అన్వేషించండి

Sleep: అర్థరాత్రి దాటాక మెలకువ వస్తుంటే జాగ్రత్త పడాలి - ఈ వ్యాధులు ఉన్నాయేమో చెక్ చేసుకోండి

నిద్రలో రోజూ అర్థరాత్రి దాటాక మెలకువ వస్తుంటే తేలికగా తీసుకోకూడదు.

కొందరికి త్వరగానే నిద్ర పట్టేస్తుంది. కానీ ఎందుకో అర్థరాత్రి నిద్ర నుంచి మెలకువ వస్తుంది. దాహం వల్లో, మూత్ర విసర్జనకో మెలకువ రావడం సహజం. కానీ అర్థరాత్రి తరచూ తెలివి వచ్చి, మళ్లీ  నిద్రపట్టడం కష్టంగా మారుతుంది. చెడ్డ కలలు వచ్చి కూడా తెలివి వస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, అర్ధరాత్రి 1-3 గంటల మధ్య మెలకువ రావడం, తిరిగి నిద్రపోలేకపోవడం మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇలా తెలివి రావడానికి కొన్ని అనారోగ్య కారణాల వల్ల కావచ్చు. వాటిలో ఒత్తిడి,  కాలేయ సమస్యలు, నిద్ర సమస్యల వల్ల కావచ్చును.

ప్రతిరోజూ తెల్లవారు జామున ఒంటిగంటల నుంచి మూడు వరకు నిద్రలోంచి మెలకువ వచ్చి, మళ్లీ నిద్రపోలేకపోవడం వల్ల  శరీరానికి  దీర్ఘకాలిక సమస్యలు రావడం మొదలవుతాయి. వీటిలో కొన్ని ప్రాణాంతకమైనవి కూడా ఉన్నాయి. ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జనాభాలో 10-20 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ సంఖ్య గత రెండేళ్లలోనే 40 శాతానికి పెరిగింది. 

నిద్ర చక్రం అంటే ఏమిటి?
వైద్యుల అభిప్రాయం ప్రకారం, ఒక రాత్రిలో మన శరీరం అనేక నిద్ర చక్రాలను (స్లీప్ సైకిల్) ఎదుర్కొంటుంది. సాధారణంగా ఒక్కరాత్రిలో పెద్దవారు ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోతారు. ఈ సమయంలో అనేక నిద్రచక్రాలు ఉంటాయి. మొదట మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. తరువాత తేలికపాటి నిద్ర. ఆ తరువాత గాఢ నిద్ర. అనంతరం REM నిద్ర. ఈ సమయంలో కలలు వస్తాయి. 

ఎందుకు మేల్కొంటారు?
నిద్రచక్రాలు అన్నీ సమర్థంగా పనిచేస్తే హాయిగా నిద్రపోతారు. కానీ కొందరు అర్థరాత్రి ఒంటిగంట దాటాక మెలకువ వచ్చేస్తుంది. దీనికి కారణం ఒత్తిడి కూడా కావచ్చు. స్థిరమైన, దీర్ఘకాలిక ఒత్తిడితో బాధపడుతూ ఉంటే, మీ శరీరం ఇలా నిద్రసమస్యలను ఎదుర్కొంటుంది. దీనివల్ల రక్తపోటు స్థాయిలను, హృదయ స్పందన రేటును పెంచుతుందని వైద్యులు అంటున్నారు.

వృద్ధాప్యం
మీ నిద్రపై  మీ వయసు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర చక్రాలు మారుతాయి. ముసలితనం అనేది నిద్రపై తీవ్రమైన ప్రభావాలు పడతాయి. అలాగే కొన్ని రకాల మందులు వాడడం వల్ల కూడా నిద్రపై చాలా ప్రభావం పడుతుంది. 
1. యాంటీ డిప్రెసెంట్స్
2. బీటా-బ్లాకర్స్
3. కార్టికోస్టెరాయిడ్స్
4. జలుబు, దగ్గు కోసం వాడే కొన్ని మందులు
5. మూత్రవిసర్జన కోపం వాడే మందులు

ఈ సమస్యలు ఉన్నా..
అంతర్గతంగా మీకు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అర్థరాత్రి నిద్ర నుంచి మెలకువ వస్తుంది. 

1. స్లీప్ అప్నియా
2. గ్యాస్ట్రిక్ సమస్యలు
3. ఆర్థరైటిస్
4. డిప్రెషన్
5. నరాలవ్యాధి
6. మెనోపాజ్
7. ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు
8. థైరాయిడ్ గ్రంధి అతి చురుగ్గా పనిచేయడం

Also read: కోపం ఎక్కువగా వచ్చేస్తోందా? కారణాలు ఇవి కావచ్చు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu - Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu - Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Embed widget