Foot Cracks : పాదాలు పగిలిపోవడానికి కారణాలివే.. మృదువైన పాదాలకోసం ఫాలో అవ్వాల్సిన టిప్స్
Tips to Reduce Foot Cracks : పాదాలు పగిలిపోవడానికి వివిధ కారణాలు ఉంటాయి. వాటిని గుర్తించి కొన్ని ఇంటిచిట్కాలు ఫాలో అయితే మృదువైన పాదాలను సొంతం చేసుకోవచ్చు.

Tips for Beautiful Feet : చాలామందికి పాదాలు పగిలిపోతూ ఉంటాయి. సాధారణంగా వయసు పెరిగే కొద్ది ఫూట్ క్రాక్స్ వస్తాయనుకుంటారు కానీ.. పాదలు పగిలిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇలా పగిలిపోయిన పాదాలు ఎంటైర్ లుక్‌నే మార్చేస్తాయి. చూసేందుకు కాస్త చిరాకుగా కూడా ఉంటాయి. మరికొందరికి పాదాలు పగిలి నొప్పి, మంటను కలిగిస్తాయి. పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు రక్తం కూడా కారుతుంది. అసలు పాదాలు పగలడానికి కారణాలు ఏముంటాయి? వాటిని ఇంటి చిట్కాలతో దూరం చేసుకోవచ్చో లేదో ఇప్పుడు చూసేద్దాం.
పాదాలు పగిలిపోవడానికి కారణాలివే..
డ్రై స్కిన్ : డ్రై స్కిన్ ఉన్నవారికి పాదాలు పగిలిపోతూ ఉంటాయి. వారి స్కిన్ పొడిబారిపోయి ఉండడం వల్ల పాదాలు త్వరగా పగిలిపోతాయి.
ఎక్స్పోజర్ : నీటిలో ఎక్కువ ఉండేవారికి, కఠినమైన సబ్బులు ఉపయోగించేవారు.. ఉష్ణోగ్రతల్లో మార్పులు కూడా పాదాలు పగలడానికి కారణమవుతాయి.
కేర్ తీసుకోకపోవడం : కొందరు ముఖంపై పెట్టినంత శ్రద్ధ పాదాలపై పెట్టరు. వారు తీసుకునే కేర్‌లో కొంచెం అయినా పాదాలకు తీసుకుంటే.. పాదాలు పగలకుండా ఉంటాయి. మరికొందరు కనీసం పాదాలకు మాయిశ్చరైజర్, ఎక్స్ఫోలియేట్ చేయడం, పాదాలను ప్రొటెక్ట్ కూడా చేయరు.
మెడికల్ కండీషన్స్ : మరికొందరిలో మెడికల్ రీజన్స్ వల్ల కూడా పాదాలు పగులుతాయి. ఎగ్జిమా, సొరియాసిస్, డయాబెటిస్ ఉన్నవారిలో పాదాలు పగలడం ఎక్కువగా కనిపిస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
మాయిశ్చరైజర్ : పాదాలకు మాయిశ్చరైజర్‌ను తప్పకుండా అప్లై చేయాలి. స్నానం చేసిన తర్వాత, కాళ్లు కడిగిన తర్వాత కాళ్లకు కచ్చితంగా మాయిశ్చరైజర్‌ను రెగ్యులర్‌గా అప్లై చేయాలి.
ఎక్స్ఫోలియేషన్ : వారానికోసారి అయినా.. డెడ్ స్కిన్ సెల్స్‌ను క్లియర్ చేసుకోవడానికి ఎక్స్ఫోలియేట్ చేయాలి. స్ర్కబ్ లేదా స్టోన్‌తో పాదాలను మృదువుగా ఎక్స్ఫోలియేట్ చేయాలి.
చెప్పులు : కాళ్లకు ఫిట్ అయ్యే చెప్పులను, నొక్కిసి ఉండేలా కాకుండా కంఫర్ట్‌గా ఉండే, సపోర్ట్‌నిచ్చే చెప్పులను మాత్రమే ఎంచుకోవాలి. వీటివల్ల పాదాల పగుళ్లు తగ్గుతాయి.
హైడ్రేషన్ : స్కిన్ హెల్తీగా ఉండేందుకు హైడ్రేటెడ్‌గా ఉండాలి. చర్మం పొడిబారడం తగ్గి.. హైడ్రేటెగా ఉంటుంది. దీనివల్ల చర్మం లోపలి నుంచి మాయిశ్చరైజర్‌ని, పోషణను పొందుతుంది. దీనివల్ల పగుళ్లు తగ్గుతాయి. ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి.
సాక్స్‌లు వేసుకుని బయటకు వెళ్తే మంచిది. డ్రైగా ఉండే ప్రదేశాల్లో హ్యూమిడిఫైర్ ఉపయోగించాలి. కఠినమైన సబ్బులను దూరంగా ఉంచుకోవాలి. నీటిలో కాళ్లను ఎక్కువగా ఉంచకూడదు. పెడిక్యూర్ రెగ్యులర్‌గా చేయిస్తే కూడా పాదాలు శుభ్రంగా పగలకుండా ఉంటాయి. ఇంట్లో కూడా పెడిక్యూర్ చేసుకోవచ్చు. ఇంటి చిట్కాలతో ఫలితం లేదనుకుంటే కచ్చితంగా వైద్యుల సహాయం తీసుకోవాలి. ముఖ్యంగా పాదాలు పగిలినప్పుడు వాటిలోపలకి డస్ట్ వెళ్లుకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

