BedSheets: బెడ్ షీట్లు మార్చడానికి అంత బద్ధకమా? సర్వేలో షాకింగ్ నిజాలు
ఎంత పరిశుభ్రంగా ఉంటే అంటే ఆరోగ్యం. పరిశుభ్రతలో దుస్తులు, బెడ్ షీట్లు శుభ్రంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది.
మీరెన్ని రోజులకోసారి బెడ్ షీట్లను మారుస్తారు? ఈ ప్రశ్న వినగానే వింతగా అనిపిస్తోందా? కానీ చాలా ముఖ్యమైన అంశం. బెడ్ షీట్లను తరచూ మార్చడం, వాటిని ఉతకడం ఇంట్లోని పరిశుభ్ర వాతావరణానికి అత్యవసరం. కానీ చాలా మంది బెడ్ షీట్లు మాసిపోయినా కూడా మార్చకుండా వాటిపై నే నిద్రపోతున్నట్టు సర్వేలో తేలింది. అంతేకాదు బెడ్ షీట్లను కొంతమంది నాలుగు నెల సమయం తీసుకుంటున్నట్టు అధ్యయనం ద్వారా తెలిసింది. ఇలా చేయడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టిరియాలు, వైరస్ లు ఇంట్లో చేరే అవకాశం ఉంది.
సర్వే ఏం చెబుతోంది?
బ్రిటన్లోని 2,250 మందిపై అధ్యయనం జరిగింది. ఈ శాంపిల్ సర్వేలో ఒంటరిగా నివసిస్తున్న పురుషులు నాలుగు నెలలకోసారి బెడ్ షీట్ మారుస్తున్నట్టు తేలింది. మరికొంతమంది తమకు ఎప్పుడు ఉతకాలనిపిస్తే అప్పుడు ఉతుకుతామని, అది ఎన్ని నెలలైనా పట్టొచ్చని చెప్పారు. ఇక ఒంటరిగా ఉంటున్న మహిళలు మాత్రం తరచూ తాము బెడ్ షీట్లను మారుస్తూనే ఉంటామని చెప్పారు. వారిలో 62 శాతం మంది ప్రతి రెండు వారాలకోసారి తాము బెడ్ షీట్ మారుస్తామని, వాటిని ఉతుక్కుంటామని చెప్పారు. ఇక పెళ్లయిన జంటలు ప్రతి మూడు వారాలకోసారి బెడ్ షీట్ మారుస్తామని తెలిపారు.
ఎన్నాళ్లకు మార్చాలి?
వైద్యుల సూచన మేరకు ప్రతి వారం బెడ్ షీట్ మారిస్తే మంచిది, లేదా రెండు వారాలకోసారైనా కచ్చితంగా మార్చాలి. పరిశుభ్రత చాలా అత్యసవరమైన అంశమని, వేసవిలో చెమట అధికంగా దుప్పట్లే పీల్చుకుంటాయని చెబుతున్నారు వైద్యులు. అవి త్వరగా దుర్వాసన రావడమే కాకుండా, వాటిలో దుమ్మూధూళి, వైరస్ చేరుతాయని చెబుతున్నారు. అంతేకాదు మన చర్మంపై మృతకణాలు ఉంటాయి, అవి కూడా దుప్పట్లలో చేరుకుంటాయి. కొన్ని వారాల పాటూ మృతకణాలు దుప్పట్లలో పేరుకుపోయి సూక్ష్మజీవులకు ఆవాసంగా మారుతాయి. అందుకే ఎప్పటికప్పుడు బెడ్ షీట్లను మార్చుకోవడం చాలా మంచిది.
వేసవిలో ప్రతి వారం...
శీతాకాలంతో పోలిస్తే వేసవిలో బెడ్ షీట్లు త్వరగా మాసిపోతాయి కాబట్టివ ప్రతి వారం దుప్పట్లు మారిస్తే చాలా మంచిది. మురికి దుప్పట్ల మధ్యలో పడుకోవడం వల్ల మీకు ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు. రాత్రి పడుకోబోయే ముందు స్నానం చేసే అలవాటున్న వారు మాత్రం బెడ్ షీట్లు ప్రతి వారం మార్చాల్సిన అవసరం లేదు.
Also read: వినూత్నంగా ఆవులకూ ఫేస్ మాస్క్‌లూ, వాటి నుంచి వచ్చే విషవాయువును అడ్డుకోవడానికే ఇదంతా
Also read: రోజూ నవ్వండి, రోగనిరోధక శక్తి పెంచుకోండి