Blue Christamas 2024: బ్లూ క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు- విశిష్టత, సెలబ్రేట్ చేసుకునే విధానం ఇదీ
Blue Christamas History: క్రైస్తవులు బ్లూ క్రిస్మస్ ను లాంగెస్ట్ నైట్ అని కూడా పిలుస్తారు. కొన్ని చర్చిలు ప్రియమైన వారిని కోల్పోయిన, దుఃఖాన్ని అనుభవిస్తున్న వారిని గౌరవించే చర్చి సేవను నిర్వహిస్తాయి.

Blue Christamas 2024 : ఇప్పుడు ప్రపంచమంతా క్రిస్మస్ సీజన్ నడుస్తోంది. ఈ పండుగ ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. మరి బ్లూ క్రిస్మస్ గురించి ఎప్పుడైనా విన్నారా. ఇంతకీ ఏంటీ ఈ బ్లూ క్రిస్మస్(Blue Christamas 2024). ఇది వినేందుకు కొత్తగా అనిపిస్తున్నా.. నిజానికి ఇది చాలా కాలం నుంచి వస్తోన్న సంప్రదాయం. బాధలో ఉన్న వారిని అక్కున చేర్చుకునే సంప్రదాయం. దీన్ని సాధారణంగా సంవత్సరంలో అత్యంత ఎక్కువ సేపు రాత్రి ఉండే రోజున జరుగుపుకుంటారు. అంటే డిసెంబర్ 21న అన్నమాట. దీన్నే శీతాకాలపు అయనాంతం అంటారు. దీనిని లాంగెస్ట్ నైట్ అని కూడా పిలుస్తారు. హాలిడే సీజన్‌లో దుఃఖంలో ఉన్నవారిని, ఆనందం. ఆశను కనుగొనడంలో ఇబ్బంది పడుతున్న కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను ఓదార్చడం దీని లక్ష్యం.
బ్లూ క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు?
సంప్రదాయ సమావేశాలకు ప్రత్యామ్నాయంగా ఉన్న బ్లూ క్రిస్మస్ సర్వీస్ ఇప్పటిది కాదు. ఇది 1990 నాటిది. ఇది దుఃఖంలో, నష్టంతో బాధలో ఉన్న వారికి నివాళినిచ్చే రోజు. ఈ రోజును కొందరు "బ్లూ క్రిస్మస్" అని పిలుస్తారు. మరికొందరు దీనిని "ది లాంగెస్ట్ నైట్" అని పిలుస్తారు. ఇంకొందరు "సర్వీస్ ఆఫ్ రిమెంబరింగ్" అని పిలుస్తారు. ఇకపోతే బ్లూ క్రిస్మస్ రోజున వ్యక్తులు తమ దుఃఖాన్ని, భావోద్వేగాలను బహిరంగంగా గుర్తించడానికి ఒక వేదికను అందిస్తుంది. వారి భావాలను సహాయక వాతావరణంలో ప్రాసెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది దుఃఖంలో ఉన్నవారిలో కమ్యూనిటీ భావాన్ని పెంపొందిస్తుంది. ఇందులో పాల్గొనేవారికి వారి పోరాటాలలో వారు ఒంటరిగా లేరని గుర్తుచేస్తుంది.
బ్లూ క్రిస్మస్ ఎలా జరుపుకోవాలంటే..
- ఇది స్థానాన్ని బట్టి మారుతుంది. ఏది ఏమైనప్పటికీ, ఇది సాధారణంగా ఒంటరిగా, దిగులుగా ఉన్న వారికి సంతోషాన్ని, ఉల్లాసాన్ని ఇవ్వడం, అలా ఉండేలా ప్రార్థించడం, కొవ్వొత్తులను వెలిగించడం, వారి దుఃఖాన్ని పోగొట్టాలని కోరే సమయం.
- ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన వారితో సమయం గడపడం వారిలో ఉత్సాహాన్ని పెంచడానికి, వారి కోలుకోవడంలో సహాయపడటానికి ఉత్తమ మార్గం. ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన బాధను అధిగమించడంలో వారికి సహాయం చేయండి.
- ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన వారికి మీ సంతాపాన్ని, చట్ట అమలులో పని చేసే వారికి కృతజ్ఞతలు తెలియజేయండి. సాధారణంగా ఈ సెలవుదినంలో ఇంటి నుండి దూరంగా ఉన్న ఎవరికైనా మీ అభినందనలు తెలియజేయండి. మీ మద్దతును తెలియజేయడానికి, మీరు వారిని క్రిస్మస్ డిన్నర్‌కి కూడా ఆహ్వానించవచ్చు లేదా కొన్ని బ్లూ లైట్‌లను వేలాడదీయవచ్చు.
- ఈ సమయంలో ఫిజికల్. డిజిటల్ ప్రపంచంలోని వ్యక్తులను ప్రోత్సహించడానికి #BlueChristmas అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించండి. ఎవరైనా మీ మాటలు వింటుండవచ్చు. అందుకు సోషల్ మీడియా లేదా వ్యక్తిగత సంభాషణలు చేయండి.
మతపరమైన సమావేశాలు లేదా వ్యక్తిగత ఆచారాల ద్వారా అయినా, హాలిడే సీజన్ ఆనందం, దుఃఖం రెండింటినీ స్వీకరించడం సరైందేనని బ్లూ క్రిస్మస్ రిమైండర్‌గా పనిచేస్తుంది. ఈ సందర్భంగా, ఎదుటివారి భావాలను గౌరవిద్దాం, ఒకరికి మద్దతుగా నిలుద్దాం.
Also Read : Work Life Balance : పర్సనల్ లైఫ్‌ని వర్క్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారా? ఇలా ట్రై చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

