Blindness Prevention Week 2024 : ప్రపంచవ్యాప్తంగా ఆ సమస్యలో ఇండియానే టాప్.. దాని నిర్మూలన కోసమే ఏటా అవగాహన సదస్సులు
Blindness Causes : కంటిచూపు ఎంత ప్రభావమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవితంలోని ప్రతి దశలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అంశంపై అవగాహన కలిపిస్తూ ఏటా అంధత్వ నివారణ వారోత్సవాలు చేస్తున్నారు.
Blindness Prevention Week Theme : అందాన్ని ఆస్వాదించడం మొదలుకొని.. నచ్చినవారిని కంటి నిండుగా నింపుకోవడం వరకు కన్నులు కీలక పాత్ర పోషిస్తాయి. దాదాపు ఏ విషయాన్ని అయినా కంటితో చూసే నమ్ముతాము. కానీ.. ఆ దృష్టిని, కంటి ఆరోగ్యాన్ని తేలికగా తీసుకుంటాము. అన్ని రకాల పనులను చూడడం నుంచి.. దాని గురించి తెలుసుకోవడం వరకు కళ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. కానీ క్రెడిట్ అంతా ఇతర అంశాలకు వెళ్లిపోతుంది. వాటి వాల్యూ తెలియాలంటే కళ్లు లేని వారిని.. అంధత్వం కలిగిన వారిని ప్రశ్నిస్తే అర్థమవుతుంది. ఓ గంట కళ్లకు గంతలు కట్టి లోకాన్ని చూడమంటే మీకు సాధ్యమవుతుందా? ఇలాంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ఏటా అంధత్వం నివారణ వారోత్సవాలు చేస్తున్నారు.
ఏప్రిల్ మొదటి వారమంతా..
ప్రపంచవ్యాప్తంగా అంధత్వంతో బాధపడుతున్నవారు 37 మంది మిలయన్స్. వారిలో ఇండియన్స్ 10 మిలియన్లు. వారికి చూపును అందించే దిశగా.. అంధత్వంపై అవగాహన కల్పిస్తూ.. ఏటా అంధత్వ నివారణ వారోత్సవాలు జరుపుతున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 7వ తేదీవరకు కళ్ల ఆరోగ్యంపై, కళ్లు, నేత్రదానం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. వయసు సంబంధిత అంశాల నుంచి.. వివిధ ఆరోగ్య సమస్యలు, ప్రమాదాల్లో కంటి చూపు పోగొట్టుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ.. ఆరోగ్యపరంగా కళ్లను ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పిస్తారు. ఇవి కంటి జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయం చేస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇండియానే టాప్
కంటి గాయాలు, దృష్టి లోపాలు, సమర్థవంతమైన నివారణ చర్యలు, చికిత్సా పద్ధతులు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తాయి. కంటి పరిశుభ్రత, ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తూ.. ఉచిత కంటి చెకప్ కార్యక్రమాలు చేపడతారు. అంధత్వాన్ని నిర్మూలించడానికి ప్రపంచ బ్యాంక్ నుంచి సబ్సిడీ రుణాన్ని కోరిన మొదటి దేశం ఇండియా. భారత్‌లో కంటిచూపునకు అంతటి ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఎందుకంటే ప్రపంచం మొత్తంతో కలిపి చూస్తే.. దాదాపు సగం అంధులను ఇండియా కలిగి ఉంది. ఈ సమస్యను రూపుమాపాలని ప్రభుత్వాలు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాయి.
ఈ సంవత్సరం థీమ్ ఇదే..
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంధత్వ నివారణ కోసం.. ఏటా అంతర్జాతీయ ఏజెన్సీ, ఇతర ప్రభుత్వేతర సంస్థలతో కలిసి థీమ్ను నిర్ణయిస్తుంది. వాటిని ఆ వారోత్సవాల సమయంలో అమలు చేస్తారు. ఈ సంవత్సరం ప్రజలకు కంటి చూపు, ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు.. నేత్రదానం ప్రాముఖ్యతను వివరించనున్నారు.
అంధత్వానికి కారణాలు ఇవే..
అంధత్వానికి ముఖ్యమైన కారణాల్లో పోషకాహార లోపం ఒకటి. ట్రాకోమా, కంటిలో శుక్లం వంటి కూడా ప్రధాన కారణాలు అవుతున్నాయి. పిల్లల్లో అంధత్వానికి కారణం విటమిన్ ఏ అవుతుంది. మధుమేహమున్నవారికి కంటిలో శుక్లం ఏర్పడి.. అంధత్వానికి అత్యంత బలమైన కారణంగా మారిపోయింది. దృష్టి లోపం ఉన్నవారిలో ఎక్కువమంది 50 ఏళ్లు పైబడిన వారే. అయితే చిన్ననాటి నుంచే.. కంటి ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తే.. ఈ అంధత్వ సమస్యలు దరిచేరవు అంటున్నారు నిపుణులు.
నేత్రదానం
లింగభేదం లేకుండా.. వ్యక్తి మరణానంతరం కళ్లను దానం చేస్తే.. ఈ అంధత్వ సమస్యను కంట్రోల్ చేయవచ్చు. స్వచ్ఛందంగా.. పూర్తిగా సమాజ ప్రయోజనాల కోసం.. ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలని ప్రభుత్వం ప్రోత్సాహిస్తుంది. కార్నియల్ బ్లైండ్నెస్తో బాధపడేవారికి మళ్లీ కంటిచూపును అందించడంలో ఇది హెల్ప్ చేస్తుంది. కంటికి సంబంధించిన ఇతర భాగాలు కంటి వ్యాధుల నివారణలను అభివృద్ధి చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయి. మీరు లేకపోయినా.. ఇతరుల రూపంలో కళ్లు బతికే ఉంటాయనే సంగతి అందరూ గుర్తించుకోవాలి.
Also Read : బరువు తగ్గడంలో హెల్ప్ చేసే వోట్మీల్ డ్రింక్.. రెండు నెలల్లో 20 కిలోలు తగ్గవచ్చట!