అన్వేషించండి

New Deadly Virus : అలెర్ట్ - చైనా శాస్త్రవేత్తలు క్రియేట్ చేసిన మరో వైరస్.. ఇది మూడురోజుల్లోనే మనుషులను చంపేస్తుందట

Ebola Virus China : చైనా నుంచి వైరస్​లు రావడం కొత్తేమి కాదు. ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్​ కూడా అక్కడి నుంచే వచ్చింది. ఇప్పుడు తాజాగా మూడు రోజుల్లో మనిషిని చంపేసే వైరస్​ను తయారు చేశారు. 

Deadly Virus Created by Chinese Scientists : వైరస్ సోకితే కొన్ని సమస్యలు ఇబ్బంది పెడుతాయి కానీ.. చైనాలోని శాస్త్రవేత్తలు క్రియేట్ చేసిన వైరస్​ సోకితే మూడు రోజుల్లో మనిషిని చనిపోతాడు. ఓ వ్యాధి, దానికి సంబంధించిన లక్షణాలను అధ్యయనం చేయాలనుకున్నారు. దాని పరిశోధనలో భాగంగా వారు ఓ ప్రాణాంతక వైరస్​ను సృష్టించారు. ఇంతకీ వారు ఏ వ్యాధిపై అధ్యయనం చేయాలనుకున్నారు. ఏ వైరస్​ను ఇంజెక్ట్ చేశారు. దానివల్ల కలిగే ప్రమాదం ఏమిటి? మరో ముప్పు రానుందా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇంజెక్ట్ చేసిన మూడు రోజుల్లోనే..

చైనాలోని హెబీ మెడికల్ యూనివర్శిటిలో శాస్త్రవేత్తలు ప్రాణాంతకమైన ఎబోలా(Ebola) వ్యాధిపై అధ్యయనం చేయడానికి ఓ వైరస్​ను రూపొందించారు. ఈ ప్రయోగానికి సంబంధించిన అధ్యయానం గురించి సైన్స్ డైరక్ట్​లో ప్రచురించారు. ఎబోలా, దాని లక్షణాలపై అధ్యయనం చేసేందుకు.. ఎబోలా సోకిన ఎలుకలకు ప్రాణాంతకమైన వైరస్​ను ఇంజెక్ట్ చేశారు. ఇలా ఇంజెక్ట్ చేసిన మూడు రోజుల్లోనే ఎలుకలు చనిపోయాయని పరిశోధకులు అధ్యయనంలో గుర్తించారు. తీవ్రమైన అవయవాల వైఫల్యంతో ఈ ఎలుకలు చనిపోయాయని వారు తెలిపారు. మానవుల్లోని ఎబోలా మాదిరి వ్యాధులు ఎలుకల్లో అభివృద్ధి అయ్యాయని షాకింగ్ విషయాలు తెలిపారు. 

ఎబోలాపై అధ్యయనంలో భాగంగా..

ప్రాణాంతకమైన ఎబోలా వైరస్​పై సింథటిక్ వైరస్​ని ఉపయోగించి.. వ్యాధికారక క్రిములను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ట్రై చేశారు. అది కాస్త రివర్స్ కొట్టింది. ఈ వైరస్​ క్రియేషన్​ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఎబోలా మనుషులపై చూపించే ప్రభావాలను.. దీనిలో పరిశోధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికోసం వెసిక్యులర్ స్టోమాటిటిస్ వైరస్​ (VSV)ను ఎబోలా సోకిన ఎలుకలపై ఉపయోగించారు. ఈ వైరస్​ నుంచి గ్లైకో ప్రోటీన్​ (GP)ని తీసుకున్నారు. వైరస్​ ఎలుకలో ప్రవేశించడానికి, సోకడానికి ఈ ప్రోటీన్ కీలకమైనదిగా గుర్తించారు. ఇందుకోసం.. ఐదు ఆడ, ఐదు మగ ఎలుకలపై ప్రయోగించారు. 

తీవ్రమైన ప్రతికూల లక్షణాలతో..

వైరస్ ఇంజెక్ట్ చేసిన తర్వాత ఎలుకలు మానవుల్లోని ఎబోలా రోగుల మాదిరిగానే తీవ్రమైన లక్షణాలను అభివృద్ధి చేశాయి. వ్యాధులతో పాటు.. తీవ్రమైన ప్రతికూల లక్షణాలు కనిపించాయి. అంతేకాకుండా మూడు రోజులలో అవి మరణించాయి. కొన్ని ఎలుకల కళ్లలో నుంచి స్రావాలు కూడా వచ్చాయని.. కంటి చూపును కోల్పోయాయని అధ్యయనంలో పేర్కొన్నారు. అవి మరణించిన తర్వాత వైరస్ ప్రభావాన్ని విశ్లేషించేందుకు పరిశోధకులు వాటి అవయవాలను సేకరించారు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి ముఖ్యమైన అవయవాలను తీసుకున్నారు. 

