By: ABP Desam | Updated at : 21 Apr 2022 07:30 AM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
మాంసాహారం ఎంతో మంది ఫేవరేట్. రోజూ తినేవారు కూడా ఉన్నారు. వారికిప్ఫుడు షాకింగ్ న్యూస్. చికెన్ లివర్, మటన్, రెడ్ మీట్ అధికంగా తినేవారిలో డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువని చెబుతున్నారు పరిశోధకులు. చికెన్, మటన్, రెడ్ మీట్ తినని వారితో పోలిస్తే, తినే వారిలో మధుమేహం వచ్చే రిస్క్ పెరుగుతుందని చెబుతున్నారు అధ్యయనకర్తలు. సింగపూర్ శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఈ మాంసాహారంలో హీమ్ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇదే డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. ఈ హీమ్ ఇనుము రక్తం, కండరాలలో కనిపిస్తుంది. ఈ అధ్యయనాన్ని సింగపూర్లోని డ్యూక్ ఎన్‌యుఎస్ మెడికల్ స్కూల్ పరిశోధకులు నిర్వహించారు.
అయినా తినవచ్చు
దాదాపు 63 వేల మంది పెద్దలపై ఈ పరిశోధన సాగింది. వారి మాంసం వినియోగం, మధుమేహానికి మధ్య గల సంబంధాన్ని పరిశోధకులు తేల్చారు. హీమ్ ఐరన్, డయాబెటిస్ మధ్య లింకు బయటపడింది. అయితే ఆహారం నుంచి పూర్తిగా మాంసాన్ని తొలగించాలని మాత్రం పరిశోధకులు చెప్పడం లేదు. చికెన్ బ్రెస్ట్ ను, చేపలు, కొద్దిమొత్తంలో మటన్ తినవచ్చని చెబుతున్నారు. చికెన్ లివర్లో అధికంగా హీట్ ఐరన్ దాగి ఉంటుంది. కాబట్టి దాన్ని తినడం తగ్గించమని చెబుతున్నారు.
ఐరన్ లో రెండు రకాలు ఉంటాయి.అవి హెమీ ఐరన్, నాన్ హెమీ ఐరన్. చికెన్, మటన్ వంటి మాంసాహారంలో హెమీ ఐరన్ ఉంటుంది. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు వంటి వాటిలో నాన్ హెమీ ఐరన్ ఉంటుంది. కాబట్టి మాంసాహారాన్ని అధికంగా కాకుండా చాలా మితంగా తినడం ప్రారంభించాలి. చికెన్ బ్రెస్ట్ తిన్నా అక్కడ హెమీ ఐరన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి అది తినవచ్చు. చేపల్లో ఈ హెమీ ఐరన్ పెద్దగా ఉండదు. కాబట్టి సమస్య లేదు.
మటన్ తినవచ్చా?
చాలా మంది మధుమేహులకు మటన్ తినవచ్చా లేదా సందేహం ఉంది. డయాబెటిస్ వారు మటన్ తినవచ్చు. కానీ చాలా తక్కువ మోతాదులో. 75 గ్రాములకు మించి తినకపోవడమే మంచిది. అది కూడా రోజూ తినకూడదు. వారంలో రెండు సార్లు తినవచ్చు. డయాబటిస్ రోగుల్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉన్న వారు మాత్రం మటన్ ను తినాలి. నియంత్రణంలో లేని వారు తింటే మరింతగా పెరిగే అవకాశం ఉంది.
Parenting: ఎంత కోపం వచ్చినా మీ పిల్లలతో ఈ మాటలు అనవద్దు, వారి మనసులో ఉండిపోతాయి
High Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ ఒక్క కూరగాయ తింటే చాలు, అంతా కరిగిపోతుంది
Chicken Pakodi: చికెన్ పకోడి చిటికెలో చేసేయండిలా
Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే
Dengue Diet: డెంగ్యూ జ్వరం వస్తే తినాల్సినవి ఇవే, వీటితో సమర్థంగా ఎదుర్కోవచ్చు
IPL 2022: ఐపీఎల్ 2022 మెగా ఫైనల్ టైమింగ్‌లో మార్పు! ఈ సారి బాలీవుడ్ తారలతో..
Navjot Singh Sidhu: సిద్ధూకు ఏడాది జైలు శిక్ష- 34 ఏళ్ల క్రితం కేసులో సుప్రీం తీర్పు
TRS ZP Chairman In Congress : కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు