మహిళల్లో పొట్ట పెరగడానికి కారణాలు ఇవే

మహిళల్లో పొట్ట పెరగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాటిలో హెల్త్ సమస్యలు కూడా ఉంటాయి.

ముఖ్యంగా హార్మోనల్ సమస్యలు పొట్ట పెరగడానికి కారణమవుతాయి. PCOS ఉంటే బెల్లీ ఫ్యాట్ వస్తుంది.

థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కూడా ఈ సమస్య ఉంటుంది. అలాగే మోనోపాజ్ సమయంలో కూడా ఎక్కువ అవుతుంది.

కేలరీలు ఎక్కువగా ఉండే, షుగర్, ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం వల్ల కూడా పొట్ట పెరుగుతుంది.

వ్యాయామం చేయకపోవడం వల్ల మెటబాలీజం తగ్గుతుంది. ఇది బెల్లీ ఫ్యాట్​కు కారణమవుతుంది.

ఒత్తిడిని, నిద్ర లేకపోవడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

టైప్​ 2 డయాబెటిస్ ఉన్నవారు, ప్రీ డయాబెటిస్ ఉన్నవారికి కూడా బెల్లీ ఫ్యాట్ వస్తుంది.

కొందరికి జెనిటిక్స్ వల్ల కూడా ఈ ఫ్యాట్ వస్తుంది. వయసు పరంగా కూడా పొట్ట పెరుగుతుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే కూడా బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది.