Cardamom Benefits: రోజుకు రెండు ఏలకులు బుగ్గన పెట్టుకుంటే, డాక్టర్‌తో పనే ఉండదట - ఎందుకో తెలుసా?
Cardamom : యాలకులు.. నోట్లో వేసుకుంటే డాక్టర్ దగ్గరకు పోయే అవసరం ఉండదు. అవును మీరు విన్నది నిజమే.. ఏలకులు చేసే మేలు మరే ఇతర సుగంధ ద్రవ్యం కూడా చేయదని అంటారు. ఎందుకంటే..
Cardamom Health Benefits: మన ఇళ్లలో లభించే సుగంధ ద్రవ్యాలు ఔషధపరంగా కూడా చాలా గుణాలు ఉంటాయి. పసుపు, లవంగం వంటివి రుచితో పాటు ఆరోగ్యంపై కూడా ప్రత్యేకంగా పనిచేస్తాయి. ఈ సుగంధ ద్రవ్యాలలో ఏలకులు (యాలకులు) కూడా చాలా ముఖ్యమైనవి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలు దూరమవుతాయి. ఏలకులు తీసుకోవడం వల్ల దంత క్షయం నుంచి ఉపశమనం లభిస్తుంది. నోటి దుర్వాసన కూడా తొలగిపోతుంది. అంతే కాకుండా వాంతులు, వికారం సమస్య కూడా దూరమవుతుంది. ఏలకులు పురుషుల శారీరక సామర్థ్యాన్ని పెంచడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి, ఇది కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషక పదార్థాలు ఉంటాయి.
పురుషులకు ప్రయోజనకరమైనది:
పురుషులు రాత్రి పడుకునే ముందు కనీసం 2 ఏలకులు నోట్లో వేసుకొని నమలాలి. రాత్రి పడుకునే ముందు 2 ఏలకులను 1 గ్లాసు పాలతో వేడి చేసి త్రాగితే లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పురుషులలో నపుంసకత్వము తొలగిపోతుంది.
నోటి దుర్వాసన పోతుంది:
రాత్రి పడుకునే ముందు, 1 గ్లాసు నీటిలో 2 ఏలకులను వేసి మరిగించండి. ఈ నీటిని తాగి, ఏలకులు నమలాలి. ఇలా నమలడం ద్వారా ఏలకులు మౌత్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగించవచ్చు.
క్యాన్సర్‌ను దూరం చేస్తుంది:
క్యాన్సర్‌ను దూరం చేయడంలో ఏలకులు చాలా మంచి పాత్ర పోషిస్తాయి. నిజానికి, ఏలకులు క్యాన్సర్ నిరోధక గుణాలతో నిండి ఉన్నాయి. ఇది క్యాన్సర్ కణాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఏలకులను ప్రతి రోజు నోట్లో వేసుకొని నమలడం వల్ల ద్వారా క్యాన్సర్‌ను మీ నుంచి దూరంగా ఉంచవచ్చు.
కొలెస్ట్రాల్, బీపీని నియంత్రిస్తుంది:
కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఏలకులు మంచి పాత్ర పోషిస్తాయి. దీనితో పాటు, హైబీపీ సమస్యను నియంత్రించడంలో కూడా ఇవి పనిచేస్తాయి. ఈ రెండు సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఏలకులు తినడం మంచిది.
గుండె ఆరోగ్యంగా ఉంటుంది:
రోజూ మీ ఆహారంలో ఏలకులను చేర్చుకోవడం ద్వారా, మీరు గుండె జబ్బుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఏలకుల వినియోగం గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
ఏలకులు తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. నిజానికి ఏలకులలో డిటాక్సిఫైయింగ్ ఏజెంట్ ఉంటుంది. ఇది టాక్సిన్‌లను తొలగిస్తుంది. కాలేయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఇతర వైద్య ప్రయోజనాలు:
- ఏలకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఏలకులు నోటి క్యాన్సర్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
- బరువు తగ్గాలి అకుకునే వారు తమ ఆహారంలో ఏలకులను తప్పనిసరిగా చేర్చుకోవాలి. అలాగే నిద్రలేమి సమస్య ఉంటే, ఏలకులను వేడి నీళ్లతో కలిపి తాగండి. ఇది నిద్రను ప్రేరేపిస్తుంది గురక సమస్య కూడా దూరమవుతుంది.
- యాలకులు తీసుకోవడం వల్ల గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలు నయమవుతాయి.
Also Read : జామకాయలు తినడం లేదా? మీరు ఈ ప్రయోజనాలన్నీ మిస్ అవుతున్నట్లే!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.