ఆ పిచ్చిగీతలే ‘దారి’ చూపాయ్.. 4 ఏళ్ల వయస్సులో కిడ్నాప్.. 33 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన కొడుకు
అతడు గీసిన బొమ్మలు చూసి.. అంతా పిచ్చి గీతలు అని అనుకున్నారు. కానీ, అవే.. అతడు 33 ఏళ్ల కిందట దూరమైన తల్లిని మళ్లీ కలిసేందుకు దారి చూపాయి.
ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిని పక్కింటి వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత మరొకరికి అమ్మేశాడు. కొడుకు కోసం తల్లిదండ్రులు వెతకని ప్రాంతమంటూ లేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ, ఆచూకీ లభించలేదు. కడుపు కోతతో ఆ తల్లి ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఆవిరైపోయాయి. అయితే, 33 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ తల్లి కళ్లల్లో కన్నీళ్లు కనిపించాయి. ఈసారి బాధతో వచ్చిన కన్నీళ్లు కావవి. కొడుకును చూసిన సంతోషంలో వచ్చిన ఆనంద భాష్పాలు. నాలుగేళ్ల వయస్సులో తప్పిపోయిన అతడు.. ఇన్నాళ్లకు ఎలా తిరిగి వచ్చాడు? అమ్మను వెతికేందుకు అతడు ఏం చేశాడో తెలిస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు. చైనాలో చోటుచేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అతడి పేరు లీ జింగ్వై.. చిన్నప్పటి నుంచి అతడు పేపరు కనిపిస్తే చాలు.. ఏవేవో బొమ్మలు గీసేవాడు. వాటిని చూసి అంతా పిచ్చి గీతలని భావించేవారు. అది మా ఊరు అని చెప్పినా.. ఎవరూ పట్టించుకొనేవారు కాదు. కానీ, అతడి ప్రయత్నం ఆపలేదు. చివరికి ఆ పిచ్చి గీతలే.. అతడి తల్లిని మళ్లీ దగ్గర చేసేందుకు ఉపయోగపడ్డాయి. ఎందుకంటే.. అతడు ఇన్నాళ్లుగా గీస్తున్న ఆ చిత్రాలు పిచ్చి గీతలు కాదు. చిన్నప్పుడు అతడు నివసించిన గ్రామం ‘మ్యాప్’.
Also Read: దేశీయులు మహా రసికులు.. ఒక్కొక్కరూ 14 మందితో సెక్స్.. మనోళ్లు వెనుకబడ్డారే!
1989లో నాలుగేళ్ల వయస్సులో కిడ్నాపైన లీ జింగ్వైను పిల్లలు లేని ఓ జంట కొనుగోలు చేసింది. అయితే, అతడు అపహరణకు గురైన బాలుడని వారికి తెలీదు. అమ్మిన వ్యక్తే అతడి తండ్రని భావించారు. ఆ తర్వాత లీ.. అతడు తన తండ్రి కాదని చెప్పినా అతడిని తిరిగి పంపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అతడిని బాగా చదించి పెళ్లి కూడా చేశారు. కానీ.. లీ మనసు ఎప్పుడూ తన తల్లి గురించే ఆలోచించేది. లీ తన DNA ద్వారా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నించాడు. కానీ, ఇందుకు అతడిని దత్తత తీసుకున్న తల్లిందండ్రులు, డీఎన్ఏ సర్వీస్ సెంటర్లు అంగీకరించలేదు. దీంతో లీ పోలీసులను ఆశ్రయించాడు. అతడు గీసిన ఓ మ్యాప్ ఆధారంగా ఆ ఊరు పేరును కనుగోడానికి ప్రయత్నించాడు. పోలీసులు కూడా అవి పిచ్చిగీతలని భావించారు.
ఆచూకీ చెప్పిన సోషల్ మీడియా: దాదాపు అన్ని దారులు మూసుకుపోవడంతో.. లీ సోషల్ మీడియాను ఆశ్రయించాడు. అది తాను చిన్నప్పుడు నివసించిన ప్రాంతమని, తనకు ఇప్పటికీ గుర్తుందంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ మ్యాప్‌లో అతడు పేర్కొన్న ఓ భవనం కేవలం చైనాలోని యున్నాన్ ప్రావీన్స్‌లోని జావోటాంగ్‌లో మాత్రమే ఉందని కొంతమంది నెటిజనులు అతడికి చెప్పాడు. దీంతో లీ మరోసారి పోలీసులను ఆశ్రయించాడు. నెటిజనులు చెప్పిన ఆ ప్రాంతం మ్యాప్‌తో తన స్కెచ్‌ను పోల్చాలని చెప్పాడు. ఆశ్చర్యంతో.. అతడు తన స్కెచ్‌లో పేర్కొన్న కొన్ని ప్రాంతాలు.. దారులు ఆ మ్యాప్‌తో మ్యాచ్ అయ్యాయి. అయితే, ఆ ప్రాంతం గ్రామం లీ ఉంటున్న హెనన్ నగరానికి సుమారు 1000 కిమీల దూరంలో ఉంది. దీంతో పోలీసులు అక్కడి పోలీసులను సంప్రదించి లీ తల్లిదండ్రుల వివరాలను తెలుసుకోడానికి ప్రయత్నించారు.
తండ్రి మరణం.. ఊరు వదిలి వెళ్లిపోయిన తల్లి: బ్యాడ్ లక్.. లీ కిడ్నాప్ అయిన కొద్ది రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు. దీంతో అతడి తల్లి ఆ గ్రామంలో ఉండలేక మరో నగరానికి వెళ్లిపోయింది. అయితే.. ఆమె ఉంటున్న ప్రాంతం లీ నివసిస్తున్న నగరానికి కేవలం 60 మైళ్లు మాత్రమే. ఈ విషయం తెలుసుకుని లీ అక్కడికి వెళ్లాడు. తల్లి ఆచూకీ కనుగొన్నాడు. డీఎన్ఏ పరీక్షలు చేసిన అధికారులు అతడు ఆమె కొడుకేనని నిర్ధరించారు. దీంతో లీ ఆనందానికి అవధుల్లేవు. 33 ఏళ్ల తర్వాత అతడిని చూసి తల్లి.. తన గుండెలు అవిసేలా ఏడ్చింది. ఇక లేడు.. రాలేడు అనుకున్న కొడుకు కళ్ల ముందు నిలుచుంటే.. ఇది కల కాకూడదు దేవుడా అని మొక్కుకుంది. ఊహ తెలియని వయస్సులోనే అతడు తన ఊరు గురించి తెలుసుకోవడం. వయస్సు పెరుగుతున్నా.. తన బాల్యాన్ని అలాగే గుర్తుపెట్టుకొని.. దాన్ని బొమ్మల రూపంలో చెప్పడం నిజంగా గ్రేట్ కదూ.
Note: ఇది ‘ఏబీపీ దేశం’ ఒరిజినల్ కంటెంట్. కాపీరైట్స్ కింద చర్యలు తీసుకోబడతాయి.
Also Read: యాసిడ్ దాడి చేసిన వ్యక్తినే ప్రేమించి పెళ్లాడిన యువతి, చివరికి ఊహించని ట్విస్ట్...
Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్
Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!
Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)
Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి