అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Headache: తలనొప్పి ఎన్ని రకాలో తెలుసా? రకాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఉంటుందట

మీకు తలనొప్పి ఎక్కడ వస్తుంది. అదేంటి ఇదేం ప్రశ్న.. తలనొప్పి తలలో వస్తుందని అని అనుకుంటున్నారా? కానీ తలనొప్పిలోనూ రకాలు ఉన్నాయి.

పని ఒత్తిడి, ఎక్కువగా స్క్రీన్ చూస్తూ ఉండటం వల్ల తలనొప్పిగా అనిపిస్తుంది. బాగా తట్టుకోలేకపోతే ఒక పారాసిటమాల్ వేసుకోవడం లేదంటే వేడి వేడి టీ తాగడం చేస్తారు. మరికొందరైతే కోల్డ్ కంప్రెస్ పెట్టుకుంటారు. తలనొప్పిలోనూ రకాలు ఉన్నాయని మీకు తెలుసా? నుదిటి మీద వస్తే ఒక కారణం, కంటి వల్ల తలనొప్పి వస్తే మరొక కారణం.. ఇలా తలలోని ఏ భాగం వల్ల తలనొప్పి వస్తుందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. అప్పుడే మీకు వచ్చిన తలనొప్పిని తగ్గించుకోగలుగుతారు.

నుదురు

కారణం: టెన్షన్

చికిత్స: పారాసిటమాల్, మసాజ్, హాట్ షవర్

అధికంగా టెన్సిన్ పడితే నుదుటి మీద తలనొప్పి వస్తుంది. ఒత్తిడి, ఆందోళన, నిరాశ ఈ తలనొప్పిని ప్రేరేపిస్తాయి. అలసట, మెడలోని కండరాల సమస్యల కారణంగా కూడా ఈ విధమైన తలనొప్పి సంభవిస్తుంది. ఆస్ప్రిన్ వంటి మందులు వేసుకుంటే సులభంగా ఉపశమనం లభిస్తుంది. హెడ్ మసాజ్, మెడ మీద ఒత్తిడి తగ్గే విధంగా సున్నితమైన వ్యాయామాలు చేయడం, వేడిగా స్నానం చేయడం, నుదుటి మీద వేడి క్లాత్ ఉంచడం వల్ల తగ్గిపోతుంది.

కంటి వల్ల తలనొప్పి

కంటి మీద ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల ఇది వస్తుంది. ఎక్కువ సేపు చదవడం, కంప్యూటర్ చూడటం వల్ల వస్తుంది. ఈ రకమైన అసౌకర్యం ఎదుర్కొంటుంటే మీరు కళ్ల జోడు పెట్టుకోవడం అవసరం. స్క్రీన్ చూడటం నుంచి తప్పనిసరిగా విరామం తీసుకోవాలి. మెడ, చేతులు, వీపులు సాగదీయడం వల్ల కంటి చూపు వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించుకోవచ్చు.

సైనస్ సమస్య

నుదుటి మీద తలనొప్పికి మరొక కారణం సైనస్. ముక్కు రంధ్రాలు క్లియర్ చేసుకోవడానికి వేడి నీటి ఆవిరి పీల్చడం మంచిది. జలుబు, ఫ్లూ వల్ల వస్తే వైద్యులని సంప్రదించి యాంటీ బయాటిక్ వాడటం మంచిది.

కణతల దగ్గర నొప్పి

ఒత్తిడి వల్ల సంభవిస్తుంది. ఇది చాలా బాధకరమైనది. మసాజ్, యోగా, వ్యాయామం వంటి విశ్రాంతిని ఇచ్చే వాటి వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు. నిద్రలేమి వల్ల కూడా ఈ నొప్పి కలుగుతుంది. ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడం, నిద్రలేవడం చేయాలి. ఇది మాత్రమే కాదు కెఫీన్ అధికంగా తీసుకున్నప్పుడు కణతల దగ్గర తలనొప్పిగా ఉంటుంది. యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ప్రకారం పెద్దలు ప్రతిరోజూ 400 ఎంజీ కంటే ఎక్కువ కెఫీన్ తీసుకోకూడదు. టెన్సిన్ వల్ల కూడా నొప్పి రావచ్చు. కోల్డ్ ప్యాక్స్ ఉపయోగించడం మంచిది.

తలవెనుక భాగంలో నొప్పి

ఇది కూడ టెన్షన్ వల్లే కలుగుతుంది. కోల్డ్ ప్యాక్స్, చీకటిగా ఉన్న గదిలో కాసేపు పడుకోవడం వంటివి చేస్తే ఉపశమనం కలుగుతుంది. మెడ వ్యాయామాలు, ఫిజికల్ థెరపీ వంటి చేసినా తల వెనుక భాగంలో వచ్చే తలనొప్పిని తగ్గిస్తాయి.

కుడివైపు మాత్రమే నొప్పి

మైగ్రేన్ బాధితులు తరచుగా తల కుడివైపు నొప్పిని అనుభవిస్తారు. పీరియడ్స్ టైమ్, ఆందోళన, టైమ్ కి తినకపోవడం వంటి సమయాల్లో కూడ వస్తుంది. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే చికిత్స తీసుకోవాలి. తల కుడివైపు నొప్పి అనేది గాయాలు, అనూరిజం, కణితులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన అంతర్లీన పరిస్థితులకు సూచికగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే కుడి వైపు తలనొప్పి వస్తే అసలు విస్మరించొద్దు.

కంటి చుట్టూ నొప్పి

దీన్నే క్లస్టర్ తలనొప్పి అంటారు. కంటి చుట్టూ నొప్పిగా అనిపిస్తుంది. ఒకే సమయంలో లేదా కొన్ని నిర్ణీత సమయాల్లో మాత్రమే వస్తుంది. సడెన్ గా వచ్చి సడెన్ గా తగ్గిపోతుంది. దీనికి ఖచ్చితమైన కారణం తెలియదు. ధూమపానం, మద్యపానం, వ్యాయామం, పెర్ఫ్యూమ్ స్మెల్ పడకపోవడం వంటివి కారణాలు కావచ్చు.  

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: పెరుగు మిలిపోయిందా? ఇదిగో ఈ టేస్టీ వంటలు చేసేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget