X

Covaxin: ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే ఒమిక్రాన్‌పై ప్రభావవంతంగా పనిచేసేది కోవాక్సినే... చెబుతున్న ఐసీఎమ్ఆర్ అధికారులు

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో మళ్లీ కరోనా వ్యాక్సిన్ల సామర్థ్యంపై చర్చ మొదలైంది.

FOLLOW US: 

ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రమాదకరమైనదని తేలనప్పటికీ అప్రమత్తంగా ఉండడం మాత్రం అత్యవసరం. ఈ వేరియంట్ పై ఏ టీకాలు సమర్థవంతంగా పనిచేస్తాయనే అంశాల్లో కూడా పరిశోధనలు సాగుతున్నాయి. కాగా ఇతర టీకాలతో పోలిస్తే కోవాక్సిన్ ఒమిక్రాన్ పై ప్రభావవంతంగా పనిచేస్తుందని ఐసీఎమ్ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అధికారులు చెబుతున్నారు. కోవాక్సిన్ అనేది వైరియన్ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అని, ఇది మొత్తం కరోనా వేరియంట్లను తట్టుకోగలదని, అలాగే అధిక పరివర్తన చెందిన ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్ కు వ్యతిరేకంగా పనిచేయగలదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కోవాక్సిన్ వేయించుకున్న వారికి ఇది శుభవార్తే. 

కోవాక్సిన్ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లపై కూడా ప్రభావవంతంగా పనిచేసినట్టు గతంలోనే కనుగొన్నారు. కాబట్టి ఈ కొత్త వేరియంట్ పై కూడా కచ్చితంగా కోవాక్సిన్ పనిచేస్తుందని ఆశిస్తున్నట్టు ఒక రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు. ‘నమూనాలను సేకరించాక, పుణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలోని వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పరిక్షిస్తాం’ అని చెప్పారు. తొలిసారి వూహాన్లో కనుగొన్న వేరియంట్‌కు వ్యతిరేకంగా టీకాలన్నింటినీ అభివృద్ధి చేయడం జరిగింది.  ఆ తరువాత పుట్టుకొచ్చిన వేరియంట్లపై కూడా టీకాలు పనిచేస్తున్నట్టు పలు పరిశోధనలు నిరూపించాయి. 

మ్యుటేషన్లు ఎక్కువ...
ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ   ఒమిక్రాన్ వేరియంట్‌లో స్పైక్ ప్రోటీన్ ప్రాంతంలో 30కి పైగా మ్యుటేషన్లు కలుగుతున్నాయని, ఇది రోగనిరోధక వ్యవస్థ మెకానిజంను తప్పించుకోగల సామర్థ్యాన్ని ఇస్తుందని తెలిపారు. కాబట్టి ఈ వేరియంట్ పై టీకాల సామర్థ్యాన్ని జాగ్రత్తగా అంచనా వేయాలని హెచ్చరించారు. స్పైక్ ప్రోటీన్ వల్ల వైరస్ మానవ కణంలో ప్రవేశించేందుకు సహాయపడుతుందని, మిగతా కణాలకు వ్యాప్తి చెందేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు. 

‘చాలా వ్యాక్సిన్లు స్పైక్ ప్రోటీన్‌కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను ఏర్పరుస్తాయి. కాబట్టి స్పైక్ ప్రోటీన్ ప్రాంతంలో అనేక మ్యుటేషన్లు ఏర్పడడం వల్ల టీకా సామర్థ్యంలో తగ్గుదల కనిపించవచ్చు’అని కూడా ఆయన తెలిపారు. అందుకే ఈ విషయంలో కచ్చితమైన పరిశోధనలు అవసరమని చెప్పారు. 

Also Read: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక

Also Read: Omicron Variant: 'ఒమిక్రాన్‌'పై గుడ్‌ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!

Also Read:  Delhi Air Pollution: దిల్లీ సర్కార్‌కు సుప్రీం డెడ్‌లైన్.. రేపటి నుంచి పాఠశాలలు బంద్

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,765 కరోనా కేసులు నమోదు, 477 మంది మృతి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Covaxin Omicran Variant Omicran corona variants ఒమిక్రాన్ వేరియంట్

సంబంధిత కథనాలు

Cough and Cold: దగ్గు, జలుబు వేదిస్తున్నాయా? ఈ ఆహారానికి దూరంగా ఉండండి

Cough and Cold: దగ్గు, జలుబు వేదిస్తున్నాయా? ఈ ఆహారానికి దూరంగా ఉండండి

Phone Effect On Sperm: పురుషులకు బ్యాడ్ న్యూస్.. సెల్‌ఫోన్ అతిగా వాడేస్తే.. అది మటాషే! తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Phone Effect On Sperm: పురుషులకు బ్యాడ్ న్యూస్.. సెల్‌ఫోన్ అతిగా వాడేస్తే.. అది మటాషే! తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Shocking: 70 ఏళ్లుగా ఒకే సంస్థలో, అది కూడా ఒక్క సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న వ్యక్తి... ఇంతవరకు అనారోగ్యం బారిన పడలేదట

Shocking: 70 ఏళ్లుగా ఒకే సంస్థలో, అది కూడా ఒక్క సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న వ్యక్తి... ఇంతవరకు అనారోగ్యం బారిన పడలేదట

Arthritis: కీళ్లనొప్పులు వేధిస్తుంటే ఈ ఆహారాలు తినకండి, నొప్పులు ఎక్కువవుతాయి

Arthritis: కీళ్లనొప్పులు వేధిస్తుంటే ఈ ఆహారాలు తినకండి, నొప్పులు ఎక్కువవుతాయి

WeightLoss: ఒక్కరాత్రిలో బరువు పెరిగినట్టు అనిపిస్తోందా? ఇవి కారణాలు కావచ్చు

WeightLoss: ఒక్కరాత్రిలో బరువు పెరిగినట్టు అనిపిస్తోందా? ఇవి కారణాలు కావచ్చు

టాప్ స్టోరీస్

Samantha: సమంత సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది!

Samantha: సమంత సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది!

Student Suicide: ఇంజినీరింగ్ మ్యాథ్స్‌ పరీక్ష లెక్క తప్పింది.. నిండు ప్రాణం పోయింది

Student Suicide: ఇంజినీరింగ్ మ్యాథ్స్‌ పరీక్ష లెక్క తప్పింది.. నిండు ప్రాణం పోయింది

Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్

Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్

Tirumala Sarva Darshan Tickets: నిన్న ప్రత్యేక దర్శనం టికెట్లు మిస్సయ్యారా.. నేడు సర్వ దర్శనం టికెట్లు విడుదల

Tirumala Sarva Darshan Tickets: నిన్న ప్రత్యేక దర్శనం టికెట్లు మిస్సయ్యారా.. నేడు సర్వ దర్శనం టికెట్లు విడుదల