News
News
వీడియోలు ఆటలు
X

Cool Water: ఫ్రిజ్ నుంచి తీసిన చల్లని నీళ్లను తాగుతున్నారా? గుండెపై అది చూపే ప్రభావం ఎక్కువ

చల్లని నీళ్లు తాగితే వేసవిలో ఉపశమనంగా ఉంటుంది. అందుకే చాలామంది ఫ్రిడ్జ్ వాటర్ ను తాగుతారు.

FOLLOW US: 
Share:

వేసవిలో చల్లని నీరు తాగడం వల్ల శరీరంలోని వేడి మొత్తం బయటికి పోయినట్టు అనిపిస్తుంది. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండడానికి ఎక్కువగా లిక్విడ్ డ్రింక్స్ మీద ఆధారపడతారు ప్రజలు. ఫ్రిజ్లో తీసిన నీటిని తాగే వారి సంఖ్య ఎక్కువ. అలాగే జ్యూస్, కొబ్బరి నీళ్ళు, లస్సి తాగే వారు కూడా ఉన్నారు. అయితే ఇలా ఫ్రిజ్లో నుంచి తీసిన నీటిని రోజంతా తరచూ తాగుతూ ఉంటే సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

మీరు రోజుకి 8 నుంచి 10 గ్లాసులు తాగడం చాలా ముఖ్యం. అయితే ఆ నీటిని సరైన ఉష్ణోగ్రత వద్ద తాగడం ముఖ్యం. అంటే గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది. అలా కాకుండా చల్లని నీటిని తరచూ తాగుతూ ఉంటే అది ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. శరీరానికి చాలా నష్టం కలిగిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం అతి చల్లని నీరు ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా ఫ్రిడ్జ్ నుంచి తీసిన చల్లని నీటిని తాగితే ఇంకా ప్రమాదం. ఫ్రిజ్‌కు బదులు కుండలో నీటిని తాగడం చాలా ఉత్తమం. ఇది శరీరంపై ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపించదు. 

ఆయుర్వేదంలో చల్లని నీరు లేదా పానీయాలు తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని చెబుతారు. ఆయుర్వేద సూత్రాల ప్రకారం జీర్ణక్రియ అనేది నోటి నుండి ప్రారంభమై పేగుల్లో ముగిసే ఒక వేడి ప్రక్రియ. కొన్ని పరిశోధనలు చల్లని నీరు తాగడం వల్ల ఈ ప్రక్రియకు భంగం కలుగుతుందని చెబుతున్నారు. అజీర్తి సమస్యలు కూడా వస్తాయని వివరిస్తున్నారు. 

ఫ్రిజ్ నుండి తీసిన చల్లని నీటిని తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో శ్లేష్మం ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. కొంతమందిలో శ్వాస సమస్యలు వస్తాయి. అలాగే గొంతు నొప్పి, జలుబు, గొంతు వాపు వంటి సమస్యలు రావచ్చు. చల్లని నీరు తీసుకోవడం వల్ల గుండె కొట్టుకునే వేగంలో మార్పు వస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం ప్రజలు ఎక్కువ చల్లగా ఉన్న నీటిని తాగడం వల్ల వాగస్ అని పిలిచే నాడి ప్రభావితం అవుతుంది. తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటి ప్రభావం నేరుగా ఈ నరాల మీద ఉంటుంది. దీని కారణంగానే హృదయ స్పందన రేటు తగ్గుతుంది. అంటే గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. 

చల్లని నీటిని తీసుకోవడం వల్ల వెన్నుముకలోని నరాలు చల్లబడతాయి. ఇవి మెదడును ప్రభావితం చేస్తాయి. దీనివల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సైనస్ సమస్యలతో బాధపడేవారు చల్లని నీటిని తాగకూడదు. బరువు తగ్గాలనుకునే వారు చల్లని నీటిని తాగకూడదు. చల్లని నీటి వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరగడం కష్టంగా మారుతుంది. ఈ ఫ్రిడ్జ్ వాటర్ వల్ల కొవ్వు గట్టిపడిపోతుంది. దీనివల్ల  కొవ్వు కరగడం గట్టి పడుతుంది. 

Also read: బికినీ వ్యాక్సింగ్ చేయించుకుంటే చర్మం ఊడి వచ్చింది

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 19 Apr 2023 11:31 AM (IST) Tags: Cold Water Cold water risks Cold water Heart problem Heart Issues with Cold water

సంబంధిత కథనాలు

White Rice: వైట్ రైస్ ఆరోగ్యకరం కాదా? ఈ విషయాలు తెలిస్తే ధైర్యంగా భోజనం చేస్తారు!

White Rice: వైట్ రైస్ ఆరోగ్యకరం కాదా? ఈ విషయాలు తెలిస్తే ధైర్యంగా భోజనం చేస్తారు!

Stomach Pain: వాతావరణం మారినప్పుడల్లా మీకు కడుపు నొప్పి వస్తుందా? కారణం ఇదేనట

Stomach Pain: వాతావరణం మారినప్పుడల్లా మీకు కడుపు నొప్పి వస్తుందా? కారణం ఇదేనట

Glioblastoma: భయపెడుతోన్న 'గ్లియోబ్లాస్టోమా'- 6 నెలల్లోనే చంపేసే మెదడు వ్యాధి, ఈ లక్షణాలుంటే జాగ్రత్త

Glioblastoma: భయపెడుతోన్న 'గ్లియోబ్లాస్టోమా'- 6 నెలల్లోనే చంపేసే మెదడు వ్యాధి, ఈ లక్షణాలుంటే జాగ్రత్త

పిక్క బలం పెరిగితే గుండె బలం తగ్గుతుందా? కొత్త పరిశోధనలో ఏం తేలింది?

పిక్క బలం పెరిగితే గుండె బలం తగ్గుతుందా? కొత్త పరిశోధనలో ఏం తేలింది?

ఆరోగ్యానికి చుక్కాని, దాల్చిన చెక్క - డయాబెటిస్, గుండె జబ్బులకు ఇదే తగిన మందు!

ఆరోగ్యానికి చుక్కాని, దాల్చిన చెక్క - డయాబెటిస్, గుండె జబ్బులకు ఇదే తగిన మందు!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Malavika Mohanan: ప్రభాస్ హీరోయిన్ మాళవిక లేటెస్ట్ ఫొటోస్

Malavika Mohanan: ప్రభాస్ హీరోయిన్ మాళవిక లేటెస్ట్ ఫొటోస్

Botsa Satyanarayana: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీ వాసులు గుర్తింపు, వారి పరిస్థితి ఇదీ - మంత్రి బొత్స వెల్లడి

Botsa Satyanarayana: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీ వాసులు గుర్తింపు, వారి పరిస్థితి ఇదీ - మంత్రి బొత్స వెల్లడి

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?