Menstrual Cup: మెన్‌స్ట్రువల్ కప్ చూసి భయపడకండి, దాన్ని వాడడం చాలా సులువు
నెలసరి సమయంలో వాడేందుకు వచ్చిన మరో వినూత్న పద్ధతి మెన్ స్టువల్ కప్. ఈ కప్ గురించి చాలా మంది మహిళల్లో అవగాహనే లేదు.
నెలసరి సమయంలో పూర్వం మెత్తటి వస్త్రాలనే వాడేవారు. వాటి వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు సోకుతుండడంతో శానిటరీ ప్యాడ్స్ ఎంట్రీ ఇచ్చాయి. ప్రస్తుతం వీటినే దాదాపు అందరూ వినియోగిస్తున్నారు. కాకపోతే వీటి ధర పెరిగిపోతుండడంతో పేద ఆడపిల్లలకు వాటిని కొనడం కాస్త కష్టంగానే మారింది. వాటిని ఒక్కసారి వాడితే బయటపడేయడమే. వీటికి ప్రత్యామ్నాయంగా వచ్చింది మెన్‌స్ట్రువల్ కప్. దీన్ని ఒక్కసారి కొనుక్కుంటే ఎన్నిసార్లయినా వాడుకోవచ్చు.
ఎలా వాడాలి?
శానిటరీ ప్యాడ్స్ కు బదులు ఈ కప్‌ను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. నాలుగు నుంచి ఆరు సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. చుట్టుకొలత 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. సాధారణ రక్తస్రావం అయ్యేవారికి ఇది సరిపోతుంది. దీన్ని వాడడం సురక్షితమే. పదేళ్ల పాటూ దీన్ని వాడుకోవచ్చు. ఈ కప్ మెత్తగా ఉంటుంది. దీన్ని మడతబెట్టేయచ్చు కూడా. దీన్ని జననాంగంలోపల పెట్టుకునే ముందు చిన్నగా మడతబెట్టుకోవాలి. ఫోటోలో చూపించినట్టు పెట్టుకున్నాక చేయి వదిలేస్తే మడతలు ఓపెన్ అవుతాయి. టాయిలెట్ బెడ్ పై కూర్చుని పెట్టుకోవడం సులువుగా ఉంటుంది. పెట్టుకున్నాక ఇది లోపల గోడలకు అతుక్కుని ఉంటుంది. పడిపోతుందన్న భయం లేదు. ఒకసారి పెట్టుకుంటే 12 గంటలు చూసుకోనక్కర్లేదు.
శుభ్రత ఎలా?
అలవాటు లేని వాళ్లు ఇది విన్నప్పుడే చికాకుగా అనిపిస్తుంది, రెండు మూడు సార్లు వాడాక మాత్రం చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది. మళ్లీ శానిటరీ ప్యాడ్స్ వాడాలనిపించదు. మీకు నచ్చినప్పుడు కప్పుని తీసి క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని ముందుగా వేడి నీటిలో అయిదు నిమిషాల పాటూ మరిగించాలి. ఒక శుభ్రమైన సంచిలో పెట్టి దుమ్ము ధూళి పడకుండా మడత బెట్టి దాచేయాలి.
గర్భం రాకుండా లూప్ (కాపర్ టి) వేయించుకున్న మహిళలు కూడా ఈ కప్ ను వాడుకోవచ్చు. లూప్ గర్భసంచి లోపల అమరుస్తారు. మెన్ స్టువల్ కప్ అంతవరకు చేరదు. జననాంగా ద్వారం వద్దే ఉంటుంది. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా దీన్ని వాడుకోవచ్చు.
సమస్య ఉంటుందా?
మెన్‌స్ట్రువల్ కప్ వాడడం వల్ల ఏ సమస్యా ఉండదు కానీ, దాన్ని పరిశుభ్రంగా ఉంచకపోతే ఇన్ఫెక్షన్లు వస్తాయి. వాడే ముందు కచ్చితంగా వేడి నీటితో కడగాలి. ఇదే కాదు ఏదైనా పరిశుభ్రంగా లేకపోతే దానిపై వైరస్ లు చేరుతాయి. కాబట్టి అన్నింటనీ శుభ్రంగా ఉంచుకోవాల్సిందే.
Also read: బెడ్ షీట్లు మార్చడానికి అంత బద్ధకమా? సర్వేలో షాకింగ్ నిజాలు
Also read: వినూత్నంగా ఆవులకూ ఫేస్ మాస్క్‌లూ, వాటి నుంచి వచ్చే విషవాయువును అడ్డుకోవడానికే ఇదంతా