(Source: ECI/ABP News/ABP Majha)
Corona Cases: దేశంలో కొత్తగా 9,765 కరోనా కేసులు నమోదు, 477 మంది మృతి
దేశంలో కొత్తగా 9,765 కరోనా కేసులు నమోదుకాగా 477 మంది మృతి చెందారు.
దేశంలో కరోనా కేసులు 10 వేల కంటే తక్కువే నమోదవుతున్నాయి. కొత్తగా 9,765 కరోనా కేసులు నమోదుకాగా 477 మంది మృతి చెందారు. 8,548 మంది కరోనా నుంచి రికవరయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
COVID19 | India reports 9,765 new cases, 477 deaths and 8,548 recoveries in the last 24 hours; Active caseload currently stands at 99,763 pic.twitter.com/WKj3abp1tK
— ANI (@ANI) December 2, 2021
- మొత్తం కేసులు: 3,46,06541
- మొత్తం మరణాలు: 4,69,724
- యాక్టివ్ కేసులు: 99,763
- మొత్తం కోలుకున్నవారు: 3,40,37,054
యాక్టివ్ కేసుల సంఖ్య 99,763కు పెరిగింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.29%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. రికవరీ రేటు 98.35%గా ఉంది.
ఒమ్రికాన్ భయాలు..
ఒమ్రికాన్ వేరియంట్‌పై దేశంలో భయాందోళనలు నెలకొన్నాయి. ముప్పు దేశాలైన యూకే, నెదర్లాండ్స్ నుంచి దిల్లీకి వచ్చిన ఆరుగురిని లోక్‌నాయక్ ఆసుపత్రిలో చేర్చారు. ఇందులో నలుగురికి పాజిటివ్‌గా తేలగా మరో ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించాయి.
ఈ శాంపిళ్లను ఒమిక్రాన్ వేరియంట్ గుర్తింపు కోసం జీనోమ్ సీక్వెన్సింగ్‌కు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు పంపారు.
వ్యాక్సినేషన్..
దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. బుధవారం 80,35,261 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,24,96,19,515 కు చేరింది.
Also Read: ఈ మొక్క ఆకులు పంచదార కన్నా వందరెట్లు తీపి... చక్కెర బదులు దీన్ని వాడితే బెటర్
Also Read: ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది
Also Read: టమోటో సూప్‌ను ఇలా చేసుకుని తాగండి... క్యాన్సర్‌ను కూడా అడ్డుకుంటుంది
Also Read: ఎయిడ్స్ లక్షణాలు ఏంటి? ఆ రోగులు ఏం తినాలి? ఏం తినకూడదు?
Also Read: ఓమ్రికాన్ వేరియంట్ వేళ...ఈ బ్లడ్ గ్రూపుల వాళ్లకే హై రిస్క్, చెబుతున్న ఇండియన్ అధ్యయనం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి