News
News
X

Cancer: పొట్టలో తరచూ అసౌకర్యంగా అనిపిస్తుందా? జాగ్రత్త, అది క్యాన్సర్ సంకేతం కావొచ్చు

సాధారణ కడుపు నొప్పి వస్తేనే అల్లాడిపోతారు. అటువంటిది అదే నొప్పి తరచుగా అనిపిస్తే నిర్లక్ష్యం వహిస్తున్నారా? జాగ్రత్త ప్రమాదకర క్యాన్సర్ గా మారొచ్చు.

FOLLOW US: 
 

ప్రపంచంలోని ప్రమాదకర అనారోగ్యాల్లో క్యాన్సర్ ఒకటి. శరీరంలోని ఒక్కో భాగానికి ఒక్కో రకమైన క్యాన్సర్ వస్తుంది. గతంలో క్యాన్సర్ బారిన పడితే ప్రాణాలు నిలవడం కష్టం అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఎంతటి క్యాన్సర్ కి అయినా చికిత్స అందుబాటులో ఉంటుంది. అయితే క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు కనుగొంటే వ్యాధి నిర్ధారణ, చికిత్స చాలా సులభం అవుతుంది. అనారోగ్యపు ఆహారపు అలవాట్ల కారణంగా ఇప్పుడు పొట్ట క్యాన్సర్ సాధారణంగా మారిపోయింది. దీన్నే కొంతమంది ఉదర క్యాన్సర్ లేదా కడుపు క్యాన్సర్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. పొట్ట లోపలి పొరపై అసాధారణంగా కణాలు పెరిగి అవి పుండ్లుగా మారిపోతున్నాయి. అవే క్యాన్సర్ గా రూపాంతరం చెందుతుంది.

దాదాపు 60 శాతం క్యాన్సర్లు 65 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఇవి పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. డీఎన్ఏ మార్పుల వల్ల చాలా సంవత్సరాలుగా ఈ వ్యాధి నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. ఇది కణాలని దెబ్బతీస్తుంది. దూమపానం, పేలవమైన ఆహార ఎంపికలు లేదా తరచుగా యాసిడ్ రిఫ్లక్స్‌తో కలిసి ప్రమాద తీవ్రత పెంచుతుంది. ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలు గుర్తిస్తే సకాలంలో చికిత్స తీసుకోవచ్చు. కడుపు క్యాన్సర్ రోగి దీర్ఘకాలిక జీవన నాణ్యతని మెరుగుపరచడానికి చికిత్స చేయవచ్చు.

పొట్ట ఉబ్బడం

కడుపు ఉబ్బరం, పొట్ట ఉబ్బడం మధ్య వ్యత్యాసం ఉంది. పొట్ట ఉబ్బితే బాధాకరంగా అనిపిస్తుంది. ఈ నొప్పి వల్ల చాలా సౌకర్యంగా ఉంటుంది. వ్యాధి ముదిరే కొద్ది నొప్పి తీవ్రత అధికం అవుతుంది. ఎక్కువ ఉప్పు, ధూమపానం, ప్రాసెస్ చేసిన ఆహారం, కాల్చిన, నూనె అధికంగా మాంసాహారం తిన్నప్పుడు ప్రమాదం పెరుగుతుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పేర్కొంది.

అసాధారణంగా బరువు తగ్గడం

పొట్ట బాగా నిండుగా అనిపించి వాపు రావడం వల్ల బాధగా అనిపిస్తుంది. తద్వారా ఆకలి తగ్గుతుంది. ఖచ్చితమైన కారణం తెలియకుండా బరువు తగ్గడం జరుగుతుంది. ఈ వ్యాధి ప్రారంభ లక్షణాల్లో ఇది ప్రధానమైనదిగా వైద్యులు చెబుతున్నారు. ఇది ఎక్కువ కాలం పాటు కొనసాగితే అసలు నిర్లక్ష్యం చెయ్యకూడదు. క్యాన్సర్ తినడాన్ని కష్టతరం చేస్తుంది. ఎందుకంటే శరీరం ఆరోగ్యకరమైన కణాల నుంచి ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. విశ్రాంతి సమయంలో ఎక్కువ శక్తిని బర్న్ చేస్తుంది.

News Reels

గుండెల్లో మంట

ఉదర క్యాన్సర్ మరొక సాధారణ ప్రారంభ సంకేతం గుండెల్లో మంట. కడుపులోని ఆమ్లాలు ఆహారాన్ని విచ్చిన్నం చేయడానికి, జీర్ణం చెయ్యడానికి బాధ్యత వహిస్తాయి. అజీర్ణం లేదా కణతి కారణంగా గుండెల్లో మంటగా అనిపిస్తుంది. పరిస్థితి తరచుగా తీవ్రంగా ఉంటే తప్పనిసరిగా వైద్యులని సంప్రదించాలి.

పొత్తి కడుపు నొప్పి

తరచుగా లేదా నిరంతరంగా భరించలేనంతగా పొత్తి కడుపులో నొప్పి వస్తే అది పొట్టలో కణతి ఉన్నట్టు సూచిస్తుంది. వ్యాధి ప్రారంభ దశలో ఈ లక్షణాలు చూపించనప్పటికి అజీర్ణం, పొత్తి కడుపు ఎగువ భాగంలో నొప్పి వస్తుంది. కాలక్రమేణా అలసట, వాంతిలో రక్తం పడటం, మలం నల్లగా రావడం కూడా జరుగుతుంది.

వికారం, వాంతులు

క్యాన్సర్ కణితి వల్ల తరచుగా వికారం, వాంతులు సంభవిస్తాయి. కడుపులోని ఆమ్లాల స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల ఇది హానికరమైన బ్యాక్టీరియాని పెంచుతుంది. అటువంటి సమయంలో పొట్టలో అల్సర్లు వచ్చే అవకాశం ఉంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also read: గుండె జబ్బులు రాకుండా ఉండాలా? ఈ ఆహారాలు తింటే సరి

Published at : 08 Nov 2022 02:27 PM (IST) Tags: Stomach Cancer Cancer risks Gastric Cancer Symptoms of Stomach Cancer

సంబంధిత కథనాలు

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజూ ఈ పిండితో చేసిన రోటీలు తినండి - ఆ నటి డైట్ ఇదేనట!

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజూ ఈ పిండితో చేసిన రోటీలు తినండి - ఆ నటి డైట్ ఇదేనట!

Ears Cleaning: ఇయర్ బడ్స్‌తో చెవులు శుభ్రం చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేశారంటే వినికిడి లోపం రావొచ్చు

Ears Cleaning: ఇయర్ బడ్స్‌తో చెవులు శుభ్రం చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేశారంటే వినికిడి లోపం రావొచ్చు

Cancer: వైన్ ఆరోగ్యానికి మంచిదేనా? క్యాన్సర్ ప్రమాదం ఉందా?

Cancer: వైన్ ఆరోగ్యానికి మంచిదేనా? క్యాన్సర్ ప్రమాదం ఉందా?

Garlic: చలికాలంలో వెల్లులి తింటే జలుబు, దగ్గు దరిచేరవా?

Garlic: చలికాలంలో వెల్లులి తింటే జలుబు, దగ్గు దరిచేరవా?

టాప్ స్టోరీస్

TS Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

TS Govt :  తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?