ రోలర్ టూల్ వల్ల ఉపయోగమేంటి? అందం పెరుగుతుందా?

National Rum Day: రమ్ తాగుతారా? దాన్ని దేనితో తయారుచేస్తారో తెలిస్తే షాకైపోతారు

National Rum Day: రమ్ తాగుతారా? దాన్ని దేనితో తయారుచేస్తారో తెలిస్తే షాకైపోతారు

టాప్ స్టోరీస్

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ-  పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు !  విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?