పాదాలు పగిలే సమస్య ఎక్కువగా ఉంటే ఇంట్లోనే కొన్ని టిప్స్​ని ఫాలో అవుతూ తగ్గించుకోవచ్చు.

ఓ టేబుల్ స్పూన్ ఆలివ్​ నూనెలో ఓ టేబుల్ స్పూన్ పంచదార వేసి దానితో పాదాలు పగిలిన చోట స్క్రబ్ చేస్తే మంచిది.

కొబ్బరి నూనెను పాదాలకు అప్లై చేస్తే మంచిది. స్నానం చేసిన తర్వాత రాస్తే హైడ్రేటెడ్​గా ఉండి పగుళ్లను తగ్గిస్తాయి.

అరటిపండు గుజ్జులో తేనే వేసి దానిని పాదాలకు మాస్క్​లా అప్లై చేసి పావుగంట తర్వాత కడిగితే స్మూత్​గా అవుతాయి.

వాజెలిన్​ను నిమ్మరసాన్ని కలిపి సమానంగా కలిపి పాదాలకు అప్లై చేసి రాత్రంతా ఉంచితే.. పగుళ్లు తగ్గుతాయి.

షియా బటర్​ను పాదాలకు అప్లై చేస్తే పగుళ్లు తగ్గి.. మాయిశ్చరైజర్​గా ఉంటాయి.

అలోవెరా జెల్​ను పాదాలకు రాసి అప్లై చేస్తే పగుళ్లు, నొప్పి తగ్గుతాయి.

పాదాలను గోరువెచ్చని నీటిలో ఉంచి.. ఓట్​మీల్​తో స్క్రబ్ చేస్తే డర్ట్ పోతుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణులు సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.