Heart Attack Test : గుండెపోటు ముప్పును ముందుగానే గుర్తించే బ్లడ్ టెస్ట్.. కొలెస్ట్రాల్ టెస్ట్ కాదు
Heart Attack : గుండెపోటు వస్తుందో లేదోనని చాలామంది కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకుంటారు. కానీ ఓ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే గుండెపోటు ప్రమాదం ఉందో లేదో చాలా క్లియర్‌గా తెలుస్తుందట. ఆ టెస్ట్ ఏంటి అంటే..

Blood Test to Predict Heart Attack : ఈ మధ్యకాలంలో గుండె సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ సమస్యలు వయసు తేడా లేకుండా చాలామందిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గుండెపోటు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే దీనిని ముందుగా గుర్తిస్తే కచ్చితంగా ప్రాణాలు కాపాడవచ్చు. ఎలాంటి సంకేతాలు లేకున్నా.. మీరు హార్ట్ ఎటాక్ వస్తుందో రాదో తెలుసుకోవాలనుకుంటో ఓ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే హార్ట్ ఎటాక్ వస్తుంది. నిజమే. అందుకే చాలామంది గుండె ఆరోగ్యం కోసం కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకుంటారు. అయితే గుండెపోటు వస్తుందో లేదో తెలుసుకోవడానికి కొలెస్ట్రాల్ టెస్ట్ కాదట.. ఓ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలంటున్నారు కార్డియాలజిస్ట్ డిమిత్రి యారనోవ్. తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో ఆ టెస్ట్‌కు సంబంధించిన పోస్టు షేర్ చేసి.. ఇలా రాసుకొచ్చారు. ఆ బ్లడ్ టెస్ట్ ఏంటో.. దానికి గుండెపోటుకు ఉన్న కనెక్షన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
“The Blood Test That Predicts Heart Attacks? It’s Not Cholesterol. CRP — C-reactive protein — is a marker of inflammation, and high levels are linked to up to 3x higher risk of heart attack. And here’s the twist: your cholesterol could be “normal”… and CRP still dangerously high.” అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉన్నాసరే.. CRP టెస్ట్‌లో వచ్చే ఫలితాలు మీకు గుండెపోటు వస్తుందో రాదో చెప్పేస్తాయట. అందుకే దీనిని కచ్చితంగా చేయించుకోవాలంటున్నారు.
View this post on Instagram
CRP టెస్ట్ అంటే ఏమిటి?
CRP అనేది ఓ బ్లడ్ టెస్ట్. దీనిని C-రియాక్టివ్ ప్రోటీన్ టెస్ట్ అంటారు. దీనిని చేయడంవల్ల మీకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎంత ఉందో తెలిసిపోతుంది. మీరు ఇప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు దీనిని చేయించుకోవడం ఉత్తమం. ఈ టెస్ట్‌లో శరీరంలోని వాపునకు ప్రతి స్పందనగా.. కాలేయం ఉత్పత్పి చేసే C-రియాక్టివ్ ప్రోటీన్‌ను గుర్తిస్తారు. దీని స్థాయిలు అధికంగా ఉంటే.. దీర్ఘకాలిక వాపుతో పాటు.. వివిధ ప్రమాదాలకు దారి తీస్తాయి.
CRP Level < 1.0 mg/L ఉంటే రిస్క్ తక్కువ, 1.0 – 3.0 mg/L రిస్క్ ఉంటుంది కానీ సీరియస్ కాదు.. 3.0 mg/L ఉంటే ప్రమాదం ఎక్కువగా ఉందని అర్థం. శరీరంలో C-రియాక్టివ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటే గుండెపోటు, స్ట్రోక్, ఆర్టరీ డీసిజ్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ మూడు కూడా గుండెకు సంబంధించిన జబ్బులే. బ్లడ్ క్లాట్ అవ్వడం, సడెన్‌గా గుండెపోటు రావడం జరుగుతాయి.
CRP తగ్గించుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్
CRP లెవెల్స్ ఎక్కువగా ఉన్నా.. గుండె సమస్యలను దూరం చేసుకోవాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని.. కార్డియాలజిస్ట్ డిమిత్రి యారనోవ్ తెలిపారు. అవేంటంటే.. ” హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి. ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ మరీ మంచివి. శారీరక శ్రమ ఉండాలి. కనీసం వాకింగ్ అయినా చేయాలి. మీ బాడీ వెయిట్ కంటే ఎంత ఎక్కువ ఉంటే ఆ బరువు తగ్గాలి. స్మోకింగ్ మానేయాలి. వైద్యులు సూచించే స్టాటిన్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీలు ఫాలో అవ్వాలి.” ఇవన్నీ సీఆర్పీ లెవెల్స్‌ని కంట్రోల్ చేసి.. గుండె సమస్యలను దూరం చేస్తాయని తెలిపారు.






















