By: Haritha | Updated at : 12 Oct 2022 11:42 AM (IST)
గంగానది ఒడ్డున దీపావళి
Diwali Celebrations: మనదేశంలోని అతి పెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. పిల్లలకు ఎంతో ఇష్టమైన పండుగ ఇది. ఈ పండుగకే కదా వాళ్లు టపాసులు కాల్చేది. లక్ష్మీ దేవిని పూజించే పండుగ కావడంతో దీన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఈ పండుగను తమ ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం చేసుకుంటారు. ఆ సాంప్రదాయాలు కొన్ని చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
చేపలే నైవేద్యంగా...
పశ్చిమబెంగాల్ లో దీపావళి రాత్రి కాళీ పూజను చేస్తారు. దీన్నే శ్యామ పూజ అంటారు. కాళీ మాతను మందార పూలతో అలంకరించి పూజిస్తారు. ఈ రోజున అమ్మవారికి స్వీట్లు, పప్పు, అన్నంతో పాటూ చేపలు కూడా వండి నైవేద్యంగా సమర్పిస్తారు. కోల్‌కతాలోని దక్షిణేశ్వర్, కాళీఘాట్ ఆలయాల్లో ఈ కాళీ పూజను ఘనంగా నిర్వహిస్తారు.ఈ పూజకు భారీగా భక్తులు హాజరవుతారు. కాళీపూజకు ముందు రాత్రి బెంగాలీ ప్రజలు తమ ఇళ్లల్లో 14 దీపాలను వెలిగించి దుష్ట శక్తులను పారద్రోలుతారు. కాళీమాత విగ్రహాలను పెట్టి భారీగా పూజలు చేస్తారు. శాకిని, డాకిని వేషాలను వేసుకుని చాలా మంది రాక్షసుల్లా సంచరిస్తారు.
దేవ్ దీపావళి
వారణాసి (కాశీ)లో దీపావళిని ‘దేవ్ దీపావళి’గా నిర్వహించుకుంటారు. ఈ సమయంలోనే గంగానదిలో స్నానం చేసేందుకు దేవతలు భూమికి వస్తారని భక్తుల నమ్మకం. అందుకే గంగానది ఒడ్డున రంగవల్లికలు వేసి దీపాలు పెట్టి పూజలు నిర్వహిస్తారు. ఆ రోజున గంగానది చూడముచ్చటగా ఉంటుంది.
జనపనార కర్రలు కాల్చి
ఒడిశాలో దీపావళి రోజు ‘కౌరియ కతి’చేస్తారు. ఇది వారికి చాలా ముఖ్యమైన ఆచారం. కౌరియ కతి అనేది స్వర్గంలో తమ పూర్వీకులను పూజించే ఆచారం. ఈ రోజున తమ పూర్వీకుల ఆత్మలను పిలిచేందుకు, వారి నుంచి ఆశీర్వాదం పొందేందుకు జనపనార కర్రలను కాలుస్తారు. అలాగే ఈ పండుగ రోజున లక్ష్మీదేవిని, వినాయకుడిని, కాళీ మాతను పూజిస్తారు.
ధన్వంతరికి పూజలు
మహారాష్ట్రాలో దీపావళిని చాలా ప్రత్యేకంగా నిర్వహించుకుంటారు. ‘వాసు బరస్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఆవులను పూజిస్తారు. పురాతన వైద్యుడైన ధన్వంతరికి నివాళులు అర్పిస్తారు. భార్యాభర్తల ప్రేమకు చిహ్నంగా కొన్ని నియమాలు పాటిస్తారు. వివాహాలు ప్రారంభాన్ని సూచించే భావ్ బిజ్, తుస్లీ వివాహ్‌తో వేడుకలు ముగుస్తాయి.
కొత్త ఏడాది వేడుకలు
దీపావళితో గుజరాత్ ప్రజలకు ఒక సంవత్సరం ముగుస్తుంది. దీపావళి మరుసటి రోజున గుజరాతీ నూతన సంవత్సర దినోత్సవమైన ‘బెస్టు వరాస్’ను నిర్వహించుకుంటారు. ఈ వేడుకలు వాగ్ బరాస్‌తో ప్రారంభమవుతాయి. తర్వాత ధన్‌తేరాస్, కాళీ చౌదాష్, దీపావళి, బెస్తు వరాస్, భాయ్ బిజ్ ఇలా వరుసపెట్టి రోజుకో పండుగలను చేసుకుంటారు.
కొబ్బరినూనె
గోవాలో నరకాసురుడిని సంహరించినందుకు శ్రీకృష్ణుడికి దీపావళిని అంకితం చేస్తారు. దీపావళికి ముందు రోజు నరకాసుర చతుర్దశి నిర్వహించి తెల్లవారుజామున రాక్షసుడి దిష్టిబొమ్మలను తయారు చేసి దహనం చేస్తారు. దీపావళి సందర్భంగా, గోవాలో కొన్ని ప్రాంతాలలో చాలా మంది ప్రజలు పాపం నుండి విముక్తి కోసం తమ శరీరాలపై కొబ్బరి నూనెను పూసుకుంటారు.
Also read: దీపావళికి ఇంటి ముందు వెలిగించాల్సిన దీపాల లెక్క ఇదే, అవి ఎక్కడెక్కడ పెట్టాలంటే
Also read: మళ్లీ పుట్టుకొచ్చిన రెండు కొత్త కోవిడ్ వేరియంట్లు, పలు దేశాల్లో బయటపడుతున్న కేసులు
రూ.99 చెల్లిస్తే కోపం తీర్చుకునేందుకు ఏవైనా పగలగొట్టొచ్చు - అదే ఈ రేజ్ రూమ్ ప్రత్యేకత
ఈ జ్యూసు రోజుకో గ్లాసు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం
Blood Circulation: శరీరంలో రక్త సరఫరా సరిగా జరగకపోతే కనిపించే లక్షణాలు ఇవే - జాగ్రత్త
Heart Attack: రక్తనాళాల్లో కొవ్వు చేరకూడదనుకుంటే సజ్జలను మెనూలో చేర్చుకోండి
ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఛాతీలోని కఫం, దగ్గు త్వరగా తగ్గిపోతాయి
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య మృతి కేసులో ట్విస్ట్- జ్యోతిని వేధించి చంపారని కుటుంబ సభ్యుల ఆరోపణ
Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం
Kalyan Ram On Taraka Ratna Health : ఎందుకీ మౌనం - తారక రత్న హెల్త్ అప్డేట్ మీద కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?
Tegimpu Movie OTT: ఓటీటీలోకి అజీత్ ‘తెగింపు‘ - స్ట్రీమింగ్ మొదలైంది, ఎక్కడో తెలుసా?