News
News
వీడియోలు ఆటలు
X

బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తూ ‘డైట్’ కోక్‌లు తాగేస్తున్నారా? జాగ్రత్త, ఈ జబ్బుతో ప్రాణాలు పోతాయ్!

బరువు తగ్గాలని అనుకునే వారు ఈ ఆర్టిఫిషియల్ స్వీటెండ్ బీవేరేజులను వాడకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

బరువు తగ్గేందుకు డైట్ లో ఉన్నామంటూ డైట్ కోక్ లు తాగేస్తుంటారు మనలో కొందరు. కానీ మామూలు కోక్ కు డైట్ కోక్ కు పెద్ద తేడా ఏమీ లేదు, దానితో ప్రయోజనమూ లేదు అని నిపుణులు వివరణ ఇస్తున్నారు.

బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా చక్కెరకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా అత్యధిక ఆర్టిఫిషియల్ చక్కెరలు ఉండే సాఫ్ట్ డ్రింక్స్ అసలు తీసుకోకూడదు. కానీ ఈ మధ్య డైట్ కోక్ వంటి లో క్యాలరీడ్ డ్రింక్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో చక్కెరలు తక్కువగా ఉంటాయని నమ్మి చాలా మంది తాగేస్తున్నారు. ఇవి ఉపయోగకరం కాదని డబ్య్లూ హెచ్ ఓ హెచ్చరిస్తోంది. వీటిలో ఉండే రసాయనాలు గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయట.

నాన్ షుగర్ స్వీట్నర్ల వల్ల బరువు తగ్గేందుకు ఎలాంటి ఉపయోగం ఉండదని  డబ్ల్యూహెచ్ ఓ కు చెందిన ప్రాన్సిస్కో బ్రాంకా అంటున్నారు. ఫ్రీ షుగర్ ఇన్ టేక్ తగ్గించేందుకు పండ్లు, పండ్ల రసాల వంటి సహజమైన ఇతర తియ్యని పదార్థాలను ఉపయోగించడం మంచిది. ఆర్టిఫిషియల్ షుగర్స్ లో ఎలాంటి పోషకాలు ఉండవు. ఇవి రోజు వారీ ఆహారంలో తీసుకునేందుకు తగినవి కాదని చెప్పాలి.

ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునేందుకు వీలైనంత త్వరగా ఫ్రీ షుగర్స్ వినియోగాన్ని తగ్గించాలి. ఇది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతో అవసరం. దాదాపుగా 283 అధ్యయనాల అనంతరం ఈ నివేదికను విడుదల చేశారు. ఆ అధ్యయనాలలో పెద్దలు, పిల్లలు, గర్భిణుల వంటి అన్ని రకాల జనాభాను పరీక్షించారు.

అస్పర్టమే, స్టివియా వంటి అర్టిఫిషియల్ స్వీట్నర్ల ద్వారా బరువులో పెద్ద మార్పేమీ ఉండదట. వీటిని దీర్ఘకాలం పాటు వినియోగించినపుడు మధుమేహం, ఇతర గుండె సంబంధ సమస్యలతో ప్రమాదకర పరిస్థితులు కూడా ఎదురుకావచ్చని హెచ్చరించింది. పూర్తి స్థాయిలో నిర్ధారించేందుకు మరింత పరిశోధన అవసరమని ఈ అధ్యయన కారులు అంటున్నారు.

డైట్ కోక్ తాగిన మొదటి పది నిమిషాల్లోనే అందులోని యాసిడ్ దంతాల మీద ప్రభావం చూపుతుంది. ఒక గంట తర్వాత ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ దాహంగా అనిపించడాన్ని గమనించవచ్చు.

బరువు తగ్గాలని అనుకునే వారు సంప్రదాయ చక్కెరలు మాత్రమే కాదు.. ఆర్టిఫిషియల్ చక్కెరలను కూడా దూరంగా పెట్టడం తప్ప మరో మార్గం లేదని నిపుణులు వివరిస్తున్నారు.

అయితే కొంత మంది ప్రీ షుగర్స్ మానేసే క్రమంలో మొదటి అడుగుగా వాటిని మానేసి వీటిని పరిమితుల్లో తీసుకోవడం వల్ల కొంత ఉపయోగం ఉండొచ్చు. కానీ వీటిని సంప్రదాయ చక్కెరలకు ప్రత్యామ్నాయంగా భావించడం పనికి రాదని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు బరువు తగ్గేందుకు ఇదెంత మాత్రమూ దోహదం చెయ్యదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also read : టీ నా? కాఫీ నా? ఆరోగ్యానికి ఏది మంచిది?

Published at : 19 May 2023 09:00 AM (IST) Tags: Diet Coke Weight Loss artificial sugars free sugars

సంబంధిత కథనాలు

ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదా? మిమ్మల్ని మీరు ఇలా మోసం చేసుకుంటే నిద్రే నిద్ర!

ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదా? మిమ్మల్ని మీరు ఇలా మోసం చేసుకుంటే నిద్రే నిద్ర!

Weight Loss: డయాబెటిస్ బాధితులూ బరువు తగ్గాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి

Weight Loss: డయాబెటిస్ బాధితులూ బరువు తగ్గాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి

Jamun Seeds: ఈ పండు విత్తనాలతో చేసిన పొడి తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు

Jamun Seeds: ఈ పండు విత్తనాలతో చేసిన పొడి తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు

ఈ మూడు చిట్కాలు పాటిస్తే మీ మెదడు ఎప్పటికీ యంగ్‌గానే ఉంటుందట!

ఈ మూడు చిట్కాలు పాటిస్తే మీ మెదడు ఎప్పటికీ యంగ్‌గానే ఉంటుందట!

Cracked Heels: పాదాలు పగిలి అసహ్యంగా ఉన్నాయా? ఈ చిట్కాలు మీకోసమే

Cracked Heels: పాదాలు పగిలి అసహ్యంగా ఉన్నాయా? ఈ చిట్కాలు మీకోసమే

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్