మనుషులపై కూడా ఇదే ఇంపాక్ట్ ఉంటుంది..

పరిశోధకులు సేకరించిన అన్ని అవయవాల కణాజాలాలలో వైరస్​ పేరుకుపోయినట్లు గుర్తించారు. ఇది మానవుల్లో కూడా ఇదే తరహా లక్షణాలు చూపిస్తుందని గుర్తించారు. తీవ్రమైన లక్షణాలతో అవయవాలు డ్యామేజ్ అవతాయని నిర్థారించారు. బయోసేఫ్టీ లెవల్ 4 అవసరం లేకుండా ఎబోలా లక్షణాలు ప్రతిబింబించే నమూనా కోసం ఈ అధ్యయనం చేశారు. ఇలాంటి పరిశోధనకు అత్యంత సురక్షితమైన ల్యాబ్​లు అవసరమని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

అప్రమత్తంగా లేకుంటే మరో మహమ్మారి తప్పదు

ఈ స్టడీ ఎబోలాకు వ్యతిరేకంగా వైద్యపరమైన ప్రతికూలతలను వేగవంతం చేసేందుకు వీలవుతుంది. టీకాలు, చికిత్సలను అభివృద్ధి చేయడంలో హెల్ప్ చేస్తుంది. అయితే ముఖ్యమైన భద్రతా సమస్యలపై కూడా ప్రభావం చూపిస్తుంది. నియంత్రిత వాతావరణంలో ఈ తరహా ప్రాణాంతక వైరస్​ ప్రమాదవశాత్తు విడుదలైనా, దుర్వినియోగం చేసిన ఘోరమైన ప్రమాదాలను కలిగిస్తుంది. ప్రయోగశాలలో సరైన భద్రత తీసుకోకపోవడం వల్లనే కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. కాబట్టి ఈ తరహా పరిశోధనల విషయంలో మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. 

Also Read : మగవారికంటే ఆడవారే యూరిన్​ను ఎక్కువగా కంట్రోల్ చేసుకుంటారట.. సమస్య పెరగడానికి ఇదే ప్రధాన కారణం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Secunderabad: మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
Andhra News in Telugu  : విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ 
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ 
Jeevan Reddy: తిరుగుబాటు జెండా ఎగరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి కాల్
తిరుగుబాటు జెండా ఎగరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి కాల్
Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా- మూజువాణి ఓటుతో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ 
లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా- మూజువాణి ఓటుతో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SA vs Afg Semifinal 1 Preview | T20 World Cup 2024 లో మొదటి యుద్ధం గెలిచేదెవరోAfghanistan T20 World Cup 2024 Semis | Home Ground కూడా లేని ఆఫ్గాన్ కు BCCI అండ | ABP DesamBrian Lara Only Guy Who Predict Afghanistan Semis | T20 World Cup 2024 Semis ముందే ఊహించిన లారా |ABPAfghanistan Performance in T20 World Cup 2024 | ఈ వరల్డ్ కప్ లో ఆఫ్గాన్ ఆట చూస్తే గూస్ బంప్స్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Secunderabad: మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
Andhra News in Telugu  : విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ 
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ 
Jeevan Reddy: తిరుగుబాటు జెండా ఎగరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి కాల్
తిరుగుబాటు జెండా ఎగరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి కాల్
Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా- మూజువాణి ఓటుతో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ 
లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా- మూజువాణి ఓటుతో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ 
Lok Sabha Speaker Om Birla: మరో ఐదేళ్లు ఓం బిర్లా మార్గనిర్దేశం అవసరం: ప్రధాని
మరో ఐదేళ్లు ఓం బిర్లా మార్గనిర్దేశం అవసరం: ప్రధాని
Tadipatri: తాడిపత్రిలో తగ్గిన పొలిటికల్ హీట్- తొలిసారి ఇవాళ నియోజకవర్గానికి రానున్న ఎమ్మెల్యే
తాడిపత్రిలో తగ్గిన పొలిటికల్ హీట్- తొలిసారి ఇవాళ నియోజకవర్గానికి రానున్న ఎమ్మెల్యే
Inter First Year Supplementary Results: నేడే ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయం ఇదే
నేడే ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయం ఇదే
Agricultural Loan: రైతులకు పావలా వడ్డీకే రుణం - లక్షల రూపాయలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం
రైతులకు పావలా వడ్డీకే రుణం - లక్షల రూపాయలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం
Embed widget