అన్వేషించండి

Diwali Recipes: దీపావళికి సింపుల్‌గా చేసుకునే స్వీట్ రెసిపీలు ఇవిగో, వీటితో నోరు తీసి చేసుకోండి

Diwali Recipes: దీపావళి సందర్భంగా ఏ స్వీట్ చేసుకోవాలో ఆలోచిస్తున్నారా? వీటిని ప్రయత్నించండి

Diwali Recipes: దీపావళి రోజు కచ్చితంగా నోరు తీపి చేసుకోవాల్సిందే. అలాగే ఇంటికొచ్చే అతిధులకు స్వీట్లు పంచాల్సిందే. ఆ స్వీట్లు కొని తెస్తే ఏం బావుంటుంది, ఇంట్లోనే మీరు టేస్టీగా వండి పెడితే ఆ ఆనందమే వేరు. 

కలాకండ్
కావాల్సిన పదార్థాలు
క్రీమ్ మిల్క్ -ఒక లీటరు
పంచదార - వంద గ్రాములు
యాలకుల పొడి - అరస్పూను
నెయ్యి - ఒక టీస్పూను
నిమ్మరసం - రెండు టీస్పూన్లు

తయారీ ఇలా
1. ఒక కళాయిలో పాలు పోసి స్టవ్ మీద పెట్టాలి. స్టవ్‌ను చిన్న మంట మీదే ఉంచాలి.
2. పాలును అలా చిన్న మంట మీదే మగ్గిస్తూ ఉంటే సగానికి పైగా ఆవిరై అరలీటరు చిక్కని పాలగా మారుతాయి. 
3. ఇప్పుడు నిమ్మరసాన్ని కలిపితే పాలు విరిగిపోతాయి. 
4. ఆ పాలలో పంచదారను కూడా వేసి అలా ఉడికించాలి. 
5. ఆ మిశ్రమం అంతా చిక్కగా మారేవరకు అలా మగ్గించాలి. 
6. అందులో యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. 
7. కలాకండ్‌లా చిక్కగా మారాక స్టవ్ కట్టేయాలి. 
8. ప్లేటుకు నెయ్యి రాసి వేడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. 
9. కాస్త గట్టిపడ్డాక ముక్కలుగా కోసుకోవాలి. 
10. అంతే అదిరిపోయే టేస్ట్‌తో క‌లాకండ్ త‌యారైపోయిన‌ట్లే!

.....................................

పాలపొడి బర్ఫీ
కావాల్సిన పదార్థాలు 
పాల పొడి - ఒక కప్పు
పంచదార పొడి - పావు కప్పు
నెయ్యి - అరకప్పు
నట్స్ - సన్నగా తరిగినవి 

తయారీ ఇలా
1. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
2. ఆ నెయ్యిలో పాలపొడి వేసి ఉండలు చుట్టకుండా కలుపుతూనే ఉండాలి. 
3. అందులో పంచదార పొడి కూడా వేసి కలుపుతూనే ఉండాలి. 
4. అది చిక్కగా అయ్యే వరకు చిన్న మంట మీద ఉంది కలుపుతూనే ఉండాలి. 
5. చిక్కగా అయ్యాక స్టవ్ కట్టేయాలి. 
6. ప్లేటుకు నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేసి పైన నట్స్ తరుగును చల్లుకోవాలి. 
7. బర్ఫీల్లా కట్ చేసుకోవాలి. పాలపొడి బర్ఫీ రెడీ అయినట్టే. 

............................................

బాసుంది
కావాల్సిన పదార్థాలు
క్రీమ్ తీయని పాలు - ఒక లీటరు
చక్కెర - ముప్పావు కప్పు
తరగిన బాదం, పిస్తాలు - మూడు స్పూన్లు
యాలకుల పొడి - అరస్పూను

తయారీ ఇలా
1. మందపాటి గిన్నెలో పాలు వేసి స్టవ్ మీద పెట్టాలి.
2. బాగా మరిగించాలి. చిన్న మంట మీద అలా గంట పాటూ మరిగిస్తే కాస్త రంగు మారుతాయి పాలు. 
3. అంచులకు అంటుకున్నది కూడా గరిటెతో తీస్తూ పాలు మరిగిస్తూ ఉండాలి. 
4. ఇప్పుడు అందులో పంచదార కలపాలి. మళ్లీ తక్కువ మంట మీద కనీసం అరగంట పాటూ మరిగించాలి. 
5. అందులో యాలకుల పొడిని కూడా వేయాలి. 
6. అలా పావుగంట సేపు మరిగాక స్టవ్ కట్టేయాలి. 
7. పైన బాదం, పిస్తాలు తరిగి చల్లాలి. టేస్టీ బాసుంది రెడీ అయినట్టే. 

Also read: దీపావళికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఆచారం, అన్నీ ఆసక్తికరమైనవే

Also read: దీపావళికి ఇంటి ముందు వెలిగించాల్సిన దీపాల లెక్క ఇదే, అవి ఎక్కడెక్కడ పెట్టాలంటే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Thyroid Weight Loss Tips : థైరాయిడ్ ఉంటే బరువు తగ్గడం కష్టమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
థైరాయిడ్ ఉంటే బరువు తగ్గడం కష్టమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Joining in Hostel : మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
Telangana Men Health : తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
Which Car Is Best: పెట్రోల్ కారును CNGగా మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి
పెట్రోల్ కారును CNGగా మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Embed widget