Onions Health Benefits: ఉల్లితో బొజ్జ మాయం.. వ్యాయమం చేయకుండానే కొవ్వును కరిగించేయండి ఇలా..
బొజ్జ పెరుగుతుందా? వ్యాయామం చేయకుండానే దాన్ని తగ్గించేయాలని అనుకుంటున్నారా? అయితే, ఇది ట్రై చేయండి.
బొజ్జ పెరుగుపోతుందని చాలామంది బాధపడిపోతారు. కానీ, దాన్ని తగ్గించుకోడానికి ఎన్నో వ్యాయామాలు ఉన్నా.. టైమ్ లేకపోవడం లేదా బద్దకంతో వాటికి దూరంగా ఉంటారు. ఒళ్లు వంచకుండానే బొజ్జ తగ్గించేసుకోవాలని భావిస్తారు. అలాంటి వారికి ఉల్లి.. భలే మేలు చేస్తుంది.
ఉల్లి ఆరోగ్యానికి మంచిదనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. ఉల్లి కూరలకు రుచిని అందివ్వడమే కాదు.. అందులో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదని అంటారు. అయితే.. ఉల్లి మరో మేలు కూడా చేస్తుందనే సంగతి చాలామందికి తెలీదు. ఉల్లిలో ఉండే.. ‘క్వెర్‌సెటిన్’
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఉల్లి సకల రోగాల నివారిణి. దాన్ని పచ్చిగా తినినా.. కూరలో వేసుకున్నా అందులోని పోషకాలు ఎప్పుడూ శరీరానికి మేలే చేస్తాయి. ముఖ్యంగా శరీరంలో కొవ్వు నిల్వలు పెరగకుండా సహాయపడుతుంది. ఉల్లిలో ఉండే ‘క్వెర్‌సెటిన్’ (Quercetin) అనే యాంటీ ఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ఇది శరీరంలో మెటబాలిజాన్ని పెంచుతుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. అంతేకాదు.. ఉల్లిలో కొలెస్ట్రాల్ కూడా తక్కువ. కేలరీలు, సోడియం వంటివి కూడా మితంగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలని భావించేవారికి ఉల్లి చాలా మేలు చేస్తుంది. అలాగే, చిన్న వయస్సులో పొట్ట వద్ద పేరుకుపోయే కొవ్వు(బొజ్జ)ను కరిగించేందుకు ఉల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా.. ఉల్లి రసం తాగడం వల్ల బొజ్జ తగ్గుతుందని అంటున్నారు. అంతేకాదు.. ఉల్లి రసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండుగా ఉన్నాయట.
ఉల్లితో ఆరోగ్యం మస్త్..: ఉల్లి గడ్డల్లో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే ఉల్లి రసాన్ని తీసుకుంటే బరువు తగ్గడమే కాకుండా.. మూత్రశయ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఉల్లిలో శరీరానికి మేలు చేసే కాల్షియం, ఐరన్, ఫైబర్, పొటాషియం, పాస్ఫరస్, మాంగనీస్, విటమిన్-C, విటమిన్-B6, ఉన్నాయి. ఉల్లిలోని సల్ఫర్ కాంపౌండ్లు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించేందుకు సహకరిస్తాయి. జ్వరం, జలుబుతో బాధపడేవారు.. ఉల్లి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుందట. రోజూ ఉల్లి గడ్డలను తినేవారికి చర్మ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయట. మొటిమలు, చర్మ సంబంధ ఇన్ఫెక్షన్ల నుంచి ఉల్లి మిమ్మల్ని రక్షిస్తుంది. క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది. బీపీ నియంత్రణకు సైతం ఉల్లి రసాన్ని తీసుకోవచ్చట. అయితే, వీటిలో ఏది చేయాలన్నా.. వైద్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే.. కొందరికి కొన్ని పండ్లు, పచ్చి కూరగాయల వల్ల అలర్జీలు రావచ్చు.
ఇలా చేయండి: ఉల్లి గడ్డలపై తొక్కలు ఒలిచి ముక్కలు చేయాలి. వాటిని మిక్సిలో వేసి.. కాస్త నీరు పోసి రసం చేయాలి. ఈ మిశ్రమంలో 1-2 టీ స్పూన్ల తేనె కలపండి. అంతే.. ఉల్లి రసం రెడీ. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే వైద్యుల సూచనతో తేనెను స్వల్ప మోతాదులో తీసుకోవాలి. ఉల్లి రసం చాలా చిక్కగా ఉంటుంది. గుజ్జు కూడా ఉంటుంది. మీకు గుజ్జుతో తాగడం ఇష్టం లేకపోతే.. దాన్ని వడపోసి కేవలం ఉల్లి రసాన్ని మాత్రమే తాగండి. ఇలా రోజు విడిచి రోజు పరగడపునే ఉల్లి రసాన్ని తీసుకుంటే బరువుతోపాటు పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు కూడా తరిగిపోతుంది. బొజ్జ మాయమవుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని తీసుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క
Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి