(Source: ECI/ABP News/ABP Majha)
Fish Driving: ఈ చేప భలే డ్రైవింగ్ చేస్తోంది.. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసు పెట్టరు కదా?
చేప డ్రైవింగ్ చేయడాన్ని ఎప్పుడైనా చూశారా? అయితే, మీరు తప్పకుండా ఈ వీడియోను చూడాల్సిందే.
చేప ఏంటీ.. డ్రైవింగ్ చేయడమేంటీ? తాగి మాట్లాడుతున్నావా? అని తిట్టకండి. అది నిజంగానే చేప డ్రైవింగ్ చేస్తోంది. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే.. మీరు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్న ఆ వీడియోను ఇంకా చూసి ఉండరు. లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉన్నప్పుడు వచ్చిన ఆలోచనో.. లేదా తెల్లవారుజామున వచ్చిన కలో తెలీదుగానీ.. ఓ పరిశోధకుడి బుర్రలో చేపకు డ్రైవింగ్ నేర్పించాలనే బుద్ధి పుట్టింది. దాని ఫలితమే ఇది. అయితే, అతడి ఆవిష్కరణను ఏ మాత్రం తక్కువ చేయకూడదు. నిజంగా ఇదో అద్భుతం.
ఇజ్రాయెల్(Israel)లోని నెగేవ్(Negev) బెన్-గురియన్ విశ్వవిద్యాలయం(Ben-Gurion University) పరిశోధకులు జరిపిన ప్రయోగం ఇది. వాస్తవానికి.. ఈ ప్రయోగం చేపకు డ్రైవింగ్ నేర్పించాలనే ఉద్దేశంతో చేయలేదు. నీటి అడుగున చేపల గమనాన్ని(navigation) అంచనా వేసే స్కిల్స్‌ను తెలుసుకోడానికి ఈ ప్రయత్నం చేశారు. ఇందుకు వారు తయారు చేసిన బుల్లి వాహనాన్ని చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు.
చేపల నావిగేషన్ స్కిల్స్‌ను తెలుసుకోవాలంటే అంత సులభం కాదు. అవి నీటి బయట ఊపిరి పీల్చుకోలేవు. అందుకే.. దాని కోసం ప్రత్యేకంగా ఈ వాహనం తయారు చేశారు. నాలుగు చక్రాల మోటారు వాహనంపై నీటి తొట్టెను ఏర్పాటు చేశారు. అందులో చేప కదలికలను బట్టి.. వాహనం కూడా కదిలేలా లైట్ డిటెక్షన్ టెక్నాలజీని ఉపయోగించారు. దీనివల్ల అందులో డ్రైవింగ్ చేసే చేప ఎటు కదిలితే అటువైపుకు వాహనం వెళ్తుంది. బయోమెడికల్ ఇంజినీర్లు, న్యూరో సైంటిస్టులు దీని తయారీ కోసం కొన్ని నెలలు శ్రమించారు.
మొదట్లో ఈ చేప ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తరహాలో ఆ వాహనాన్ని నడిపింది. దీంతో శాస్త్రవేత్తలు.. దానికి ప్రత్యేకంగా డ్రైవింగ్ శిక్షణ ఇచ్చారు. ఆ చేప కచ్చితంగా డ్రైవ్ చేసేందుకు దానికి పింక్ కలర్ క్లాత్‌పై ఆహారాన్ని పెట్టారు. దీంతో ఆ చేప దాన్ని అందుకోడానికి అటువైపు కదిలితే.. వాహనం కూడా అటుగా వెళ్లేది. దానికి పూర్తిగా డ్రైవింగ్ వచ్చిన తర్వాత మూడు రకాల టాస్కులు ఇచ్చారు. ఆ మూడు టాస్కుల్లో ఆ చేప విజయం సాధించింది. మరి, ఆర్టీవో అధికారులు దీనికి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారో.. లేదా నీళ్లు తాగుతూ సరిగా డ్రైవింగ్ చేయడం లేదని ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసు పెడతారో చూడాలి.
Also Read: 70 రోజులు.. స్నేహితుల శవాలను తిని ఆకలి తీర్చుకున్న రగ్బీ టీమ్
చేప వాహనాన్ని నడుపుతున్న వీడియోను ఇక్కడ చూడండి:
Hey @TheEllenShow, we wanted to say that BGU can help Dory. Our interdisciplinary researchers' team (@OhadBenShahar, @ronen_segev) discovered that a goldfish's navigational ability supersedes its watery environs, even if they were interrupted in the middle. See it in the video. pic.twitter.com/knEPrEWeov
— Ben-Gurion University of the Negev (@bengurionu) January 5, 2022
Also Read: ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి