Weight Loss Tips in Telugu : బరువు తగ్గడానికి జిమ్‌కే వెళ్లక్కర్లేదు.. కూర్చునే పొట్ట తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
Belly Fat : పొట్టతగ్గించుకోవాలని ఉన్నా.. ఎన్నో కారణాల వల్ల అది సాధ్యం కాదు. అయితే మీరు కూడా బెల్లీ తగ్గించుకోవాలని చూస్తున్నారా? అయితే మీరు వీటిని ఫాలో అయితే కూర్చొని కూడా పొట్ట తగ్గించుకోవచ్చు.

Easy Seated Fat Burning Tips : బరువు తగ్గడం (Weight Loss) అంటుంచితే.. పొట్ట పెరిగిపోతుందిరా బాబు.. ఎలా అయినా తగ్గించాలి అనుకునేవాళ్లు చాలామందినే ఉంటారు. అయితే కొన్ని కారణాల వల్ల జిమ్‌కి వెళ్లలేకపోవచ్చు. వ్యాయామం చేయలేకపోవచ్చు. వీటికి తగ్గట్లు మీరు ఎక్కువసేపు కూర్చొని చేసే జాబ్ కావచ్చు. ఇవన్నీ మీరు బరువు పెరగడంతో పాటు పొట్ట పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అలాగే కొందరు బద్ధకం వల్ల కూడా ఎలాంటి వ్యాయామాలు చేయరు. మీరు కూడా అలాంటివారిలో ఒకరా? అయితే ఇది మీకోసమే.
కేవలం వ్యాయమంతోనే కాదు.. కూర్చొని కూడా బరువు తగ్గవచ్చట. అవును మీరు విన్నది నిజమే. మీరు ఎక్కడైతే కూర్చొని ఉన్నారో.. అక్కడే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఉంటే.. మీరు కచ్చితంగా పొట్ట తగ్గించుకోవచ్చని చెప్తున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో.. వాటివల్ల మీరు ఎలా పొట్ట ఎలా తగ్గుతుందో చూసేద్దాం.
టమ్మీ ట్విస్ట్స్.. (Seated Tummy Twists)
ఇది చాలా సింపుల్. మీరు డెస్క్ దగ్గర కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. చేతులను డెస్క్‌పై ఉంచి.. సపోర్ట్ తీసుకుంటూ శరీరాన్ని ఎడమ వైపు ఓసారి.. కుడివైపు మరోసారి తిప్పాలి. ఇలా 20 సార్లు ట్విస్ట్ చేయాలి. ఇది సైడ్ అబ్స్ను టోన్ చేసి పొట్ట తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.
కూర్చొని మోకాలు ఎత్తడం (Seated Knee Lifts)
ముందుగా నిటారుగా కూర్చోవాలి. ఒక్కోసారి ఒక్కో మోకాలిని ఛాతీకి దగ్గరగా పెట్టుకుని కాసేపు పట్టుకోవాలి. సింగిల్‌గానే కాకుండా రెండు కాళ్లు కలిపి కూడా ఇలా చేయవచ్చు. ఇది పొట్ట కింద భాగాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
కూర్చొని వంగడం.. (Seated Side Bends)
కుర్చీలో కూర్చుని చేతులు పైకి ఎడమవైపునకు వంగాలి. అలాగే కుడివైపునకు వంగాల్సి ఉంటుంది. ఇలా వంగిన ప్రతిసారి 5 సెకన్లు ఆగి.. మళ్లీ యథాస్థానానికి రావాలి. ఇది సైడ్ ఫ్యాట్‌ని తగ్గించి పొట్టను కరిగించడంలో హెల్ప్ చేస్తుంది.
బెల్లీ బ్రీతింగ్ (Deep Belly Breathing)
కూర్చోలో స్ట్రైయిట్‌గా కూర్చోవాలి. ఇప్పుడు ముక్కు ద్వారా గాలిని లోపలికి నిండుగా పీల్చాలి. తర్వాత నెమ్మదిగా పొట్టను లోపలకి లాగుతూ గాలిని వదలాలి. ఇలా పది నిమిషాలు చేయాలి. ఇది ఫ్యాట్ బర్న్ చేయడాన్ని యాక్టివేట్ చేస్తుంది.
చేతులు తిప్పడం (Seated Arm Circles)
కూర్చొన్న ప్లేస్‌లో చేతులు చాపి.. వాటిని క్లాక్ వైజ్.. యాంటీ క్లాక్‌వైజ్ తిప్పాలి. ఇలా చేయడం వల్ల హార్ట్ రేట్ పెరిగి క్యాలరీలు బర్న్ అవుతాయి. అలాగే కూర్చొని చిన్న చిన్న స్ట్రెచ్‌లు చేయవచ్చు. దీనివల్ల మెటబాలీజం పెరిగి.. పొట్టను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
ఇవి మరవకండి..
కుర్చొని చేసే ఈ పనులతో పాటు.. డైట్ విషయంలో కొన్ని మార్పులు చేస్తే మంచి ఫలితాలు చూడవచ్చు. షుగర్, సాఫ్ట్ డ్రింక్స్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. గ్రీన్ టీ లేదా లెమన్ వాటర్ తాగాలి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే మంచిది. అలాగే హైడ్రేషన్ ముఖ్యం. కాబట్టి నీటిని ఎక్కువగా తాగాలి. అలాగే ఎప్పుడూ కూర్చన్న వెన్నును వంచి కాకుండా నిటారుగా ఉంచాలి.
ఈ టిప్స్ అన్ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉంటే చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. కంటిన్యూ చేసినా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే వీటితో పాటు వ్యాయామం చేస్తే బెటర్ రిజల్ట్స్ చూడవచ్చని చెప్తున్నారు నిపుణులు.























