Catch Covid: ఇదేం పిచ్చో.. కరోనా కావాలంటూ అపరిచితులకు హగ్గులిస్తూ వధువు హల్‌చల్, చివరికి..
ఈ వధువుకు కరోనా కావాలట.. ఎంగిలి గ్లాసుల్లో మందుకొడుతూ.. అపరిచితులకు హగ్గులిస్తూ హల్‌చల్!
కరోనా వల్ల ఎలాంటి అవాంతరాలు లేకుండా పెళ్లి జరిగిపోవాలని అంతా కోరుకుంటారు. వైరస్ సోకకుండా అప్రమత్తంగా ఉంటారు. వధువరుల్లో ఏ ఒక్కరికి కోవిడ్-19 సోకినా.. ఆ పెళ్లి ఆగిపోతుంది. అయితే, ఈ వధువుకు ఏమైందో ఏమో.. మరికొద్ది రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. తనకు కరోనాను అంటించుకోడానికి ప్రయత్నించింది. మాస్క్ పెట్టుకోకపోవడమే కాకుండా.. పబ్బులో అపరిచితులకు హగ్గులిస్తూ హల్‌చల్ చేసింది. చివరికి.. ఇతరులు ఎంగిలిచేసిన గ్లాసుల్లోని మద్యానికి తాగింది. ఈ ఘనకార్యాన్ని వీడియో కూడా తీసుకుంది.
ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. మ్యాడీ స్మార్ట్ అనే యువతి ఇటీవల ‘టిక్‌టాక్’లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ‘‘మనసులోని భావాలను కాదు.. కోవిడ్‌ను పంచుకోండి’’ అని అందులో పేర్కొంది. కోవిడ్‌ను అంటించుకోవడం కోసం ఆమె మెల్‌బోర్న్‌లోని ఓ క్లబ్‌కు వెళ్లింది. అక్కడ మద్యం తాగుతూ చిందులేస్తున్న అబ్బాయిలను హగ్ చేసుకుంది. అంతేగాక.. గ్లాసులను సైతం మార్చుకుంటూ.. వారి ఎంగిలి చేసిన మద్యాన్ని తాగింది.
‘‘మరో ఆరు వారాల్లో పెళ్లి ఉంది. నీకు ఇంకా కోవిడ్ రాలేదా’’ అంటూ ఆ వీడియోకు మరో క్యాప్షన్ పెట్టింది. టిక్‌టాక్‌లో ఈ వీడియోను ఒకే రోజు 1.2 లక్షల మందికి పైగా వీక్షించారు. ఆమె చేసిన పనికి అంతా తిట్టిపోస్తున్నారు. ‘‘నీకు కోవిడ్ వచ్చినా పర్వాలేదు. కానీ, నీ పెళ్లికి వచ్చే అతిథులు, బంధువులు ఏ పాపం చేశారు? నీలాంటివారి పెళ్లికి వెళ్లి వారు బలికావాలా?’’ అని ప్రశ్నిస్తున్నారు. ‘‘నీకు.. పిచ్చా? వెర్రా? పెళ్లి దగ్గర పెట్టుకుని ఇలా కరోనా కోసం కక్కుర్తి పడతావా అని మరికొందరు అంటున్నారు. ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇంకొందరు అంటున్నారు. ఈ వీడియో చూసి మీ అభిప్రాయం కూడా చెప్పండి.
Is this bride to be in Australia 🇦🇺 is she smart or stupid trying to get Covid before her wedding date pic.twitter.com/JfE2hHm4Ti
— 13 Heroes 🇺🇸lets go Brandon 🇺🇸Text Trump 22088 (@13Heroes) January 11, 2022
Also Read: ఈ చేప భలే డ్రైవింగ్ చేస్తోంది.. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసు పెట్టరు కదా?
Also Read: తత్కాల్‌లో రైల్వే టికెట్స్ వేగంగా బుక్ చేయాలా? ఇదిగో ఇలా చేయండి
Also Read: షాకింగ్ వీడియో: విహారంలో విషాదం.. పర్వతం విరిగి బోటుపై పడింది
Also Read: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి