అన్వేషించండి

Cancer: మీ కిచెన్‌లో ఉండే ఈ వస్తువులు క్యాన్సర్ కారకాలని మీకు తెలుసా?

క్యాన్సర్ అంటే కుటుంబ చరిత్ర లేదంటే ఇతర ఆహార అలవాట్ల వల్ల వస్తుందని అనుకుంటారు. కానీ కిచెన్ లో ఉండే ఈ వస్తువులు కూడా క్యాన్సర్ కారకాలుగా ఉన్నాయి.

ఇంటికి వంటగది గుండెలాంటిది. అందుకే గృహిణులు వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కిచెన్‌ను ఎంత శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా కిచెన్‌లో ఉండే కొన్ని పదార్థాలు క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. రోజువారీ వస్తువులు, వంట పద్ధతులు అనారోగ్యాన్ని కలిగించవచ్చు. కాబట్టి, మనం జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.

యాక్రిలామైడ్

యాక్రిలామైడ్ అనేది ఒక రసాయన సమ్మేళనం. ఇది కొన్ని ఆహారాలని వేయించడం, అధిక ఉష్ణోగ్రత వద్ద వండినప్పుడు సహజంగా ఏర్పడుతుంది. సాధారణంగా బంగాళాదుంప చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, కాల్చిన బ్రెడ్ వంటి ఆహారాల్లో కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వెల్లడించిన దాని ప్రకారం యాక్రిలామైడ్ మానవ క్యాన్సర్ కారకం. ఇది రాకుండా ఉండాలంటే ఆహారాన్ని వేయించడానికి బదులుగా ఆవిరితో ఉడికించడం లేదా మైక్రోవేవ్ చేయడం మంచిది.

పాలీసైక్లిక్ ఏరోమాటిక్ హైడ్రోకార్బన్

పాలీసైక్లిక్ ఏరోమాటిక్ హైడ్రోకార్బన్ (PAHలు)అనేది మాంసాలు గ్రిల్లింగ్ లేదా బార్బేక్యూయింగ్ వంటి అధిక ఉష్ణోగ్రతల వద్ద వండినప్పుడు ఏర్పడే రసాయనాల సమూహం. ఇది PAH క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే మాంసాన్ని తక్కువ మంట మీద ఉడికించాలి. అతిగా ఉడికించడం, కాల్చడం నివారించాలి. మూలికలు, సుగంధ ద్రవ్యాలు, వెనిగర్ లేదా నిమ్మరసం వంటి ఆమ్ల పదార్థాలలో మాంసాన్ని మెరినేట్ చేయడం వల్ల కూడా PAH తగ్గించడంలో సహాయపడుతుంది.

సోడియం నైట్రేట్

బేకన్, హామ్, హాట్ డాగ్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో ప్రిజర్వేటివ్ గా సోడియం నైట్రేట్ ఉపయోగిస్తారు. ఈ సమ్మేళనాలు అధిక ఉష్ణోగ్రత వంట చేసినప్పుడు లేదా ప్రాసెసింగ్ చేసిన సమయంలో నైట్రోసమైన్ లని ఏర్పరుస్తాయి. ఇవి శక్తివంతమైన క్యాన్సర్ కారకాలు. ఇది తగ్గించాలని ప్రాసెస్ చేసిన మాంసం వినియోగాన్ని పరిమితం చేయాలి.

బిస్ ఫినాల్

బిస్ ఫినాల్ (BPA) అనేది సాధారణంగా ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్, క్యాన్ లైనింగ్, వాటర్ బాటిల్ లో కనిపించే సింథటిక్ రసాయనం. BPA ఆహారం, పానీయాలలోకి చేరుతుంది. హార్మోన్ల మీద ప్రభావం చూపించి క్యాన్సర్ ప్రమాదాన్ని కలిగిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే ఆహారాన్ని నిల్వ చేసేందుకు గాజు లేదా స్టెయిన్ లెస్ స్టీల్ కంటైనర్ ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ కంటైనర్ లు ఉపయోగించకుండా ఉండటం మంచిది.

థాలెట్లు

థాలేట్స్ అనేది ప్లాస్టిక్ ఫుడ్ ర్యాప్, ప్యాకేజింగ్ పదార్థాల ఉత్పత్తిలో ఉపయోగించే రసాయనాల సమూహం. BPA మాదిరిగానే ఇది కూడా ఆహారంలోకి ప్రవేశిస్తుంది. ఇవి క్యాన్సర్ కారకాలని కలిగి ఉండవచ్చని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. థాలేట్ కి గురి కావడం తగ్గించుకోవాలంటే ప్లాస్టిక్ ర్యాప్ కి బదులుగా వ్యాక్స్ పేపర్ లేదా సిలికాన్ ఫుడ్ కవర్లు ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు.

పురుగుమందుల అవశేషాలు

పురుగు మందుల అవశేషాలు పండ్లు, కూరగాయాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి కొన్ని క్యాన్సర్లను కలిగిస్తాయి. అందుకే వాటిని కొనుగోలు చేసిన తర్వాత శుభ్రంగా కడగడం మరచిపోవద్దు. పురుగుమందులు లేకుండా పండించే సేంద్రీయ ఉత్పత్తులు ఎంచుకోండి.

అఫ్లాటాక్సిన్లు

అఫ్లాటాక్సిన్‌లు ధాన్యాలు, గింజలు, చిక్కుళ్ళు, ముఖ్యంగా వెచ్చని, తేమతో కూడిన పరిస్థితులలో నిల్వ చేయబడినప్పుడు కొన్ని సహజంగా సంభవించే టాక్సిన్స్. కాలేయ క్యాన్సర్ ని కలిగిస్తాయి. అందుకే వీటిని చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. బూజుపట్టిన లేదా వాసన వచ్చే ఉత్పత్తులని నివారించాలి.

ఫార్మాల్డిహైడ్

ఫార్మాల్డిహైడ్ అనేది కొన్ని ఆహారాల్లో ప్రిజర్వేటివ్స్ గా ఉపయోగిస్తారు. అలాగే కిచెన్ శుభ్రం చేసే ఉత్పత్తుల్లోనూ ఇది కనిపిస్తుంది. దీని అధిక స్థాయి ఎక్స్పోజర్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. వంటగదిలో ఫార్మాల్డిహైడ్ కలిగిన ఉత్పత్తులను ఉపయోగిస్తున్నప్పుడు వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

ALso Read: తలనొప్పి ఎన్ని రకాలో తెలుసా? రకాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఉంటుందట

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలుమేం చీమూ, నెత్తురు ఉన్న నాకొడుకులమే! బూతులతో రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డిManmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Tirumala : తిరుమలలో వైకుంఠ ఏకాదశి - వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Samantha: సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Embed widget