Bird Flu: మనుషులకు బర్డ్ ఫ్లూ సోకవచ్చని ఐరాస హెచ్చరికలు- వ్యాప్తిని ఎలా నిరోధించాలి?
పక్షులు, కోళ్ళకి వచ్చే బర్డ్ ఫ్లూ మనుషులకు సోకదని అనుకుంటారు. కానీ తాజాగా ఐక్యరాజ్యసమితి చేసిన హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కేసులు రోజురోజుకీ పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి. కోళ్ళకు వచ్చే వ్యాధి బర్డ్ ఫ్లూ. ఇప్పుడు ఇది మనుషులకు కూడా సులభంగా సోకే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరికలు జారీ చేసింది. ఈ వ్యాధి ప్రబలకుండా అరికట్టడం కోసం ఫౌల్ట్రీ ఫామ్స్ దగ్గర శుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ చాలా ఎక్కువ మరణాలు అంటువ్యాధుల కారణంగానే జరుగుతున్నాయని హెచ్చరిస్తున్నాయి.
ఏవియన్ ఫ్లూ లేదా బర్డ్ ఫ్లూ కొత్త భౌగోళిక ప్రాంతాలకు వ్యాపిస్తుంది. అడవి పక్షుల మరణానికి కారణమైంది. దీనికి సంబంధించిన కేసుల్లో భయంకరమైన పెరుగుదల ఆందోళన కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవులకు కూడ బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉందని జాగ్రత్త ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన లేదా చనిపోయిన ఫౌల్ట్రీ లేదా కలుషితమైన పరిసరాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బహిర్గతం కావడం వల్ల మనుషులకు సోకే అవకసాం ఉంది.
ఆందోళన కలిగిస్తున్న కేసులు
2022 గణాంకాల ప్రకారం ఐదు ఖండాల్లోని 67 దేశాలలో బర్డ్ ఫ్లూ వ్యాపించింది. 131 మిలియన్లకు పైగా దేశీయ ఫౌల్ట్రీలకు సోకింది. ఈ ఏడాది ప్రారంభంలో 14 దేశాలకు వ్యాప్తి చెందినట్లు నివేదికలు వెల్లడించాయి. ప్రధానంగా ఉత్తర అమెరికా ఇది వ్యాప్తి చెందుతూనే ఉంది.
బర్డ్ ఫ్లూ అంటే ఏంటి?
ఎన్ హెచ్ ఎస్ ప్రకారం ఏవియన్ ఫ్లూ, లేదా బర్డ్ ఫ్లూ పక్షులకు వచ్చే ఇన్ఫెక్షన్. అరుదైన సందర్భాల్లో మనుషుల్ని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇటీవలి సంవత్సరాలలో నాలుగు వేరియంట్స్ ఆందోళన కలిగించాయి.
H5N1
H7N9
H5N6
H5N8
మనుషులకు ఎలా వ్యాపిస్తుంది?
ఏవియన్ ఫ్లూ వ్యాధి సోకిన పక్షులు, కోళ్ళని పట్టుకున్నప్పుడు సోకుతుంది. అది జీవించి ఉన్నా లేదా మరణించి ఉన్నా కూడా వ్యాధి వ్యాపిస్తుంది.. డబ్యూహెచ్ఓ ప్రకారం వ్యాధి సోకిన పక్షులు వేసిన రెట్టలు తాకిన, చనిపోయిన కోళ్ళని వంటకు ఉపయోగించినా కూడా ఇన్ఫెక్షన్ కి గురయ్యే అవకసం ఉంది. అయితే పూర్తిగా ఉడికించిన మాంసం లేదా గుడ్లు తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకదు.
లక్షణాలు
⦿విపరీతమైన జ్వరం
⦿కండరాల్లో నొప్పి
⦿తలనొప్పి
⦿దగ్గు
⦿ఊపిరి ఆడకపోవడం
⦿అతిసారం
⦿కడుపు నొప్పి
⦿ఛాతీ నొప్పి
⦿ముక్కు, చిగుళ్ళలో రక్తస్రావం
⦿కండ్ల కలక
మానవుల్లో ఎలా నివారించాలి?
⦿నీరు, సబ్బుతో చేతులని శుభ్రం చేసుకోవాలి.
⦿తినడానికి ముందు మాంసం బాగా ఉడికించాలి
⦿ఫౌల్ట్రీతో సంబంధం పెట్టుకోవద్దు
⦿పక్షి రెట్టల దగ్గరకి వెళ్లకూడదు, తాకకూడదు
⦿పచ్చి మాంసం, గుడ్లు తినడం నివారించాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: వర్షాకాలంలో రోగాల బారిన పడకూడడంటే ఈ ఎనిమిది జాగ్రత్తలు తప్పనిసరి