అన్వేషించండి

World Oceans Day: సముద్రాలు లేకపోతే మనుషులు బతకగలరా? అవి లేని ప్రపంచం ఎలా ఉంటుంది?

సముద్రాల ప్రాధాన్యత చెప్పేందుకే మహాసముద్రాల దినోత్సం.

ఒకప్పుడు అన్నీ సముద్ర ప్రయాణాలే. విమానాలు వచ్చాక నీటిపై ప్రయాణాలు చాలా వరకు తగ్గిపోయాయి. కేవలం సరుకులే రవాణా అవుతున్నాయి. అంతెందుకు విదేశీయులు మన గడ్డను చేరుకుంది కూడా సముద్రమార్గంలోనే. మనం భూమిపై ఎంత ఆధారపడి ఉన్నామో, పరోక్షంగా సముద్రాలపై కూడా అంతే ఆధారపడి జీవిస్తున్నాం. పర్యావరణ సమతుల్యానికి, మనిషి జీవించే వాతావరణం ఉండేందుకు సముద్రాలు ఎంతో సహకరిస్తున్నాయి. సముద్రాలే లేకుంటే మనిషి బతకడం కష్టతరంగా మారుతుంది. వాతావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుంది. 

ఎలా ప్రభావితం చేస్తుంది?
భూ వాతావరణాన్ని మార్చేది సముద్రాలే. భూమి పై వాతావరణ మార్పులపై సముద్రాలు చాలా ప్రభావం చూపిస్తాయి. అన్నింటి కన్నా ముఖ్యంగా వర్షాలు, రుతు పవనాలు రాక సముద్రాల వల్లే వీలవుతుంది. రుతుపవనాలే రాకపోతే భూమి పరిస్థితి, భూమిపై నివసించే మనుషులు ఏమవుతారో ఓసారి ఊహించుకోండి.  తుఫానులు, గాలులకు సముద్రాలే ముఖ్యం. భూమిపై  ఉష్ణోగ్రతలను  పూర్తిగా నియంత్రించేది సముద్రమే. అలాగే కొన్ని విషపూరితమైన వాయువులను కూడా సముద్రం పీల్చుకుంటుంది. దీని వల్ల మనుషులపై ఎలాంటి ప్రభావం ఉండదు. సముద్రాలు లేని భూమిపై మనిషి ఎంతో కాలం జీవించ లేడు. కరవు కాటకాలతో మానవజాతే అంతరించిపోతుంది. 

ఆర్దికంగానూ...
సముద్రంలో ఉండే మత్స్య సంపద గురించి ఎంత  చెప్పినా తక్కువే. కోట్ల మంది సముద్రంలోని జీవులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వాటిని అమ్ముకోవడం ద్వారా వ్యాపారం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. సముద్రాలు కోట్లాది మందికి ఆహార భద్రతలను, ఉపాధిని కల్పిస్తున్నాయి. 2030 నాటికి సముద్ర ఆధారిత పరిశ్రమల ద్వారా 40 మిలియన్ల మంది ఉపాధి పొందుతారని అంచనా. సముద్ర గర్భంలో నూనె, సహజ వాయువు, విలువైన ఖనిజాలు లభిస్తాయి. వాటిని కూడా వెలికి తీస్తున్నారు. 

సగం ఆక్సిజన్
భూమికి, భూమిపై జీవించే మనుషులకు కావాల్సిన ఆక్సిజన్లో సగం ఆక్సిజన్ ను అందించేది సముద్రాలే. భూమిపై జీవావరణ పరిస్థితులు కల్పించడంలో ప్రధాన పాత్రను ఇవే పోషిస్తున్నాయి. కానీ వీటినే కలుషితం చేసి సముద్ర జీవుల మరణానికి కారణం అవుతున్నాడు మనిషి. దీని వల్ల జీవావరణ సమతుల్యత, జీవ వైవిధ్యం లోపిస్తుంది. ఇది తిరిగి మనిషిపైనే ప్రభావం చూపిస్తుంది. అందుకే సముద్రాల ప్రాధాన్యతను మనుషులకు చెప్పేందుకు ప్రతి ఏడాది జూన్ 8న ‘మహా సముద్రాల దినోత్సవం’ నిర్వహించుకుంటున్నాం.  

ప్రపంచంలోనే  అతి లోతైన ప్రదేశం మెరియానా ట్రెంచ్. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. దీని లోతు 35, 838 అడుగులు. 1960లో మనుషులు ఈ ప్రదేశానికి వెళ్లి వచ్చారు. 

Also read: టైప్ 1 డయాబెటిస్ ఉందా? అయితే ఈ మార్గదర్శకాలు మీకే

టాప్ హెడ్ లైన్స్

Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
Fenugreek Water 21 Days : 21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget