Tips to Control Your Body : ఆందోళన, బద్ధకం, నిద్రలేమికి చెక్ పెట్టే 7 సింపుల్ చిట్కాలు.. మీరు ట్రై చేయండి
Crazy Body Hacks : కొన్ని సందర్భాల్లో యాంగ్జైటీ, ఆందోళన వంటివాటితో పాటు కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. అయితే వాటిని దూరం చేసుకునేందుకు ఈ క్రేజీ టిప్స్ ఫాలో అయిపోండి.

Fun Hacks to Stay Calm and Active : కొన్నిసార్లు మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. ఉదాహరణకు బద్ధకంగా ఉండడం, యాక్టివ్‌గా లేకపోవడం లేదా ఆందోళన చెందడం, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే అలాంటి సమయాల్లో ఏ పని చేయబుద్ధి కాదు. అప్పుడు మీ బాడీని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వవచ్చు. అవేంటంటే..
ఆందోళన..
చాలామంది ఏదైనా కొత్త పని చేసేప్పుడు లేదా ఏ వ్యక్తితో అయినా మాట్లాడాలనుకున్నప్పుడు నెర్వస్‌గా ఫీల్ అవుతారు. అలాంటప్పుడు మీరు కామ్ అవ్వడానికి ఓ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి. అదేంటంటే.. మీ ముక్కుని గిల్లుకోండి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి శరీరం అలెర్ట్ అవుతుందట. అయితే ఇది పర్మినెంట్ కాదు. Deep breathing లేదా grounding techniques ఆందోళన తగ్గిస్తాయి.
యాక్టివ్‌గా లేనప్పుడు..
వివిధ కారణాల వల్ల చాలామందికి ఓపిక ఉండదు. చేయాల్సిన పని ఎంత ఉన్నా.. శక్తి తగ్గుతుంది. అలాంటప్పుడు చల్లని నీటిని ముఖంపై చల్లుకోవాలి. ఓ పది నుంచి 15 సార్లు నీటిని ముఖానికి కొట్టాలి. అప్పుడు మీరు వెంటనే యాక్టివ్ అవుతారు. స్లీప్ ఫీలింగ్ పోతుంది. అందుకే ఈ టెక్నిక్‌ని ఎనర్జీ బూస్టర్స్ అంటారు.
నిద్ర రానప్పుడు..
నిద్ర సమస్యలు చాలామందికి ఉంటాయి. అయితే మీకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా నిద్రరావట్లేదు అనుకున్నప్పుడు కళ్లను ఓ నిమిషంపాటు కంటిన్యూగా బ్లింక్ చేయాలట. అలా చేస్తే కళ్లు అలసి నిద్రవచ్చే అవకాశం ఉందట. అయితే డిమ్ లైట్, ఫోన్ దూరంగా ఉంచడం, స్లో బ్రీతింగ్ వల్ల మంచిగా నిద్ర వస్తుంది.
ముక్కు దిబ్బడ
జలుబు చేసినప్పుడు, వివిధ సందర్భాల్లో ముక్కు పట్టేస్తుంది. ఆ సమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ఐస్‌క్యూబ్‌ను ముక్కుకి, నోటికి మధ్యలో ఉంచండి. దీనివల్ల ముక్కు దిబ్బడ పోతుందట. ఇది కేవలం తాత్కలిక రిలీఫ్ ఇస్తుంది. మంచి ఫలితాల కోసం ఆవిరి పీల్చడం లేదా సాల్ట్ వాటర్ నాసల్ రిన్స్ చేయవచ్చు.
యాంగ్జైటీతో ఇబ్బంది పడుతుంటే..
యాంగ్జైటీతో చాలామంది ఇబ్బందులు పడతారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరు అయితే యాంగ్జైటీని కంట్రోల్ చేయడానికి మీ చేతిని గుండెపై ఉంచి.. నెమ్మదిగా గాలి పీల్చుకుని వదలండి. ఇలా స్లో బ్రీతింగ్ చేయడం వల్ల బాడీ మీ కంట్రోల్లోకి వస్తుంది. యాంగ్జైటీ తగ్గుతుంది.
నిద్రలేవలేకపోతుంటే..
ఉదయాన్నే నిద్రలేవలేకపోవడం కాస్త కష్టంతో కూడిన పనే. అలారం పెట్టుకున్నా చాలామంది నిద్రలేచేందుకు ఇబ్బంది పడతారు. ఆ సమయంలో మీరు బ్రీత్ను ఓ పది సెకన్లు పట్టుకోండి. ఆక్సీజన్ రష్ వల్ల మీకు తొందరగా మెలకువ వస్తుంది. అయితే దీనిని ఎక్కువసార్లు చేస్తే కళ్లు తిరిగే అవకాశం ఉంది.
బద్ధకంగా ఉంటే..
మీరు లేజీగా ఉన్నప్పుడు యాక్టివ్ అవ్వడానికి మీరు బ్రష్ చేయండి. అయితే మీకు రైట్ హ్యాండ్ అలవాటు ఉంటే.. లెఫ్ట్ హ్యాండ్‌తో బ్రష్ చేయండి. ఇలా వ్యతిరేకంగా చేయడం వల్ల బ్రెయిన్ యాక్టివ్ అవుతుందని చెప్తున్నారు.
ఈ సింపుల్ టిప్స్ చూసేందుకు సిల్లీగా ఉన్నా ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి. మీరు కూడా ఓసారి ట్రై చేసేయండి.






















