ABP Desam Health Conclave 2025 : రీల్స్‌లో చూసేవన్నీ సూపర్‌ఫుడ్స్ కాదు, బరువు తగ్గేవారంత ఫిట్నెస్ కోచ్‌లు కాదు.. నమ్మారంటే అంతే
Dr Lahari Surapaneni and Urvashi Agarwal Speech : సూపర్ ఫుడ్స్ ఎంతవరకు మంచి ఫలితాలు ఇస్తాయి? బరువు తగ్గేవాళ్లు ఫిట్నెస్ కోచ్‌లు అయిపోవచ్చా? ఈ అంశాల గురించి ఏబీపీ హెల్త్ కాన్క్లేవ్లో ఏమి చెప్పారంటే

ABP Desam Health Conclave : సోషల్ మీడియాలో చూపించేవన్నీ సూపర్ ఫుడ్స్ కాదని.. అలాగే బరువు తగ్గిపోయిన వాళ్లంత ఫిట్నెస్ కోచ్‌లు కాదని.. అవన్నీ స్ట్రాటజీలు మాత్రమే.. అవన్నీ నమ్మారంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని డా.లహరి సూరపనేని (Dr Lahari Surapaneni), ఊరశ్వి అగర్వాల్ (Urvashi Agarwal) తెలిపారు. ABP Desam Health Conclave 2025లో పాల్గొన్న వీరిద్దరూ సూపర్ ఫుడ్స్, మిరాకిల్ డైట్స్‌పై ఎన్నో షాకింగ్ విషయాలు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలిపారు. వాటికి సంబంధించిన హైలెట్స్ చూసేద్దాం.
సూపర్ ఫుడ్సే లేవు..
సోషల్ మీడియాలో ఈ ఫుడ్ తింటే బరువు తగ్గుతారు. ఈ సూపర్ ఫుడ్ కచ్చితంగా డైట్లో చేర్చుకోవాలి అని చెప్తారు. ఇవి ఎంతవరకు నిజం అనే ప్రశ్నకు పోషకాహార నిపుణురాలు ఊర్వశి అగర్వాల్ ఇలా స్పందించారు. " అఫీషియల్ న్యూట్రిషనిస్ట్ అథారటీలు అయిన FSSAI, WHO, FDA వంటివి సూపర్ ఫుడ్ గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. అలాగే చట్టపరంగా, శాస్త్రీయ పరంగా కూడా ఎలాంటి ఆధారం లేవు. సూపర్ ఫుడ్ అనేది మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే. కొన్ని ఫుడ్స్ తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్పి వారు స్ట్రాటజీ ప్లే చేసి హైప్ పెంచుతున్నారు. ఇదే మీకు షాకింగ్ విషయం. అలాంటి సూపర్ ఫుడ్స్ ఏమి లేవు." అని తెలిపారు.
ఎలాంటి వ్యాయామం చేయకుండా బరువు తగ్గాలని, ప్రాసెస్ ఫుడ్స్ ఎక్కువగా తింటూ.. సరైన నిద్రలేకుండా, ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నా మంచి ఫలితాలు ఉండవని చెప్తున్నారు. జీవనశైలిలో మార్పులు అంటే సూపర్ ఫుడ్స్ అని చెప్పే వాటిని తీసుకోవడం కాదని తెలిపారు. మెరుగైన జీవనశైలి లేకుండా చియాసీడ్స్ తీసుకుంటే తగ్గిపోతామనుకోవడం సరికాదన్నారు.
ఆ పనులు చేయకుంటే ఏమి తిన్నా వేస్టే
ఏ ఫుడ్ అయినా మంచి ఫలితాలు ఇవ్వాలంటే.. 99.9 మీరు మిగిలిన అంశాలపై దృష్టిపెట్టాలంటున్నారు డాక్టర్ లహరి. ఫుడ్స్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేవని చెప్పలేము. కానీ ఆ ఫుడ్ ప్రయోజనాలు మీకు అందాలంటే మీరు మిగిలిన ఎన్నో అంశాలపై ఫోకస్ చేయాలని తెలిపారు. "చాలామందిలో ఉన్న సమస్య ఏంటి అంటే రిజల్ట్స్ త్వరగా రావాలని కోరుకుంటున్నారు. ఈజీగా చేయగలిగే పనులు.. లేదా చాలా తేలికగా చేసే పనులు మంచి ఫలితాలు ఇచ్చేయాలనుకుంటున్నారు. ఎఫర్ట్ లేకుండా మంచి ఫలితాలు వచ్చేయాలనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు." అని లహరి వెల్లడించారు.
దీనికి సంబంధించిన మరెన్నో ఇంట్రెస్టింగ్ అంశాలపై డాక్టర్ లహరి, పోషకాహార నిపుణురాలు ఊర్వశి అగర్వాల్ ఏబీపీ దేశం హెల్త్ కాంక్లేవ్ 2025లో వివరించారు. ఆ లింక్ ఇక్కడుంది. క్లిక్ చేసి చూసేయండి.






















