By: ABP Desam | Updated at : 01 May 2022 08:54 AM (IST)
Edited By: harithac
(Image credit: Bloomberg)
వాతావరణంలో విషవాయువులు పెరుగుతున్న కొద్దీ భూమి మనుగడ కష్టమైపోతుంది. భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ. ఆవుల నుంచి కూడా భూమికి హాని చేసే మీథేన్ విడుదలవుతుంది. అవి తేనుపులు తీసే సమయంలో మీథేన్ వాటి నోరు, ముక్కు ద్వారా వాతావరణంలో కలుస్తుంది. ఆ వాయువును అడ్డుకునేందుకు బ్రిటన్ స్టార్టప్ ఆవులను వినూత్నమైన ఫేస్ మాస్క్‌లను తయారుచేయడం మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టుకు బ్రిటన్ రాజు ప్రిన్స్ ఛార్లెస్ మద్దతు ఉంది. ఆయనే ఆర్ధికంగా సాయాన్ని అందిస్తున్నారు.
జెల్ప్ బ్రిటన్లోని ఓ స్టార్టప్ కంపెనీ. ఇది అతి పెద్ద మాంసం ఉత్పత్తిదారులతో కలిసి పనిచేస్తోంది. ఆవుల నుంచి వచ్చే మీథేన్ ను తగ్గించేందుకు ఇది ఫేస్ మాస్క్ లు తయారుచేసింది. ఈ మాస్క్ మీథేన్ విడుదలవ్వగానే దాన్ని మాస్క్ గ్రహిస్తుంది. ఈ విషవాయువు మైక్రో సైజ్ ఉత్ప్రేరక కన్వర్టర్ ద్వారా ప్రయాణిస్తుంది. అక్కడ కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరిగా మారి గాలిలో కలిసిపోతుంది. ఇప్పటికే ఈ మాస్క్ లు ట్రయల్ పరీక్షలు కూడా పూర్తయ్యాయి.ట్రయల్స్ లోనే మీథేన్ ఉద్గారాల్లో 53 శాతం తగ్గుదల కనిపించిందని కంపెనీ తెలిపింది. వచ్చే ఏడాది 60 శాతం మీథేన్ ఉద్గారాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
బ్రిటన్ రాజుకు నచ్చింది
ఈ ప్రాజెక్టు గురించి తెలుసుకున్న బ్రిటిన్ రాజు ప్రిన్స్ ఛార్లెస్ దీన్ని చాలా ఆకర్షణీయమైన ఆవిష్కరణగా పేర్కొన్నారు. రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఈ ఆవిష్కరణకు మూల కారకులు. ఆ కాలేజ్ కు రాయల్ విజిటర్ గా వెళుతుంటారు ప్రిన్స్ చార్లెస్. అందుకు ఈ ప్రాజెక్టుకు ఆయన తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆర్థిక సాయం అందించేందుకు కూడా ముందుకు వచ్చారు. అంతేకాదు దీనికి 50,000 పౌండ్ల బహుమతిని కూడా అందించారు. వచ్చే ఏడాది వాణిజ్య మార్కెట్లోకి ఈ మాస్క్ లు అడుగుపెట్టబోతున్నాయి.
గ్రీన్ హౌస్ వాయువుల్లో మీథేన్ కూడా ఒకటి. ఇది వాతావరణంలో అధికంగా పెరగడం వల్ల భూ వాతావరణాన్ని విపరీతంగా ప్రభావం చేసే అవకాశం ఉంది. ఉపరితల ఉష్ణోగ్రత అధికంగా పెరిగిపోతుంది. చమురును వెలికితీసే ప్రక్రియలో సహజ వాయువుల నుంచి కూడా మీథేన్ అధికస్థాయిలో విడుదలవుతోంది. దీన్ని నివారించాల్సిన అవసరం ఉంది. అధికంగా చెత్త పేరుకుపోయినా కూడా అందులోని బయో ఉద్గారాలు కుళ్లిపోయి మీథేన్ వాయువును విడుదల చేస్తాయి. దాదాపు 100 దేశాలు మీథేన్ ఉద్గారాలను తగ్గిస్తామన్న ఒప్పందపై సంతకాలు చేశాయి. కానీ ఇంతవరకు ఏ దేశం కూడా మీథేన్ ఉద్గారాలను తగ్గించేందుకు సరైన మార్గాన్ని కనిపెట్టలేకపోయాయి.
Also read: రోజూ నవ్వండి, రోగనిరోధక శక్తి పెంచుకోండి
Also read: వాటర్ మెలన్ తిన్న తరువాత నీళ్లు తాగకూడదంటారు, ఎందుకు?
Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!
Dangerous Medicine: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!
Sunscreen Benefits: సన్ స్క్రీన్‌తో చర్మం నల్లగా మారిపోతుందా? ఈ 8 అపోహలను అస్సలు నమ్మొద్దు!
Headphones side effects: హెడ్‌ఫోన్స్ అతిగా వాడుతున్నారా? చూడండి, ఎంత ప్రమాదమో!
Warts Removal Tips: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి
Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ
RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!
Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం