Chocolate Day 2022: హ్యాపీ చాకోలెట్ డే, మరింత తీయగా ప్రేమ పండుగ
వాలెంటైన్స్ వీక్‌లో మూడో రోజు ఇది. ఈ రోజును చాకోలెట్ డే గా నిర్వహించుకుంటారు ప్రేమికులు.
ప్రేమ పండుగ ఒక్క రోజు కాదు వారం రోజుల పాటూ సాగుతోంది. వాలెంటైన్స్ వీక్‌గా పిలుచుకునే ఈ వారంలో మూడో రోజుకు చేరుకుంది ప్రేమ వేడుక. ఈ రోజును ‘చాకోలెట్ డే’గా పిలుచుకుంటారు. తమ ప్రేమలో చాకోలెట్లో నింపి ప్రేయసి లేదా ప్రియునికి కానుకగా ఇచ్చేరోజు ఇది. ప్రేమ పండుగను మరింత తీయగా మార్చేస్తుంది చాకోలెట్. ఇందుకోసం ఎన్నో సంస్థలు ప్రత్యేకంగా వాలెంటైన్స్ చాకోలెట్లను కూడా తయారుచేస్తున్నాయి. ఈ వేడుక కోసం లవ్ సింబల్ ఆకారంలో చాకోలెట్లను అమ్ముతున్నారు. అవి ఈరోజు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. ప్రేమికుల పండుగలో చాకోలెట్లే ప్రధాన విందు. 18వ శతాబ్ధంలో అమెరికాలో ప్రేమికులు ఒకరికొకరు ఇచ్చుకునే బహుమతులలో ఇవే ప్రధానమైనవి. అక్కడ్నించే ఇతర దేశాలకు ఈ సంప్రదాయం పాకింది. ఇది మీ భాగస్వామిపై అంతులేని ప్రేమకు చిహ్నం. అందుకే వాలెంటైన్స్ డే కు చాకోలెట్ల అమ్మకాలు భారీగా పెరుగుతాయి.
కొన్ని తీయని కొటేషన్లు...
1. నువ్వు అడుగుపెట్టాక నా జీవితం చాకోలెట్‌లా తీయగా మారిపోయింది... హ్యాపీ చాక్లెట్ డే.
2. ఈ చాకోలెట్‌లా నీకిస్తూ నేను చెప్పొద్దొక్కటే, నీ సంతోషంలో, బాధలో నీకు తోడుగా ఉంటాను. అంతేకాదు నీకు ఎల్లప్పుడు చాకోలెట్‌ను తీసుకువస్తాను.
3. మీకు చాకొలెట్ డే శుభాకాంక్షలు, ఈ చాకోలెట్లు తియ్యగా, అందంగా ఉంటాయి, కానీ మీరు వాటికంటే చాలా స్వీట్.
4. మీ స్వీట్‌నెస్ ముందు ఏది సరిపోదు, ఈ చాకోలెట్లు కూడా. మీకు చాకోలెట్ డే శుభాకాంక్షలు.
5. ఈ చాకోలెట్లు ఆనందాన్ని కలిగించినట్లే, మీరు నా జీవితంలో సంతోషాన్ని తెచ్చారు. మీకు చాకోలెట్ డే శుభాకాంక్షలు.
6. చాకోలెట్లు మనసులోని ప్రేమను సంపూర్ణంగా సూచిస్తాయి. మీలాగే ఇవి తీయనైనవి, మృదువైనవి, పరిపూర్ణమైనవి. హ్యాపీ చాకోలెట్ డే.
7. మీరు ఎల్లప్పుడూ ఆ చాకోలెట్లలాగే స్వీట్‌గా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. మీకు చాకోలెట్ డే శుభాకాంక్షలు.
View this post on Instagram
Also Read: హ్యాపీ ప్రపోజ్ డే, ఇలా ప్రపోజ్ చేసి మనసు దోచేయండి
Also Read: ఏ రంగు గులాబీ ఏం సూచిస్తుంది? వైట్ రోజ్‌తో ప్రపోజ్ చేయొచ్చా?