News
News
X

Besan Kova: శెనగపిండి కోవా, చూస్తేనే నోరూరిపోతుంది

కోవాలు కేవలం పాలు, పాల పొడితోనే కాదు, శెనగపిండితో కూడా చేయచ్చు.

FOLLOW US: 

శెనగపిండి అనగానే అందరికీ గుర్తొచ్చేవి పకోడీలే, బజ్జీలే. కానీ వీటితో తీయటి కోవాలు కూడా తయారు చేయచ్చు. కోవాల పేరు చెబితేనే నోరూరిపోతుంది చాలా మందికి. పాలను విరగ్గొట్టి చేసే కోవాలే అధికంగా తింటూ ఉంటారు. ఈసారి శెనగపిండితో వండి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలపిస్తుంది. నోరూరిపోవడం ఖాయం. 

కావాల్సిన పదార్థాలు
శెనగపిండి - ఒక కప్పు
పాల పొడి - పావు కప్పు
నెయ్యి - అర కప్పు
కొబ్బరి తురుము - అర కప్పు
పంచదార పొడి - ముప్పావు కప్పు
పాలు - ఒక కప్పు

తయారీ ఇలా
1. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి అర స్పూను నెయ్యి వేయాలి. అందులో శెనగపిండి వేసి వేయించాలి. 
2. అవి కొంచెం రంగు మారాక మరికొంచెం నెయ్యి వేసి కలపాలి. రెండు మూడు నిమిషాలు వేయించాలి. 
3. అందులో పాల పొడి, కొబ్బరి తురుము వేసి వేయించాలి. 
4. అన్నింటినీ బాగా కలిసేలా  గరిటెతో కలపాలి. 
5. రెండు నిమిషాలు తరువాత పాలు వేసి బాగా కలపాలి. 
6. రెండు మూడు నిమిషాలు వేయిస్తే కళాయి అడుగు నుంచి మిశ్రమం వదిలి అంతా కలిపి ఓ ముద్దలా మారుతుంది.  
7. ఇప్పుడు పంచదార పొడి వేసి కలపాలి. 
8. పంచదార కరిగి ఆ మిశ్రమంలో కలుస్తుంది. రెండు మూడు స్పూన్ల నెయ్యి కూడా వేసి కలపాలి. 
9. మిశ్రమం దగ్గరగా కోవాలా అయ్యే వరకు ఉంచి మంటను కట్టేయాలి. 
10. మిశ్రమం కాస్త చల్లారాక చేతికి నెయ్యి రాసుకుని కోవాలా ఒత్తుకోవాలి. 
11. మీకు కావాలనుకుంటే నట్స్ ను కూడా కలుపుకోవచ్చు. కోవాపై ఒక బాదం పప్పునో, జీడిపప్పునో పెట్టుకోవచ్చు. 

శెనగపిండి ఉపయోగాలు...
శెనగపిండితో చేసే వంటకాలు అధికంగా పకోడీలు, బజ్జీలు, మోతిచూర్, బేసన్ లడ్డూలే. కానీ కోవా కూడా చేయొచ్చని తెలుసా? ఇది చాలా టేస్టుగా ఉంటుంది. శెనగపిండి మితంగా తింటే చాలా మంచిది కూడా. ఒక శెనగపిండి ద్వారా 356 కేలరీల శక్తి అందుతుంది. ప్రొటీన్లు, కార్బోహేడ్రేట్లు, విటమిన్ బి6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ కూడా అందుతుంది. అన్నట్టు ఇది గ్లూటెన్ ఫ్రీ కూడా. కాబట్టి గోధుమల కన్నా మంచిదనే చెప్పుకోవాలి. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ కూడా తక్కువ. కాబట్టి డయాబెటిక్ రోగులకు కూడా మేలే జరుగుతుంది. ఇందులో ఉండే పీచు పదార్ధాలు గుండెకు ఎంతో మేలు చేస్తుంది. శెనగపిండితో చేసిన వంటకాలు తినడం వల్ల బరువు కూడా పెరగరు. అలెర్జీలు కూడా రావు. ఏవైనా అలెర్జీలు ఉన్న వారు శెనగపిండి తో చేసే వంటకాలు తినడం వల్ల వారికి ఆ లక్షణాలు తగ్గుతాయి. రక్తహీనత ఉన్న వారికి శెనగపిండి మంచి ఎంపిక. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. రక్తపోటును నివారిస్తుంది. ఇది ఎదిగే పిల్లలకు చాలా అవసరం. దీనిలో గ్రోత్ హార్మోన్లు అధికం. 

Also read: ఈజిప్టు సమాధుల్లో వెల్లుల్లి రెబ్బలు, ప్రాచీన వైద్యంలో వీటిదే ప్రథమ స్థానం

 Also read: జ్వరం వచ్చినప్పుడు గుడ్లు, చేపలు, మాంసం తినవచ్చా?

Published at : 10 Sep 2022 02:17 PM (IST) Tags: Telugu recipes Simple Sweets in Telugu Besan kova Recipe Besan Recipes in Telugu Senaga pindi Recipe Telugu Vantlu

సంబంధిత కథనాలు

ఈ పండ్లను కలిపి తీసుకుంటున్నారా? అయితే, ఈ సమస్యలు తప్పవు!

ఈ పండ్లను కలిపి తీసుకుంటున్నారా? అయితే, ఈ సమస్యలు తప్పవు!

Covid-19: కోవిడ్-19, డెంగ్యూ లక్షణాల మధ్య తేడాని తెలుసుకోవడం ఎలా?

Covid-19: కోవిడ్-19, డెంగ్యూ లక్షణాల మధ్య తేడాని తెలుసుకోవడం ఎలా?

ప్లాస్టిక్ నుంచి డైమండ్స్ తయారీ, శాస్త్రవేత్తల అద్భుత సృష్టి!

ప్లాస్టిక్ నుంచి డైమండ్స్ తయారీ, శాస్త్రవేత్తల అద్భుత సృష్టి!

ఈ ఆహారాలు తరచూ తిన్నారో, త్వరగా ముసలివాళ్లయిపోతారు జాగ్రత్త

ఈ ఆహారాలు తరచూ తిన్నారో, త్వరగా ముసలివాళ్లయిపోతారు జాగ్రత్త

World’s Smallest Snake: ప్రపంచంలోనే అతి చిన్న పాము, దీన్ని వానపాము అని ముట్టుకుంటే..

World’s Smallest Snake: ప్రపంచంలోనే అతి చిన్న పాము, దీన్ని వానపాము అని ముట్టుకుంటే..

టాప్ స్టోరీస్

Revant Vs KTR : తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

Revant Vs KTR :  తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