సమంత రుత్ ప్రభు తన అత్యున్నత వ్యక్తిత్వాన్ని గౌరవించేలా తన ఆలోచనలు, మాటలు, పనులు ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది.
కొన్ని సందర్భాల్లో మౌనమే సరైన ఆన్సర్ అని చెప్తోంది. నిజమైన ఫీలింగ్ మాటల ద్వారా కాకుండా ఆత్మపరిశీలన ద్వారా వస్తుందని చెప్పింది.
సమంతా తన ఇన్స్టాగ్రామ్లో పూజ చేస్తూ కనిపించింది. వ్యాయామం చేస్తూ, కుక్కలతో ఆడుకుంటున్న ఫోటోలను పంచుకుంది. తన సమతుల్యమైన లైఫ్స్టైల్ని అభిమానులకు చూపించింది.
ఒక ప్రత్యేకమైన ఫోటోకు సమంతను పూజ చేస్తూ కనిపించింది. ఇది సంప్రదాయ, ఆధ్యాత్మికతతో ఆమెకున్న సంబంధాన్ని హైలైట్ చేస్తుంది.
ఇన్స్టాగ్రామ్లో Q&A lo ఒక అభిమాని సమంత దృష్టిని ఆకర్షించిన కోట్ గురించి అడగ్గా.. నిన్ను బాధపెట్టిన విషయాల్లో నీ లక్ష్యం దొరకుతుంది.. ఈ కోట్ గురించి ప్రస్తావించింది.
సమంత తన పాఠశాల రోజులను గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పింది. నేను స్కూల్లో సానుభూతి, దయ నేర్చుకున్నాను. ఇవి నాకు ఇప్పుడు బాగా కలిసి వస్తున్నాయి. చదువు కంటే విలువలకే ప్రాధాన్యత ఇచ్చిదానిని చెప్పుకొచ్చింది సమంత.
సమంత చివరిగా 2023 చిత్రం ఖుషిలో కనిపించింది. ఇందులో విజయ్ దేవరకొండ సరసన నటించింది.
సమంత తన నిర్మొహమాటమైన పోస్టుల ద్వారా తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది..
ధ్యానం నుంచి సానుభూతి వరకు సమంత తనకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.