Sunday Special Biryani Recipe : క్రిస్మస్, సండే స్పెషల్.. చెట్టినాడ్ చికెన్ బిర్యానీ రెసిపీ
Chicken Biryani Recipe : నాన్‌వెజ్ ప్రియులకు బిర్యానీ అంటే ఎంత ఇష్టముంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మీరు స్పెషల్‌గా బిర్యానీ తినాలనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి.
Chettinad Chicken Biryani Making Process : వింటర్ ఫెస్టివల్ దగ్గర్లోనే ఉంది. క్రిస్మస్తో పాటు న్యూఇయర్, వెంటనే సంక్రాంతి ఇలా పండుగ సమయంలో ఇళ్లు వంటకాలతో.. ముఖ్యంగా చికెన్‌తో ఘుమఘుమలాడకపోతే ఎలా? పండుగ అంటేనే నాన్‌వెజ్ అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు. అయితే మీరు పండుగ సమయంలో ఇంట్లోవారికి స్పెషల్‌గా ఏదైనా రెసిపీ చేయాలనుకుంటే మీరు చెట్టినాడ్ చికెన్ బిర్యానీ చేయొచ్చు. దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - రెండు కప్పులు
చికెన్ - అరకిలో
ఉల్లిపాయలు - 2 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమాటాలు - 2 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పశ్చిమిర్చి - 2
వెల్లుల్లి - మూడు రెబ్బలు 2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం - అంగుళం (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పెరుగు - పావు కప్పు
పసుపు - 1 టీస్పూన్
కారం - 1 టీస్పూన్
సోంపు - 1 టీస్పూన్
లవంగాలు - 3
యాలకులు -3
ధనియాపొడి - 1 టీస్పూన్
నెయ్యి - 2 టేబుల్ స్పూన్స్
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
కొత్తిమీర - ఒక కట్ట (మీడియం)
చికెన్ మారినేట్ చేయడం కోసం..
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
పెరుగు - అరకప్పు
పసుపు - 1 టీస్పూన్
కారం - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
గార్నిష్ కోసం
ఉల్లిపాయలు -2 (సన్నగా కోయాలి)
జీడిపప్పు - 15
ఉల్లిపాయలు, జీడిపప్పును గోధుమరంగులోకి వచ్చేవరకు నూనె వేసి రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
చెట్టినాడ్ చికెన్ బిర్యానీ తయారీ విధానం
చెట్టినాడ్ చికెన్ బిర్యానీ కోసం ముందుగా చికెన్‌ను మారినేట్ చేయాలి. దీనికోసం గిన్నె తీసుకుని దానిలో చికెన్ వేయండి. దానిని బాగా కడిగి నీరు లేకుండా వడకట్టండి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు, కారం, ఉప్పు వేయండి. ఈ పదార్థాలు అన్ని బాగా కలిసేలా.. చికెన్ ముక్కలకు బాగా పట్టేలా మిక్స్ చేయండి. దీనిని గంటపాటు పక్కన పెట్టేయండి.
బిర్యానీని తయారు చేయడానికి 20 నిమిషాల ముందు బియ్యాని బాగా కడిగి.. నానబెట్టాలి. దానిలోని నీటిని వడపోసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై పెద్ద పాన్ పెట్టండి. దానిలో నెయ్యి వేసి వేడి చేయండి. సోంపు, లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకులు వేయండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వేసి బాగా కలపండి. అవి గోధమ బంగారు రంగులోకి వచ్చే వరకు బాగా వేయించాలి.
ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ను దానిలో వేయాలి. పాన్‌పై మూత వేసి.. కొన్ని నిమిషాలు దానిని ఉడకనివ్వాలి. ఇప్పుడు దానిలో టమోటాలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం పెరుగు, కొత్తిమీర ఆకులు వేయాలి. అన్నింటిని బాగా కలిపి కొంత సేపు ఉడికించాలి. అనంతరం చికెన్‌ను బాగా కలిపి.. దానిపై నానబెట్టిన బియ్యాన్ని వేసి.. రోస్ట్ చేసిన ఉల్లిపాయలు, జీడిపప్పులు వేసి మూతపెట్టి.. మంటను తగ్గించి.. మరో పావుగంట ఉడికించాలి.
స్టవ్ ఆపేసి.. కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేస్తే వేడి వేడి చెట్టినాడ్ చికెన్ బిర్యానీ రెడీ. దీనిని మీరు గ్రేవీ కర్రీ, రైతాతో కలిపి హాయిగా లాగించేయవచ్చు. ఇవేమి లేకున్నా కూడా బిర్యానీ మీకు మంచి టేస్ట్‌ని ఇస్తుంది. జ్యూసీ నిమ్మకాయలతో.. ఘాటైన ఉల్లిపాయతో మీ ప్లేట్ సిద్ధం చేసుకుని.. బిర్యానీ వేసుకుంటే చాలు. మీ ప్రతి ఈవెంట్ స్పెషల్‌గా మారిపోతుంది.
Also Read : ఇన్స్టాంట్ ఇడ్లీ రెసిపీ.. మరమరాల(బొరుగులు)తో ఈజీగా చేసేయొచ్చు