IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Marriage: ఈ అయిదు పనులు చేస్తే మీ వివాహ బంధం కష్టాల్లో పడినట్టే

వివాహబంధాన్ని నిలబెట్టుకోవాలంటే మాటతీరులోనే కాదు, నడతలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

FOLLOW US: 

పెళ్లంటే రెండు జీవితాలు. ఒక కుటుంబం నిర్మాణం. అలాంటి కుటుంబాలెన్నో కలిస్తేనే సమాజం. అందుకే సమాజ నిర్మాణానికి పెళ్లి చాలా ముఖ్యం. ఏడుడుగులతో బంధంతో మొదలైన వారి ప్రేమ జీవితం కలకాలం ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.ఒకరి కోసం ఒకరు అనేట్టు ఉండాలి. అలా కాకుండా ప్రవర్తిస్తే పొరపొచ్చాలు రావడం ఖాయం. ముఖ్యంగా భార్యాభర్తలు చేసే అయిదు పనులు వారి మధ్య దూరాన్ని పెంచుతాయి. అవేంటో తెలుసుకుని జాగ్రత్త పడాలి. 

అరవడం
ఏ విషయమైనా అరుస్తూ, కోపంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎదురుగా కూర్చోబెట్టుకుని చెబితే మెల్లగా నచ్చజెబితే జీవిత భాగస్వామి కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా కాకుండా ‘చెప్పింది విను’ అని గద్ధిస్తూ మాట్లాడడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది తప్ప ఒరిగేదేమీ లేదు. 

కలిసి పనిచేయండి
ఆమెలోనో లేక అతనిలోనో తప్పులు వెతకడానికి మీరు వారి శత్రువు కాదు, జీవిత భాగస్వామి. కాబట్టి వారి పనుల్లో తప్పులెంచడం మాని కలిసి పనిచేసేందుకు ప్రయత్నించండి. మీ దగ్గర మధ్య సమస్యలు ఉండే అరుచుకునే బదులు, బయటి వారి ముందు వారిని చులకన చేసే బదులు కూర్చుని మాట్లాడుకునేందుకు ప్రయత్నించండి. 

డబ్బు రహస్యాలు
డబ్బు తండ్రి కొడుకులనే విడదీస్తుంది, ఇక భార్యాభర్తలెంత? అందుకే డబ్బు విషయంలో రహస్యాలు మెయింటేన్ చేయద్దు. ఒకరికి తెలియకుండా ఒకరు ఏమైనా కొనడాలు, పెట్టుబడులు పెట్టడాలు చేస్తే అవి పెద్ద గొడవలకు కారణం అవుతాయి. కాబట్టి ఆర్ధికపరంగా ఏ పని చేసినా ఇద్దరికీ మాట్లాడుకున్నాకే నిర్ణయం తీసుకుంటే మంచిది. 

మూడో వ్యక్తి వద్దు 
మూడో వ్యక్తి  జోక్యం సమస్యను పెంచుతుంది కానీ తగ్గించదు. అందుకే వేరే వారిని న్యాయమూర్తిగా పెట్టుకునే బదులు భార్యభర్తలిద్దరే మాట్లాడుకోవడం ఉత్తమం. ఒకరికి నచ్చని విషయాలు ఒకరు బయటికి చెప్పుకోవాలి. అలాగే మీ జీవిత భాగస్వామి గురించి చెడుగా మూడో వ్యక్తికి చెప్పకూడదు. 

ఉద్యోగం పరంగా...
భార్యాభర్తల్లో ఒకరు మంచి ఉద్యోగ స్థాయిలో ఉండొచ్చు, రెండో వారిని ఆ విషయంపై చులకనగా మాట్లాడడం వంటివి చేయకూడదు. అలాగే సంపాదన అధికంగా ఉన్న భర్త లేదా భార్య, తన జీవిత భాగస్వామిని తక్కువగా చూడడం చేయకూడదు.ఆఫీసులో మీరు ఎంత గొప్ప స్థానంలో అయినా ఉండొచ్చు, ఇంట్లో మాత్రం ఇద్దరూ సమానమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 

Also read: పిల్లల్లోనూ హైబీపీ ఆనవాళ్లు, తేలికగా తీసుకోవద్దు

Also read: మాంసాహారం అధికంగా తినేవారికి షాకింగ్ న్యూస్, డయాబెటిస్ బారిన పడే అవకాశం ఎక్కువ

Published at : 21 Apr 2022 01:12 PM (IST) Tags: marriage Difficult marriage Save Marriage Couple to do things

సంబంధిత కథనాలు

Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Dhaniya Powder: ఈ ధనియాల పొడిని అన్నంతో, ఇడ్లీతో తినొచ్చు, ఎలా చేయాలో తెలుసా?

Dhaniya Powder: ఈ ధనియాల పొడిని అన్నంతో, ఇడ్లీతో తినొచ్చు, ఎలా చేయాలో తెలుసా?

Brain Foods: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే బ్రెయిన్ ఫుడ్స్ ఇవన్నీ, రోజుకొకటైనా తప్పకుండా తినిపించాల్సిందే

Brain Foods: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే బ్రెయిన్ ఫుడ్స్ ఇవన్నీ, రోజుకొకటైనా తప్పకుండా తినిపించాల్సిందే

Sleeping Pills: స్లీపింగ్ పిల్స్ అధికంగా వాడుతున్నారా? వాటి వల్ల కలిగే నష్టాలు ఇవే

Sleeping Pills: స్లీపింగ్ పిల్స్ అధికంగా వాడుతున్నారా? వాటి వల్ల కలిగే నష్టాలు ఇవే

Amazon: ఒక ప్లాస్టిక్ బకెట్ ఇరవై ఆరువేల రూపాయలా? అది కూడా ‘సోల్డ్ అవుట్’

Amazon: ఒక ప్లాస్టిక్ బకెట్ ఇరవై ఆరువేల రూపాయలా? అది కూడా ‘సోల్డ్ అవుట్’

టాప్ స్టోరీస్

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి