అన్వేషించండి

ఎండలో ఫోన్ చూస్తున్నారా? ఇక భవిష్యత్తులో ఏమీ చూడలేరు, ఎందుకంటే..

ఎండలో కూర్చుని ఫోన్ చూడటం వల్ల ఓ యువతి తన కంటి చూపు కోల్పోవాల్సి వచ్చింది.

డిజిటల్ యుగంలో మన పని అంతా ఫోన్స్, ల్యాప్ టాప్ స్క్రీన్స్ చూస్తూ ఉండటమే సరిపోతుంది. మరి ముఖ్యంగా అందరూ ఫోన్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. అది లేకుండా కనీసం నిద్రకూడా పోలేకపోతారు కొంతమంది. కానీ ఎక్కువసేపు వాటిని చూడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇంటా, బయట అంతా ఫోన్ మయమే. ఎండలో కూర్చున్నప్పుడు ఫోన్ స్క్రీన్ కనిపించకపోయినా లైటింగ్ ఎక్కువగా పెట్టి మరి చూస్తూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల మీ కంటి చూపు పాక్షికంగా దెబ్బతింటుందని మీకు తెలుసా? ఎండలో ఎక్కువగా ఫోన్ చూడటం వల్ల కంటి చూపు కోల్పోయిన కేసులు రెండు వెలుగులోకి వచ్చాయి.

జర్నల్ ఆఫ్ మెడికల్ కేస్ రిపోర్ట్స్ ప్రకారం పగటిపూట ఎండలో తదేకంగా ఫోన్ చూడటం వల్ల ఒక యువతి తన కంటి చూపు కోల్పోయినట్టు తెలిపింది. ఫోన్ స్క్రీన్‌పై సూర్యుని శక్తివంతమైన కాంతి పడటం వల్ల అది రెటీనాకు తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. దీని వల్ల ఆమె కంటి చూపు కోల్పోయింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఒక పురుషుడు, ఒక స్త్రీ సోలార్ మాక్యులోపతితో బాధపడుతున్నట్టు గుర్తించారు. వాళ్ళిద్దరూ తమ ఫోన్స్ ఎక్కువగా పగటి వేళ ఎండలో చూడటం వల్ల కళ్ళు దెబ్బతిన్నాయి.

మాక్యూలోపతి అంటే ఏమిటి?

మాక్యులోపతి లేదా మాక్యులార్ డీజెనరేషన్ అని కూడా పిలుస్తారు. ఇది మాక్యులా అని పిలువబడే రెటీనా వెనుక భాగాన్ని ప్రభావితం చేసే వ్యాధి. మాక్యులోపతి ఉన్నవారు పూర్తిగా అంధులుగా మారరు. కానీ తరచుగా వారి కేంద్ర దృష్టిని కోల్పోతారు. సోలార్ మాక్యులోపతి విషయంలో  సూర్యరశ్మికి నేరుగా గురికావడం వల్ల రెటీనా, మాక్యులా దెబ్బతింటుంది. దీని వల్ల కంటి చూపు సమస్య ఉన్న యువతి ఎదురుగా కనిపించే ఆకారాలని గుర్తించడంలో ఇబ్బంది ఏర్పడింది. ఇది పర్మినెంట్ సెంట్రల్ స్కోటోమాగా నిర్ధారించారు. ఇది కంటి మధ్యలో ఏర్పడే బ్లైండ్ నెస్.

నివేదిక ప్రకారం కంటి చూపు పాక్షికంగా కోల్పోయిన ఆ యువతి వయసు 20 సంవత్సరాలు. ఆమె ఎక్కువగా బీచ్ లో ఎండగా ఉన్నప్పుడు తన మొబైల్ వాడటం వల్ల ఇలా జరిగింది. ఇక మరొక వ్యక్తి ఎండలో కూర్చుని గంటల తరబడి తన టాబ్ చూస్తూ గడిపాడు. దానివల్ల కూడా అతడి కళ్లు దెబ్బతిన్నాయి. 

సోలార్ మాక్యులోపతి ఎందుకు వస్తుంది?

సోలార్ మాక్యులోపతి అనేది సూర్యుని వైపు నేరుగా చూడటం వల్ల వస్తుంది. అయితే ఈ వ్యాధి బారిన పడిన ఇద్దరు మాత్రం నేరుగా సూర్యుడి వైపు చూడలేదని ఎండలో ఫోన్ చూసినట్టు చెప్పారు. ఫోన్ స్క్రీన్ మీద సూర్యకాంతి నేరుగా పడి అది వికిరణం చెంది కళ్ళని దెబ్బతీసింది. అందుకే బయట ఎండలో కూర్చున్నప్పుడు వీలైనంత వరకు ఫోన్ చూడకుండా ఉండటమే మంచిదని ఒకవేళ అత్యవసరం అయి చూస్తే కళ్ళకి గ్లాసెస్ ధరించాలని వైద్యులు సూచించారు.

సూర్యుని కాంతి ఏ విధంగా హాని చేస్తుంది?

సూర్య కిరణాలలోని UVA, UVB రేడియేషన్ కంటిశుక్లం లేదా మచ్చల క్షీణత అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెప్పుకొచ్చారు. జాన్ హాప్కిన్స్ మెడిసిన్ ప్రకారం కార్నియల్ డ్యామేజ్, కంటిశుక్లం, మాక్యులార్ డీజెనరేషన్ అన్నీ UV ఎక్స్పోజర్ నుండి సాధ్యమయ్యే దీర్ఘకాలిక ప్రభావాలు. ఇవి కంటి చూపు మందగించేలా చేస్తాయి. అందుకే నిపుణులు కంటి వ్యాధుల నుండి కళ్ళను రక్షించుకోవడానికి సమర్థవంతమైన సన్ గ్లాసెస్ ధరించాలని సిఫార్సు చేస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also read: ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇదే, అక్కడికి వెళితే చావు తప్పదు

Also read: పీరియడ్స్ కేవలం ఒకటి లేదా రెండు రోజులకే ముగిసిపోతున్నాయా? ఇది అనారోగ్యానికి సంకేతం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget